News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

TS EAMCET: ఆగస్టు 17 నుంచి ఎంసెట్ 'స్పెషల్' కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

ఎంసెట్ తుదివిడత కౌన్సెలింగ్ తర్వాత రాష్ట్రంలో ఇంకా 19 వేలకు పైగా ఇంజినీరింగ్‌ సీట్లు మిగిలిపోయాయి. ఈ మిగిలిపోయిన సీట్ల భర్తీకి ఆగస్టు 17 నుంచి 'స్పెషల్' కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

FOLLOW US: 
Share:

తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్దేశించిన ఎంసెట్-2023 కౌన్సెలింగ్‌లో భాగంగా మూడు విడతల సీట్లకేటాయింపు ప్రక్రియ పూర్తయిన సంగతి తెలిసిందే. తుదివిడత కౌన్సెలింగ్ తర్వాత రాష్ట్రంలో ఇంకా 19 వేలకు పైగా ఇంజినీరింగ్‌ సీట్లు మిగిలిపోయాయి. ఈ మిగిలిపోయిన సీట్ల భర్తీకి ఆగస్టు 17 నుంచి 'స్పెషల్' కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇందులో అత్యధిక సీట్లు కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ సీట్లే ఉన్నాయి. సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ తదితర బ్రాంచీల్లో చాలా సీట్లు మిగిలిపోయాయి. ఆగస్టు 17 నుంచి 25 వరకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ జరుగనుంది. ఇప్పటికే స్పెషల్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 17న రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక విద్యార్థులకు ఆగస్టు 18న సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఇది పూర్తయిన విద్యార్థులు ఆగస్టు 17 నుంచి 19 వరకు వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకోవాలి. వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 23న సీట్లను కేటాయిస్తారు. అభ్యర్థులు ఆగస్టు 23 నుంచి 25 వరకు నిర్ణీట ట్యూషన్ ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అదే తేదీల్లో సంబంధిత కళాశాలలోనూ నేరుగా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 

స్పెషల్ కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..
➥ ఆగ‌స్టు 17: ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు సంబంధించి తేదీ, స‌మ‌యం ఎంచుకోవాల్సి ఉంటుంది(ఫ‌స్ట్, సెకండ్ ఫేజ్‌లో ఈ వివ‌రాలు నింప‌ని విద్యార్థులు మాత్రమే).

➥ ఆగ‌స్టు 18: స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌. 

➥ ఆగ‌స్టు 17 - ఆగ‌స్టు 19 వరకు: స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్తయిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.

➥ ఆగ‌స్టు 23: సీట్ల కేటాయింపు.

➥ ఆగ‌స్టు 23 – ఆగ‌స్టు 25 వరకు: సీట్లు పొందిన విద్యార్థులు ట్యూష‌న్ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

స్పాట్ ప్రవేశాలు...
స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన వివరాలను ఆగస్టు 23 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

కౌన్సెలింగ్ వెబ్‌సైట్

స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కేంద్రాలివే..

ALSO READ:

వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 17న వాక్‌‌ఇన్‌ కౌన్సెలింగ్‌
తెలంగాణలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ డిప్లొమా కోర్సుల్లో సీట్ల భర్తీకీ ఇప్పటికే నాలుగు విడతల కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. అన్ని విడతల కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన సీట్ల భర్తీకి ఆగస్టు 17న యూనివర్సిటీ ఆడిటోరియంలో వాక్‌‌ఇన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. పాలిసెట్‌-2023లో ర్యాంకు పొందిన వారికి ఈ కౌన్సెలింగ్‌లో మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆ తర్వాత పదోతరగతి పాసైన వారికి (పాలిసెట్‌ ర్యాంకు లేకున్నా) రెండో ప్రాధాన్యత ఉంటుంది.
కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

TS ICET: టీఎస్ ఐసెట్‌-2023 కౌన్సెలింగ్‌ వాయిదా, కొత్త షెడ్యూలు ఇదే!
తెలంగాణలో ఆగస్టు 14 నుంచి ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదాపడింది. కొత్తగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 6, 7 తేదీల్లో రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 8 నుంచి 12 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. తదనంతరం సెప్టెంబరు 8 నుంచి 13 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. వెబ్ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు ఎంసీఏ, ఎంబీఏ తొలివిడత సీట్లను సెప్టెంబర్‌ 17న కేటాయించనున్నారు. సెప్టెంబరు 22 నుంచి తుది విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తాంచనున్నారు.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 16 Aug 2023 12:02 PM (IST) Tags: Education News in Telugu ts eamcet counselling 2023 TS EAMCET 2023 Special Phase Counselling TS EAMCET Special Round Counselling TS EAMCET Special Phase Counselling

ఇవి కూడా చూడండి

UGC NET 2023 Notification: యూజీసీనెట్ (డిసెంబరు)-2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్షలు ఎప్పుడంటే?

UGC NET 2023 Notification: యూజీసీనెట్ (డిసెంబరు)-2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్షలు ఎప్పుడంటే?

KNRUHS: బీఎస్సీ నర్సింగ్‌ సీట్ల భర్తీకి వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం, ఎంఎస్సీ నర్సింగ్ రిజిస్ట్రేషన్ షురూ

KNRUHS: బీఎస్సీ నర్సింగ్‌ సీట్ల భర్తీకి వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం, ఎంఎస్సీ నర్సింగ్ రిజిస్ట్రేషన్ షురూ

PM SHRI: తెలంగాణలో 279 హైస్కూళ్లలో సైన్స్ ల్యాబ్‌లు, ఒక్కో పాఠశాలకు రూ.16 లక్షలు మంజూరు

PM SHRI: తెలంగాణలో 279 హైస్కూళ్లలో సైన్స్ ల్యాబ్‌లు, ఒక్కో పాఠశాలకు రూ.16 లక్షలు మంజూరు

DASARA Holidays: తెలంగాణలో దసరా, బతుకమ్మ సెలవులు, మొత్తం ఎన్ని రోజులంటే? ఏపీలో సెలవులు ఇలా!

DASARA Holidays: తెలంగాణలో దసరా, బతుకమ్మ సెలవులు, మొత్తం ఎన్ని రోజులంటే? ఏపీలో సెలవులు ఇలా!

IITH: ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, ఈ అర్హతలు అవసరం

IITH: ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, ఈ అర్హతలు అవసరం

టాప్ స్టోరీస్

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు