TS EAPCET: నేడే టీఎస్ ఎప్‌సెట్-2024 ఫలితాల విడుదల! రిజల్ట్స్ లింక్ ఇదే
తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎప్ ఎప్‌సెట్-2024 పరీక్ష ఫలితాలు మే 18న విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు అధికారులు ఫలితాలను విడుదల చేయనున్నారు.
TS EAPCET Results 2024: తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎప్ ఎప్‌సెట్-2024 పరీక్ష ఫలితాలు నేడు (మే 18) విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు జేెెెఎన్‌టీయూహెచ్‌లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఎప్‌సెట్ ఫలితాలతో పాటు కౌన్సెలింగ్ తేదీలను కూడా అధికారులు ప్రకటించనున్నారు. అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర వెబ్‌సైట్లలోనూ ఫలితాలను చూసుకోవచ్చు.
ఇక రాష్ట్రంలో ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ పరీక్షలు మే 9న ప్రారంభమైన సంగతి తెలిసిందే. మే 11తో పరీక్షలు ముగిశాయి. పరీక్షల మొదటిరోజు ఉదయం విడతకు 50,978 మందికిగాను.. 48,076 (94.3 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక 2,902 (5.7 శాతం) మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఇక మధ్యాహ్నం విడతకు 50,983 మందికిగాను.. 48,152 (94.4 శాతం) మంది అభ్యర్థులు పరీక్ష రాశారని పేర్కొన్నారు. 2,831 (5.6 శాతం) మంది గైర్హాజరయ్యారు. ఇక పరీక్షల రెండో రోజు 50,990 మందికిగాను.. 48,097 (94.3 శాతం) మంది మధ్యాహ్నం విడతలో 50,987 మందికిగాను.. 48,318 (94.8 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారు.
హైదరాబాద్‌లో టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజీలు..
ఇంటర్మీడియెట్ అయిపోయిన విద్యార్థులు ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరటానికి సిద్ధమవుతున్నారు. ఏ కాలేజీలో చేరితే బెస్ట్ అనే డైలమా పేరెంట్స్ లోనూ, విద్యార్థుల్లోనూ కనిపిస్తుంది. అయితే, హైదరాబాద్ లో టాప్ 10 బెస్ట్ ఇంజినీరింగ్ కాలేజీల గురించి తెలుసుకుంటే ఎంచుకోవటానికి అనువుగా ఉంటుంది. ఫ్యాకల్టీ, వసతులు, క్యాంపస్ బట్టి అన్ని రాష్ట్రాల విద్యార్థులను ఆకర్షిస్తున్న హైదరాబాద్ లోని టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజీల వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
DOSTSchedule: 'దోస్త్' షెడ్యూలులో మార్పులు, కొత్త తేదీలు ఇవే
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్దేశించిన దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ-DOST) మొదటి దశ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 6న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే మే 25తో ముగియాల్సిన దరఖాస్తు గడువును మే 29 వరకు అధికారులు పొడిగించారు. ఇక మే 15 నుంచి ప్రారంభం కావాల్సిన వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ మే 20 నుంచి ప్రారంభంకానుంది. విద్యార్థులు మే 30 వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.
దోస్త్ పూర్తిస్థాయి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..