అన్వేషించండి

AP LAW Colleges: ఏపీలోని లా కాలేజీలపై బీసీఐ కొరడా, ఆ 2 కాలేజీల్లో ఈ ఏడాది ప్రవేశాలు నిలిపివేత

Law Colleges in AP: ఏపీలోని లా కాలేజీలపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రంలోని రెండు లా కళాశాలల్లో ఈ ఏడాది ప్రవేశాలు నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Bar Council of India Banned Law Colleges: దేశంలో నిబంధనలకు విరద్ధంగా వ్యవహరిస్తున్న న్యాయ కళాశాలలపై బార్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా (BCI) కొరడా ఝళిపించింది. దేశవ్యాప్తంగా మొత్తం 7 కళాశాలల్లో ఈ ఏడాది (2024-25) ప్రవేశాలను రద్దుచేసింది. ఈ మేరకు అధికారక ప్రకటన విడుదల చేసింది.  బీసీఐ చర్యలు తీసుకున్న కళాశాలల్లో ఏపీకి చెందిన లా కాలేజీలు రెండు ఉన్నాయి. వీటిలో ఒకటి తిరుపతి జిల్లా యేర్పాడు మండలం, అంజిమేడులోని శ్రీ ఈశ్వర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ లా కాగా.. రెండోది విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని గవరపాలెంలో ఉన్న శ్రీ షిరిడిసాయి విద్యాపరిషత్ ఆధ్వర్యంలోని శ్రీ షిరిడిసాయి లా కాలేజీ ఉన్నాయి.

7లో నాలుగు యూపీ కాలేజీలే...
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిషేధించిన 7 కళాశాలల్లో నాలుగు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి కావడం విశేషం. ఇక మిగతా మూడు కాలేజీల్లో ఏపీలో రెండు, రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కి చెందిన మాస్టర్ సోమ్‌నాథ్ లా కాలేజీ ఉంది.       

బీసీఏ నిషేధించిన యూపీలోని కాలేజీలు..

i) హెచ్‌ఎస్ లా కాలేజీ (ఎతహ్, ఆగ్రారోడ్డు). 

ii) శ్రీ క్రిష్ణ కాలేజ్ ఆఫ్ లా (బాగ్‌పత్, మీరట్ రోడ్డు). 

iii) ఎస్‌ఎస్ కాలేజ్ ఆఫ్ లా (అలీఘడ్ జిల్లా, మన్పూర్ కలాన్ ఖైర్). 

iv) తేజుసింగ్ మెమోరియల్ లా కాలేజ్ (శబల్‌పూర్, జేపీనగర్).

ఏపీలోని లా కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి జూన్ 9న ఏపీ లాసెట్/ పీజీఎల్‌సెట్ 2024 ప్రవేశ పరీక్షను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహించిన సంగతి తెలిసిందే. జూన్ 9న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏపీ లాసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని జూన్ 10న విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి జూన్ 11 నుంచి జూన్ 12 వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించింది. ఈ ప్రక్రియ పూర్తవడంతో ఫలితాల వెల్లడికి ఉన్నతవిద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది. ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 35 న్యాయకళాశాల్లో యూజీ, పీజీ కోర్సుల్లో సీట్లను లాసెట్ ద్వారా భర్తీచేయనున్నారు. ఆయా కళాశాలల్లో మొత్తం 8238 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఐదేళ్ల లాడిగ్రీలో 2,660 సీట్లు మూడేళ్ల లా డిగ్రీలో 5,578 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక పీజీ లాడిగ్రీలో 325 సీట్లు మాత్రమే ఉన్నాయి.

ఏపీలో లాసెట్ ద్వారా ప్రవేశాలు పొందే కాలేజీలు ఇవే (2023 ప్రకారం)..

AP LAW Colleges: ఏపీలోని లా కాలేజీలపై బీసీఐ కొరడా, ఆ 2 కాలేజీల్లో ఈ ఏడాది ప్రవేశాలు నిలిపివేత

లాసెట్ పరీక్ష విధానం:
➥ AP LAWCET 2024 పరీక్షను మొత్తం 120 మార్కులకు నిర్వహించారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. వీటిలో పార్ట్-ఎ: జనరల్ నాలెడ్జ్ & మెంటల్ ఎబిలిటీ 30 ప్రశ్నలు-30 మార్కులు, పార్ట్-బి: కరెంట్ ఎఫైర్స్ 30 ప్రశ్నలు-30 మార్కులు, పార్ట్-సి: ఆప్టిట్యూడ్ (స్టడీ ఆఫ్ లా) 60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి. పార్ట్-సిలో బేసిక్ లా ప్రిన్సిపుల్స్, భారత రాజ్యాంగానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.  తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది.

➥ ఇక ఐదేళ్ల లా కోర్సు పరీక్ష రాసేవారికి ఇంటర్ స్థాయిలో, మూడేళ్ల లా కోర్సు పరీక్ష రాసేవారికి డిగ్రీ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. అభ్యర్థుల సౌలభ్యం కోసం మాక్ టెస్టులకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షలో కనీసం అర్హత మార్కులను 35 శాతం అంటే 42 మార్కులుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి కనీస అర్హత మార్కులు లేవు. పరీక్ష సమయం 90 నిమిషాలు.

పీజీఎల్‌సెట్ పరీక్ష విధానం:
ఇక AP PGLCET 2024 పరీక్షను మొత్తం 120 మార్కులకు నిర్వహించారు. పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. పరీక్షలో మొత్తం 2 సెక్షన్లు (పార్ట్-ఎ, పార్ట్-బి) ఉంటాయి. ఇందులో పార్ట్-ఎ నుంచి 40 పశ్నలు, పార్ట్-బి నుంచి 80 పశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే పరీక్ష ఉంటుంది. పరీక్షలో అర్హత మార్కులను 25 శాతంగా (30 మార్కులు) నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి కనీస మార్కులు లేవు. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Shamshabad Airport Bomb Threat:శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులను టెన్షన్ పెడుతున్న మెయిల్స్‌
శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులను టెన్షన్ పెడుతున్న మెయిల్స్‌
Indigo Crisis:ఇండిగో సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యలు ఏంటి?
ఇండిగో సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యలు ఏంటి?
Akhanda 2 Release Date : సంక్రాంతి బరిలో 'అఖండ 2'! - నిర్మాత రామ్ అచంట ట్వీట్‌కు అర్థమేంటి?
సంక్రాంతి బరిలో 'అఖండ 2'! - నిర్మాత రామ్ అచంట ట్వీట్‌కు అర్థమేంటి?
Vladimir Putin India Visit : ముడి చమురు సరఫరా, అణు- అంతరిక్ష రంగాల్లో సహాయం... పుతిన్ పర్యటనతో భారత్‌కు ఏం లాభం?
ముడి చమురు సరఫరా, అణు- అంతరిక్ష రంగాల్లో సహాయం... పుతిన్ పర్యటనతో భారత్‌కు ఏం లాభం?

వీడియోలు

Indigo Flights Cancellation Controversy | ఇండిగో వివాదంపై కేంద్రం సీరియస్ | ABP Desam
Putin on oil trade with India | చమురు వాణిజ్యంపై క్లారిటీ ఇచ్చిన వ్లాదిమిర్ పుతిన్ | ABP Desam
Vintage Virat Kohli | సఫారీలతో రెండో వన్డేలో వింటేజ్ స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్న విరాట్
Ruturaj Gaikwad Century in India vs South Africa ODI |  అన్నా! నువ్వు సెంచరీ చెయ్యకే ప్లీజ్ | ABP Desam
Harbhajan Singh about Rohit Sharma Virat Kohli | రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్‌పై హర్బజన్ సింగ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shamshabad Airport Bomb Threat:శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులను టెన్షన్ పెడుతున్న మెయిల్స్‌
శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులను టెన్షన్ పెడుతున్న మెయిల్స్‌
Indigo Crisis:ఇండిగో సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యలు ఏంటి?
ఇండిగో సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యలు ఏంటి?
Akhanda 2 Release Date : సంక్రాంతి బరిలో 'అఖండ 2'! - నిర్మాత రామ్ అచంట ట్వీట్‌కు అర్థమేంటి?
సంక్రాంతి బరిలో 'అఖండ 2'! - నిర్మాత రామ్ అచంట ట్వీట్‌కు అర్థమేంటి?
Vladimir Putin India Visit : ముడి చమురు సరఫరా, అణు- అంతరిక్ష రంగాల్లో సహాయం... పుతిన్ పర్యటనతో భారత్‌కు ఏం లాభం?
ముడి చమురు సరఫరా, అణు- అంతరిక్ష రంగాల్లో సహాయం... పుతిన్ పర్యటనతో భారత్‌కు ఏం లాభం?
Google Search 2025: 2025లో గూగుల్‌లో భాారతీయులు ఎక్కువగా సెర్చ్‌ చేసిన ప్రముఖులు వీళ్లే! అంతా క్రీడాకారులే!
2025లో గూగుల్‌లో భాారతీయులు ఎక్కువగా సెర్చ్‌ చేసిన ప్రముఖులు వీళ్లే! అంతా క్రీడాకారులే!
Akhanda 2 Release Date : 'అఖండ 2' రిలీజ్ ఎప్పుడంటే? - చిత్ర నిర్మాణ సంస్థ రియాక్షన్
'అఖండ 2' రిలీజ్ ఎప్పుడంటే? - చిత్ర నిర్మాణ సంస్థ రియాక్షన్
RBI Repo Rate Cut: RBI నిర్ణయంతో కారు రుణాలపై భారీ తగ్గుదల! 15 లక్షల కారుపై EMI ఎంత చెల్లించాలి?
RBI నిర్ణయంతో కారు రుణాలపై భారీ తగ్గుదల! 15 లక్షల కారుపై EMI ఎంత చెల్లించాలి?
Samantha : పెళ్లి తర్వాత షూటింగ్‌లో సమంత - వాట్ ఏ డెడికేషన్ సామ్
పెళ్లి తర్వాత షూటింగ్‌లో సమంత - వాట్ ఏ డెడికేషన్ సామ్
Embed widget