తెలంగాణ హైకోర్టు
TS High Court stays on promotions of teachers in Ranga Reddy districts:
రంగారెడ్డి జిల్లాలో టీచర్ల పదోన్నతులపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల ప్రమోషన్లపై శనివారం మధ్యాహ్నం తర్వాత జారీ చేసింది. ఈనెల 19వ తేదీ వరకు పదోన్నతులపై స్టే విధిస్తున్నట్లు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో సీనియారిటీ జాబితా పై ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా క్యాడర్ కన్నా ఎక్కువ టీచర్లను కేటాయించారని పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది బాలకిషన్ రావు వాదనలు వినిపించారు. సీనియారిటీ జాబితా పై అభ్యంతరాలకు తగిన సమయం ఇవ్వలేదని పిటిషనర్లు న్యాయస్థానానికి తెలిపారు.
తగిన సమయం ఇవ్వకుండానే పదోన్నతులకు సిద్ధమయ్యారని పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం పూర్తి వివరాలు సమర్పించేందుకు ఈనెల 19వ తేదీ వరకు సమయం ఇవ్వాలని ప్రభుత్వ తరపున న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. దీంతో అభ్యంతరాలను పరిశీలించాకే తుది సీనియారిటీ జాబితా రూపొందిస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. ఈ క్రమంలోనే విద్యాశాఖ కార్యదర్శి, డీఎస్ఈ, రంగారెడ్డి డీఈవో లకు హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ ఈనెల 19 కి వాయిదా వేసింది. ప్రాథమిక సీనియారిటీ జాబితా ఆధారంగా పదోన్నతులు ఇవ్వదని హైకోర్టు ఆదేశించింది.
ఇటీవలే ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్స్, పదోన్నతులకు మార్గం సుగమమైంది. బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు జీవో పై గతంలో ఇచ్చిన మద్యంతర స్టే ఉత్తర్వులను సవరించింది. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న టీచర్ దంపతులకు అదనపు పాయింట్లు ఇవ్వడానికి అనుమతినిచ్చింది. యూనియన్ల ఆఫీస్ బేరర్లకు బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వడాన్ని సమర్ధనీయంగా కనిపించడం లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. కావున యూనియన్ల నాయకులకు అదనంగా పది పాయింట్లు ఇవ్వకుండా బదిలీలు చేపట్టాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల కోసం జనవరిలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీల్లో యూనియన్ నేతలకు, ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న టీచర్ దంపతులకు ప్రాధాన్యమిస్తూ వారి సర్వీసులకు అదనంగా 10 పాయింట్లు కేటాయించింది. ఫిబ్రవరిలో వెబ్ కౌన్సిలింగ్లో బదిలీల కోసం 73,803 మంది టీచర్లు దరఖాస్తు చేసుకున్నారు. అయితే భార్యాభర్తలు యూనియన్ల నాయకులు అదనపు పాయింట్లు కేటాయించడానికి సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. వాటిపై విచారణ చేసిన ధర్మాసనం జీవోపై ఇస్తే ఇస్తూ మార్చి 14వ తేదీన మద్యంత ఉత్తర్వులు జారీ చేయడంతో బదిలీలతోపాటు పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది.
పలువురి హర్షం....
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మద్యంతర ఉత్తరాలపై పలువురు పిటిషన్లు హర్షం వ్యక్తం చేశారు. సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు ఉన్నాయని తెలిపిన గాని...వాటిని పరిశీలించకుండా ప్రభుత్వం అనాలోచిత విధానం వల్ల ముందుకెళ్లిందని తెలిపారు. ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై విధివిధానాలు ఖరారు చేయాలని డిమాండ్ చేశారు.
TS TET 2023 Results: తెలంగాణ 'టెట్' ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే
TS TET 2023 Results: 27న తెలంగాణ 'టెట్' ఫలితాలు, రిజల్ట్స్ వెల్లడి సమయమిదే!
AP POLYCET: అక్టోబర్ 3న పాలిసెట్ 'స్పాట్ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం
NIMS: 'నిమ్స్'లో ఫిజియోథెరపీ పీజీ కోర్సులో ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?
JNTUH Admissions: జేఎన్‌టీయూహెచ్‌లో ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సులు, అర్హతలివే
Ram Skanda Movie : 'స్కంద' కోసం రామ్ ఎన్ని కిలోల బరువు పెరిగారో తెలుసా?
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు
Tiger 3 Teaser : 'టైగర్ 3'లో సల్మాన్ ఖాన్ దేశభక్తుడా? దేశ ద్రోహిగా మారాడా?
Bhainsa News: బైంసాలో గణేష్ నిమజ్జనం వేళ భారీ భద్రత - పోలీసులకు స్థానికులకు మధ్య గొడవ, లాఠీచార్జ్
/body>