అన్వేషించండి

TS Inter Results: మరికొద్దిసేపట్లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు, రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే - ఇలా చూసుకోండి

Telangana Inter Results 2024: తెలంగాణలో ఇంటర్ పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 24న ఉదయం 11 గంటలకు ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి విడుదల చేయనున్నారు.

TS Inter Results 2024: తెలంగాణలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 24న విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 24న ఉదయం 11 గంటలకు ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇంటర్ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in తోపాటు https://telugu.abplive.com/ వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచనున్నారు.

రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు దాదాపు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు.  ఇందులో.. 4,78,527 మంది ఇంటర్ మొద‌టి సంవత్సరం విద్యార్థులు కాగా.. 4,43,993 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. ఇక ఒకేషనల్ కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం 48,277 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం 46,542 మంది విద్యార్థులు ఉన్నారు. 

జవాబు పత్రాల మూల్యాంకనంలో సిబ్బంది ఎలాంటి తప్పులు చేయవద్దని ఇంటర్ బోర్డు మూల్యాంకన సమయంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. గత అనుభవాల దృష్ట్యా.. ఈసారి ఎలాంటి వాటికి అవకాశం ఇవ్వొద్దని సూచించింది. పూర్తిస్థాయిలో క్షుణ్ణంగా జవాబు పత్రాలను పరిశీలించిన తర్వాతే.. మార్కులను ఎంట్రీ చేయాలని సిబ్బందికి దిశానిర్దేశం చేసింది. వాల్యూయేషన్ ప్రక్రియను మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక అధికారులను కూడా నియమించింది.

ఒకవైపు పరీక్షలు జరుగుతుండగానే మార్చి 10 నుంచి మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించారు. జవాబు పత్రాల మూల్యాంకనంలో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు వహించారు. మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్‌ 10తో ముగియగా.. మార్కుల నమోదు పాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జవాబు పత్రాలను మూడేసి సార్లు పరిశీలించడంతో పాటు కోడింగ్, డీకోడింగ్‌ ప్రక్రియ పూర్తిచేశారు.  

విద్యార్థులు ఇంటర్ ఫలితాలు ఇలా చూసుకోవచ్చు..

➥ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- (tsbie.cgg.gov.in)

➥ అక్కడ హోంపేజీలో 'TSBIE 2024 result' లింక్ మీద క్లిక్ చేయాలి.

➥ విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు నమోదుచేయాలి.

➥ కంప్యూటర్ స్క్రీన్ మీద ఫలితాలు కనిపిస్తాయి.

➥ ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. 

ALSO READ:

TOSS: తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, టైమ్‌టేబుల్ ఇలా
తెలంగాణ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ పేరు, జిల్లా, స్కూల్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌; మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక మే 3 నుంచి 10 వరకు ఇంటర్ జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. 
హాల్‌టికెట్లు, పరీక్షల టైమ్ టేబుల్ కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

AP MPTC ZPTC Election Results: ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా ఎన్నికల ఫలితాలు
ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా MPTC, ZPTC Results
Hyderabad News: బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
Low Fibre Risks : ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
Real World Mileage: కొత్త Honda City Hybridలో ఫుల్ ట్యాంక్‌తో 750km ప్రయాణించవచ్చా? రియల్‌ వరల్డ్‌లో ఎంత మైలేజ్ ఇస్తోంది?
2026 హోండా సిటీ హైబ్రిడ్ నిజమైన మైలేజ్ ఎంత? సిటీలో, హైవేపై 'రియల్ టెస్ట్‌'లో తెలిసిన నిజాలు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MPTC ZPTC Election Results: ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా ఎన్నికల ఫలితాలు
ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా MPTC, ZPTC Results
Hyderabad News: బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
Low Fibre Risks : ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
Real World Mileage: కొత్త Honda City Hybridలో ఫుల్ ట్యాంక్‌తో 750km ప్రయాణించవచ్చా? రియల్‌ వరల్డ్‌లో ఎంత మైలేజ్ ఇస్తోంది?
2026 హోండా సిటీ హైబ్రిడ్ నిజమైన మైలేజ్ ఎంత? సిటీలో, హైవేపై 'రియల్ టెస్ట్‌'లో తెలిసిన నిజాలు
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Gym Beginner Guide : జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
Petrol Saving Tips: మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
Telangana CID Dharani Land Scam : ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
Embed widget