పరీక్ష ఏదైనా మనమే టాప్, జాతీయస్థాయిలో సత్తాచాటుతున్న తెలుగు విద్యార్థులు!
జేఈఈ మెయిన్, నీట్, జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో ప్రథమ ర్యాంకులను తెలుగు రాష్ట్రాల విద్యార్థులే దక్కించుకొని జాతీయస్థాయిలో ప్రత్యేకతను సాధించారు.
దేశంలో ఏ జాతీయస్థాయి పరీక్షలు జరిగిన తెలుగు విద్యార్థులు సత్తా చాటుతున్నారు. టాప్ ర్యాంకులతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా జేఈఈ మెయిన్, నీట్, జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో ప్రథమ ర్యాంకులను తెలుగు రాష్ట్రాల విద్యార్థులే దక్కించుకొని జాతీయస్థాయిలో ప్రత్యేకతను సాధించారు.
ఏప్రిల్ 30న వెల్లడైన జేఈఈ మెయిన్‌లో హైదరాబాద్‌కు చెందిన సింగరాజు వెంకట కౌండిన్య 300కి 300 మార్కులు దక్కించుకొని మొదటి ర్యాంకు సాధించగా.. జూన్ 13న వెల్లడైన నీట్-యూజీ ఫలితాల్లో ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన బోర వరుణ్ చక్రవర్తి 720కి 720 మార్కులతో ప్రథమ ర్యాంకు పొందాడు.
తాజాగా జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన వావిలాల చిద్విలాస్‌రెడ్డి 360కి 341 మార్కులు సాధించి తొలి ర్యాంకు కైవసం చేసుకున్నాడు. మరోవైపు బాలికల విభాగంలో 298 మార్కులతో హైదరాబాద్ జోన్‌కు చెందిన నాగ భవ్యశ్రీ బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. అయితే జాతీయ స్థాయిలో 56వ ర్యాంకులో నిలిచింది.
ALSO READ:
జూన్ 20న ఏపీఈసెట్-2023 ప్రవేశ పరీక్ష, అన్ని ఏర్పాట్లు పూర్తి!
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా జూన్ 20న ఏపీఈసెట్-2023 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జేఎన్‌టీయూకే ఉపకులపతి, ఏపీఈసెట్ కమిటీ ఛైర్మన్ ఆచార్య జీవీఆర్ ప్రసాదరాజు ఆదివారం (జూన్ 18) ఒక ప్రకటలో తెలిపారు. ఈ పరీక్షకు 38,255 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరికోసం 101 పరీక్ష కేంద్రాలు కేంద్రాలు కేటాయించినట్లు తెలిపారు. జూన్ 20న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌లో ఏపీఈసెట్ పరీక్ష నిర్వహించనున్నారు.
పరీక్ష పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
ఏపీలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ ఉన్నత విద్యామండలి జూన్ 18న ఆన్‌లైన్ అడ్మిషన్స్ మాడ్యుల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (OAMDC) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ/ఎయిడెడ్/ప్రైవేటు అన్ఎయిడెడ్/అటానమస్ డిగ్రీ కాలేజీల్లో సాధారణ డిగ్రీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బి.వొకేషనల్, బీఎఫ్‌ఏ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్ కోర్సుల్లో చేరేందుకు జూన్ 19 నుంచి 26 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సమయంలో ఓసీ అభ్యర్థులు రూ.400, బీసీలు రూ.300, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులైతే రూ.200 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్ పాసైన విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ కేజీబీవీల్లో 1241 ఉద్యోగాలు - అర్హతలు, ఎంపిక విధానం ఇలా!
తెలంగాణలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ (యూఆర్‌ఎఎస్)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 1,241 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో స్పెషల్ ఆఫీసర్, పీజీసీఆర్‌టీ, సీఆర్‌టీ, పీఈటీలు పోస్టులు ఉన్నాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జూన్ 26 నుంచి జులై 5 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..