TS LAWCET 2023: లాసెట్ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తి! 2836 మందికి సీట్ల కేటాయింపు!
తుది విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు..జాయినింగ్ సర్టిఫికెట్, ఫీజు చెల్లించిన చలానాతో సంబంధిత కాలేజీలో డిసెంబర్ 16 నుంచి 21 వరకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
టీఎస్ లాసెట్ తుది విడుత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. తొలి విడత కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత.. ఎల్ఎల్‌బీ(మూడేళ్లు), ఎల్ఎల్‌బీ(ఐదేళ్ల), ఎల్ఎల్ఎం కోర్సుల్లో కన్వీనర్ కోటా కింద 3,181 సీట్లు ఖాళీ ఉండగా.. 8,987 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నారు. వీరిలో 2,836 మందికి డిసెంబరు 15న సీట్లు కేటాయించారు. తుది విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు.. జాయినింగ్ లెటర్, చలానాను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చలానాలో నిర్ణయించిన ఫీజును యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో చెల్లించాలి. అనంతరం జాయినింగ్ సర్టిఫికెట్, ఫీజు చెల్లించిన చలానాతో సంబంధిత కాలేజీలో డిసెంబర్ 16 నుంచి 21 వరకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
సీట్ల కేటాయింపు వివరాల కోసం క్లిక్ చేయండి..
టీఎస్ లాసెట్, పీజీ లాసెట్ ఫలితాలు ఆగస్టు 17న విడుదలైన సంగతి తెలిసిందే. లాసెట్, పీజీ లాసెట్ రాసిన అభ్యర్థుల్లో 74శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సుకు 74.76% మంది, ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సుకు 68.57% అర్హత సాధించారు. పీజీ లాసెట్ లో 91.10% ఉత్తీర్ణత నమోదైంది.
ఈ ఏడాది జులై 21, 22 తేదీల్లో లాసెట్ పరీక్ష నిర్వహించారు. లాసెట్ ఎంట్రెన్స్ కోసం మొత్తం 35,538 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 28,921 మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ప్రవేశ పరీక్షల్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా మూడేళ్ల, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మొదటి విడతలో సీట్ల కేటాయింపులో భాగంగా ఎల్‌ఎల్‌బీ (3 ఏళ్లు), ఎల్‌ఎల్‌బీ (5 ఏళ్లు), ఎల్‌ఎల్‌ఎంలలో 6,724 సీట్లు ఉండగా.. మొదటి దశలో 5,747 సీట్లు కేటాయించినట్లు వెల్లడించారు. మొదటి దశలో 12,301 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చారని పేర్కొన్నారు. ఇందులో 5,747 సీట్లు కేటాయించారు. ఇక రెండో విడతలో 2836 మందికి సీట్ల కేటాయింపు జరిగింది.
ALso Read:
నాలుగేళ్లు చదివితేనే ఆనర్స్ డిగ్రీ, యూజీసీ నిబంధనలివే!
నూతన విద్యావిధానంలో భాగంగా ప్రవేశపెట్టిన ఆనర్స్ డిగ్రీని నాలుగేళ్ల కోర్సుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించింది. నాలుగో ఏడాది స్పెషలైజేషన్ కు కేటాయిస్తున్నట్లు తెలిపింది. అయితే, మూడేళ్ల ఆనర్స్ డిగ్రీ కూడా ఉంటుందని వివరించింది. నాలుగేళ్లు లేదా మూడేళ్లు.. ఆనర్స్ లో ఏ డిగ్రీ కోర్సును ఎంచుకోవాలనే చాయిస్ విద్యార్థులదేనని పేర్కొంది. కాగా, నాలుగేళ్ల డిగ్రీ కోర్సును పూర్తిచేసిన విద్యార్థులకు మాత్రమే ఆనర్స్ డిగ్రీని ప్రదానం చేయనున్నట్లు యూజీసీ స్పష్టం చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వెబ్‌సైట్‌లో 'క్లాట్' అడ్మిట్ కార్డులు, 17 వరకు అప్లికేషన్ ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోడానికి అవకాశం!
దేశవ్యాప్తంగా ఉన్న 22 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, పీజీ లా కోర్సుల్లో ప్రవేశానికి 'కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2023' ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 18న క్లాట్-2023 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు డిసెంబరు 17న రాత్రి 11.59 గంటలలోపు ప్రవేశ ప్రాధాన్యాలను (అడ్మిషన్ ప్రిఫరెన్సెస్) నమోదుచేయాల్సి ఉంటుంది.
అడ్మిట్ కార్డు, అడ్మిషన్ ప్రిఫరెన్స్ కోసం క్లిక్ చేయండి..