By: ABP Desam | Updated at : 26 Mar 2023 08:04 PM (IST)
Edited By: omeprakash
తెలంగాణ పదోతరగతి పరీక్షలు
తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మార్చి 25 ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 2,652 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు 4,94,620 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో 4,85,826 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, 8794 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. ఏప్రిల్ 3 నుంచి 13 వరకు జరిగే పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి. కాంపోజిట్ కోర్సు, సైన్స్ పేపర్ల వ్యవధి ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల వరకు ఉంటుంది.
ఈ ఏడాది 11 పేపర్లకు బదులు ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హాల్‌టికెట్లను ఆయా పాఠశాలలకు పంపించామని, అలాగే లోనూ వాటిని అందుబాటులో ఉంచినట్లు బోర్డు పేర్కొంది. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను కూడా మార్చి 24 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఇప్పటికే హాల్‌టికెట్లు అందచేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.
పదోతరగతి పరీక్షల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
పరీక్షా కేంద్రాల్లో డీఈవోలు మౌలిక వసతుల పరిశీలన పూర్తి చేశారు. పరీక్షా సిబ్బంది, ఫ్లయింగ్ స్క్వాడ్‌ల నియామకం, స్టోరేజీ పాయింట్లకు రహస్య సామాగ్రి పంపిణీ, అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పరీక్ష విధులకు నియమించిన సిబ్బందికి గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ పూర్తయింది.
ఆరోగ్యశాఖ ప్రతి పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందజేయనుంది. పరీక్షా కేంద్రాల్లో ప్రథమ చికిత్స కిట్‌లతో పాటు పరీక్షలు జరిగే అన్ని రోజులలో ఒక ఏఎన్‌ఎం అందుబాటులో ఉండడనున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి అందుబాటులో ఆర్టీసీ బస్సులను ఉంచారు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్, 4న సెకండ్ లాంగ్వేజ్, 6న ఇంగ్లిష్, 8న మ్యాథమెటిక్స్, 10న సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ), 11న సోషల్, 12న ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు, 13 ఓరియంటెల్ పేపర్-2 పరీక్షలు జరుగనున్నాయి. ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు దాదాపు 5.50 లక్షల మంది విద్యార్థలు హాజరుకానున్నారు.
ఆఖరి 15 నిమిషాల్లోనే బిట్ పేపర్..
తెలంగాణ వ్యాప్తంగా ఇదిలా ఉంటే విద్యార్థులకు ఇచ్చే మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నపత్రం (బిట్ పేపర్)ను ఆఖరి 15 నిమిషాల్లోనే ఇవ్వాలని తెలిపింది. అంతేకాకుండా జనరల్ సైన్స్ పరీక్షలోని రెండు ప్రశ్నపత్రాలను ఒకేసారిగా కాకుండా నిర్దేశించిన సమయానికి విద్యార్థులకు విడివిడిగా ఇవ్వాలని పేర్కొంది. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలను ఆరు పేపర్లుగానే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా, ఇప్పటికే మోడల్ ప్రశ్నాపత్రాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. ఈసారి 6 పేపర్లతోనే పరీక్షలు జరుగుతుండగా... ఇందులో రాత పరీక్షలకు 80 మార్కులు, ఫార్మటివ్ అసెస్మెంట్ కు 20 మార్కులు ఉంటాయి. అన్ని ఎగ్జామ్స్ కు 3 గంటలు, సైన్స్ కు మాత్రం 3.20 గంటల సమయం ఉంటుంది. ఈ మేరకు విద్యాశాఖ విడుదల చేసిన ప్రకటనలో పూర్తి వివరాలను వెల్లడించారు.
పరీక్ష తేదీ | పేపరు |
ఏప్రిల్ 3 | ఫస్ట్ లాంగ్వేజ్ |
ఏప్రిల్ 4 | సెకండ్ లాంగ్వేజ్ |
ఏప్రిల్ 6 | ఇంగ్లిష్ |
ఏప్రిల్ 8 | మ్యాథమెటిక్స్ |
ఏప్రిల్ 10 | సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ) |
ఏప్రిల్ 11 | సోషల్ |
ఏప్రిల్ 12 | ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు |
ఏప్రిల్ 13 | ఓరియంటెల్ పేపర్-2 |
ALso Read:
'టెన్త్' విద్యార్థులకు గుడ్ న్యూస్, కొత్త మోడల్ పేపర్లు వచ్చేశాయ్! ఇక 'ఛాయిస్' మీదే!
తెలంగాణలో పదోతరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొత్త మోడల్ పేపర్లు అందుబాటులోకి వచ్చాయి. టెన్త్ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాల్లో మార్పులకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రశ్నపత్రాల్లో మార్పులతో కొత్త మోడల్ పేపర్లను విడుదల చేసింది. ఎన్‌సీఈఆర్‌టీ అధికారిక వెబ్‌సైట్‌లో మోడల్ పేపర్లను అందుబాటులో ఉంచింది. త్వరలోనే పాఠశాలలకు కొత్త మోడల్ పేపర్లు, బ్లూప్రింట్‌ను ప్రభుత్వం సరఫరా చేయనుంది.
పదోతరగతి మాదిరి ప్రశ్నపత్రాల కోసం క్లిక్ చేయండి..
TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథమిక కీ విడుదల! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?
AP PG CET: ఏపీ పీజీ సెట్-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
NEET UG 2023: వెబ్‌సైట్‌లో నీట్ యూజీ రెస్పాన్స్ షీట్లు, త్వరలోనే ఆన్సర్ కీ!
JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ప్రారంభం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది రాస్తున్నారంటే?
NMMS RESULTS: ఏపీ ఎన్‌ఎంఎంఎస్-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!
Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్