అన్వేషించండి

CUET UG: సీయూఈటీ యూజీ -2024 ద్వారా ఈ ఏడాది ప్రవేశాలు కల్పించే యూనివర్సిటీలు ఇవే

ఈఏడాది 46 కేంద్రీయ యూనివర్సిటీలు, 32 రాష్ట్ర యూనివర్సిటీలు, 20 డీమ్డ్ వర్సిటీలు, 98 ప్రైవేటు యూనివర్సిటీలతోపాటు 6 ప్రభుత్వ విద్యాసంస్థలు సీయూఈటీ యూజీ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నాయి.

CUET UG 2024 Exam: దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం నిర్దేశించిన 'సీయూఈటీ యూజీ' ప్రవేశ పరీక్ష పరిధిలోకి మరిన్ని యూనివర్సిటీలు వచ్చి చేరినట్లు యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీశ్ ఒక ప్రకనటలో తెలిపారు. ఈఏడాది 46 కేంద్రీయ యూనివర్సిటీలు, 32 రాష్ట్ర యూనివర్సిటీలు, 20 డీమ్డ్ వర్సిటీలు, 98 ప్రైవేటు యూనివర్సిటీలతోపాటు 6 ప్రభుత్వ విద్యాసంస్థలు సీయూఈటీ యూజీ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్రాలవారీగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్రాల యూనివర్సిటీల వివరాలను యూజీసీ వెల్లడించింది.

కేంద్రీయ విశ్వవిద్యాలయాల జాబితాలో తెలంగాణ నుంచి మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ, సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, ఇఫ్లూ, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ ఉండగా.. ఏపీ నుంచి సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ-ఏపీ, ఆంధ్ర సెంట్రల్ యూనివర్శిటీ, ఉన్నాయి. ఇక రాష్ట్ర యూనివర్సిటీలకు సంబంధించి ఏ ఒక్క యూనివర్సిటీ కూడా సీయూఈటీలో భాగస్వాములుగా లేరు.

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ(CUET UG)-2024 నోటిఫికేషన్‌ను 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)' ఫిబ్రవరి 27న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఫిబ్రవరి 27న ప్రారంభించింది. సరైన అర్హతలున్నవారు మార్చి 26 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించవచ్చు. మార్చి 28, 29 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 15 నుంచి 31 మధ్య సబ్జెక్టులవారీగా ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.  జూన్ 30న ఫలితాలు వెల్లడించనున్నారు. మొత్తం 13 భాషల్లో సీయూఈటీ యూజీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఏదైనా ఒక లాంగ్వేజ్ పరీక్షను తప్పక రాయాల్సి ఉంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం, హిందీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, బెంగాళీ, ఒరియా, ఇంగ్లిష్‌లలో ఏదైనా ఒక భాషను ఎంచుకోవచ్చు.

సీయూఈటీ దరఖాస్తు విధానం, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..

సీయూఈటీ యూజీ ద్వారా ప్రవేశాలు కల్పించే కేంద్రీయ యూనివర్సిటీలు..

  1. అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ - ఉత్తర ప్రదేశ్
  2. అస్సాం విశ్వవిద్యాలయం - అస్సాం
  3. బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం - ఉత్తర ప్రదేశ్
  4. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం -  ఉత్తర ప్రదేశ్
  5. సెంట్రల్ సంస్కృత విశ్వవిద్యాలయం  - ఢిల్లీ
  6. సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ - ఆంధ్ర ప్రదేశ్
  7. ఆంధ్ర సెంట్రల్ యూనివర్శిటీ - ఆంధ్ర ప్రదేశ్
  8. గుజరాత్ సెంట్రల్ యూనివర్శిటీ - గుజరాత్ 
  9. సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ హర్యానా - హర్యానా
  10. సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ - హిమాచల్ ప్రదేశ్
  11. జమ్మూ సెంట్రల్ యూనివర్శిటీ - జమ్మూ & కాశ్మీర్
  12. సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ జార్ఖండ్ -  జార్ఖండ్
  13. సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ కర్ణాటక - కర్ణాటక
  14. సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ కాశ్మీర్ - జమ్మూ & కాశ్మీర్
  15. కేరళ సెంట్రల్ యూనివర్శిటీ - కేరళ 
  16. ఒడిషా సెంట్రల్ యూనివర్శిటీ - ఒడిశా
  17. పంజాబ్ సెంట్రల్ యూనివర్శిటీ - పంజాబ్ 
  18. సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ రాజస్థాన్ - రాజస్థాన్
  19. సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ సౌత్ బీహార్ - బీహార్
  20. సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ తమిళ్ - తమిళనాడు
  21. DR. హరిసింగ్ గౌర్ విశ్వవిద్యాలయ - మధ్య ప్రదేశ్
  22. గురు ఘాసిదాస్ విశ్వవిద్యాలయ - ఛత్తీస్‌గఢ్
  23. హేమవతి నందన్ బహుగుణ గర్వాల్ విశ్వవిద్యాలయం - ఉత్తరాఖండ్
  24. ఇందిరా గాంధీ జాతీయ గిరిజన యూనివర్సిటీ, అమర్‌కంటక్ - మధ్యప్రదేశ్
  25. జామియా మిలియా ఇస్లామియా  - ఢిల్లీ
  26. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం - ఢిల్లీ
  27. మహాత్మా గాంధీ అంతర్రాష్ట్ర హిందీ విశ్వవిద్యాలయం - మహారాష్ట్ర
  28. మహాత్మా గాంధీ సెంట్రల్ విశ్వవిద్యాలయం - బీహార్
  29. మణిపూర్ విశ్వవిద్యాలయం - మణిపూర్
  30. మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం, తెలంగాణ
  31. మిజోరం విశ్వవిద్యాలయం - మిజోరం
  32. నాగాలాండ్ విశ్వవిద్యాలయం - నాగాలాండ్
  33. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం - ఉత్తర ప్రదేశ్
  34. నార్త్-ఈస్ట్రన్ హిల్ విశ్వవిద్యాలయ - మేఘాలయ
  35. పాండిచ్చేరి విశ్వవిద్యాలయం - పుదుచ్చేరి
  36. రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయం  & అనుబంధ కళాశాలలు - అరుణాచల్ ప్రదేశ్
  37. సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, తెలంగాణ
  38. శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం - ఢిల్లీ
  39. సిక్కిం విశ్వవిద్యాలయం -సిక్కిం
  40. తేజ్‌పూర్ విశ్వవిద్యాలయం - అస్సాం
  41. ఇఫ్లూ (ఇంగ్లిష్ & ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ) - తెలంగాణ
  42. త్రిపుర విశ్వవిద్యాలయం - త్రిపుర
  43. యూనివర్శిటీ ఆఫ్ అలహాబాద్ - ఉత్తర ప్రదేశ్
  44. ఢిల్లీ యూనివర్సిటీ - ఢిల్లీ
  45. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ - తెలంగాణ
  46. విశ్వభారతి విశ్వవిద్యాలయం - పశ్చిమ బెంగాల్

సీయూఈటీ యూజీ ద్వారా ప్రవేశాలు కల్పించే రాష్ట్రీయ యూనివర్సిటీలు..

1. బాబా గులాం షా బాద్షా విశ్వవిద్యాలయం - జమ్మూ & కాశ్మీర్
2. బర్కతుల్లా విశ్వవిద్యాలయం - మధ్యప్రదేశ్
3. భట్టదేవ్ విశ్వవిద్యాలయం - అస్సాం
4. క్లస్టర్ యూనివర్శిటీ ఆఫ్ జమ్మూ - జమ్మూ & కాశ్మీర్
5. క్లస్టర్ యూనివర్శిటీ ఆఫ్ శ్రీనగర్ - జమ్మూ అండ్ కాశ్మీర్
6. కాటన్ యూనివర్సిటీ - రాజస్థాన్ 
7. ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్శిటీ - ఢిల్లీ 
8. దేవీ అహల్యా విశ్వవిద్యాలయం -  మధ్య ప్రదేశ్ 
9. డెహ్రాడూన్ యూనివర్సిటీ, డిబ్రూఘర్ - అస్సాం.
10. డా. ఏపీజే అబ్దుల్ కలాం టెక్నికల్ యూనివర్సిటీ - ఉత్తర ప్రదేశ్ 
11. డా. బీఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ యూనివర్సిటీ - ఢిల్లీ 
12. డా. బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఢిల్లీ - ఢిల్లీ
13. ఫుర్కేటింగ్ కళాశాల(అటామస్) గోలాఘాట్ - అస్సాం
14. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ (అటానమస్), బారాముల్లా - జమ్మూ & కాశ్మీర్ 
15. గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం - ఢిల్లీ 
16. హార్కోర్ట్ బట్లర్ టెక్నికల్ యూనివర్సిటీ, కాన్పూర్ - ఉత్తర ప్రదేశ్ 
17. ఇందిరా గాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్శిటీ ఫర్ ఉమెన్ - ఢిల్లీ  
18. ఇస్లామియా కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్ - జమ్మూ & కాశ్మీర్ 
19. ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ, అవంతిపుర - జమ్మూ & కాశ్మీర్ 
20. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ లాంగ్వేజ్ యూనివర్సిటీ - ఉత్తరప్రదేశ్
21. కుమార్ భాస్కర్ వర్మ సంస్కృత, ఏన్షియంట్ స్టడీస్ యూనివర్సిటీ - అస్సాం
22. మదన్ మోహన్ మాలవ్యా యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ - ఉత్తర ప్రదేశ్ 
23. మాదవ్‌దేబ్ యూనివర్సిటీ, నారాయణపూర్, లఖింపూర్ - అస్సాం
24. నేతాజీ సుబాష్ యూనవర్సిటీ ఆఫ్ టెక్నాలజీ - ఢిల్లీ
25. నార్త్ లఖింపూర్ కాలేజ్ - అస్సాం
26. సర్దార్ పటేల్ యూనివర్సిటీ ఆఫ్ పోలీస్ సెక్యూరిటీ & క్రిమినల్ జస్టిస్ - రాజస్థాన్
27. శ్రీ మాతా వైష్ణో దేవి యూనివర్సిటీ - జమ్మూ & కాశ్మీర్
28. శ్రీ విశ్వకర్మ స్కిల్ యూనివర్శిటీ - హర్యానా
29. యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ - జమ్మూ & కాశ్మీర్
30. యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్ - జమ్మూ & కాశ్మీర్
31. విక్రమ్ యూనివర్సిటీ - మధ్యప్రదేశ్
32. వినోబా భావే యూనివర్సిటీ - జార్ఖండ్

సీయూఈటీ యూజీ విద్యాసంస్థల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
AP 10th Class Exam Date 2025: ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
Kangana Ranaut: వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desamగూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబుతమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
AP 10th Class Exam Date 2025: ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
Kangana Ranaut: వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ? జిన్నా ఆ పేరును ఎప్పుడు ఆమోదించారు?
పాకిస్థాన్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ? జిన్నా ఆ పేరును ఎప్పుడు ఆమోదించారు?
YSRCP: జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
AP Inter Exams: ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్, పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది, ఏ పరీక్ష ఎప్పుడంటే?
ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్, పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది, ఏ పరీక్ష ఎప్పుడంటే?
Romantic Life : శృంగార సామర్థ్యాన్ని కిల్ చేస్తోన్న కూల్ డ్రింక్స్.. ఎక్కువ తాగకండి బ్రదర్, రన్​అవుట్​ అయిపోతారట
శృంగార సామర్థ్యాన్ని కిల్ చేస్తోన్న కూల్ డ్రింక్స్.. ఎక్కువ తాగకండి బ్రదర్, రన్​అవుట్​ అయిపోతారట
Embed widget