By: ABP Desam | Updated at : 24 May 2023 12:44 PM (IST)
Edited By: omeprakash
ఏపీ పీజీఈసెట్ అడ్మిట్ కార్డు
ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, ఫార్మసీ పీజీ కోర్సు్ల్లో ప్రవేశాలకు నిర్వహించే 'ఏపీ పీజీఈసెట్-2023 పరీక్ష హాల్‌టికెట్లను ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ప్రవేశ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు తమ పీజీఈసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేది, పరీక్ష పేపర్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 28 నుంచి 30 వరకు రెండు సెషన్లలో పీజీఈసెట్ ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉ.10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్న 3.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష మరుసటి రోజే ఆన్సర్ కీ..
మే 28 నుంచి 30 వరకు నిర్వహించే పీజీఈసెట్ ఆన్సర్ కీలను మే 29 నుంచి 31 వరకు అంటే పరీక్ష జరిగిన మరుసటి రోజు విడుదల చేయనున్నారు. మే 28న జరిగే పరీక్ష కీని మే 29న సాయంత్రం 6 గంటలకు విడుదల చేసి, ఆన్సర్ కీపై అభ్యంతరాలను మే 31న సాయంత్రం 6 గంటల వరకు స్వీకరిస్తారు. ఇక మే 29న జరిగే పరీక్ష కీని మే 30న సాయంత్రం 6 గంటలకు విడుదల చేసి, జూన్ 1న సాయంత్రం 6 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. అలాగే మే 30న జరిగే పరీక్ష కీని మే 31న సాయంత్రం 6 గంటలకు విడుదల చేసి, జూన్ 2న సాయంత్రం 6 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు.
పరీక్ష విధానం..
మొత్తం 120 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్ మీడియలోనే ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. విద్యార్థులకు డిగ్రీ స్థాయిలో చదివిన సబ్జెక్టుల నుంచే ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం మాక్ టెస్టులకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షలో కనీసం అర్హత మార్కులను 25 శాతం అంటే 30 మార్కులుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి కనీస అర్హత మార్కులు లేవు.
ఏపీ ఈసెట్ నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగం కీ విడుదల, అభ్యంతరాలకు 26 వరకు అవకాశం!
ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు ముగియడంతో.. ఇంజినీరింగ్ పరీక్షల ప్రాథమిక కీని అధికారులు మే 23న విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల తేదీలవారీగా మాస్టర్ క్వశ్చన్ పేపర్లను, ఆన్సర్ కీని అందుబాటులో ఉంచారు. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా విడుదల చేశారు. ఆన్సర్ కీపై అభ్యంతరాలకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు మే 26 ఉదయం 9 గంటల వరకు అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం ఉంది.
ఈఏపీసెట్ ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఎప్పుడంటే?
తెలంగాణలో ఎంసెట్ ఫలితాల వెల్లడికి సమయం ఆసన్నమైంది. మే 25న ఎంసెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ డా. బి.డీన్ కుమార్ మే 23న ఒక ప్రకటనలో తెలిపారు. మే 25న ఉదయం 11 గంటలకు కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ క్యాంపస్‌లోని గోల్డెన్ జూబ్లీ సెమినార్ హాల్‌లో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ఉన్నత విద్యా కార్యదర్శి వి.కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, జేఎన్‌టీయూ-హైదరాబాద్ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి తదితరులు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
PSTU Admissions: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!
Eklavya Model Schools Results: ఏకలవ్య గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Medical Colleges: దేశంలో 40 వైద్యకళాశాలల గుర్తింపు రద్దు, మరో 100కి పైగా కాలేజీలకు ఇదే గతి?
AP SSC Exams: ఏపీలో జూన్ 2 నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?
TSLPRB Results: తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల ఫలితాలు విడుదల, 84.06 శాతం మంది అర్హత!
TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్, జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్
Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు
Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!