అన్వేషించండి

TG EAPCET Results: తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల చేసిన రేవంత్ రెడ్డి, రెండు విభాగాల్లో టాప్‌ 10 ర్యాంకర్లు వీరే

EAPCET 2025 Results |తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఇంజనీరింగ్ విభాగంలో టాప్ 10 ర్యాంకులు అబ్బాయిలే సొంతం చేసుకున్నారు. టాప్ 3 ర్యాంకులు ఏపీ విద్యార్థులు సాధించారు.

TG EAPCET Results | హైదరాబాద్‌: తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాల (EAPCET Results)ను సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం (మే 11న) విడుదల చేశారు. ఇంజినీరింగ్‌ విభాగంలో మొత్తం 2,20,326 మంది రిజస్టర్ చేసుకోగా 2,07,190 మంది హాజరు కాగా.. 1,51,779 మంది క్వాలిఫై అయ్యారు. అమ్మాయిలు 73.88 శాతం, అబ్బాయిలు 72.79 శాతం క్వాలిఫై కాగా, ఓవరాల్ ఉత్తీర్ణత శాతం 73.26 శాతం నమోదైంది.

ఇంజినీరింగ్ విభాగంలో టాప్ 10 ర్యాంకులు అబ్బాయిలే సొంతం చేసుకున్నారు. అయితే ఏపీకి చెందిన విద్యార్థి టాప్ ర్యాంకర్‌గా నిలిచాడు. టాప్ 3 ర్యాంకులూ ఏపీ విద్యార్థులను వరించాయి. ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన పల్లా భరత్‌చంద్రకు ఫస్ట్ ర్యాంకు, నంద్యాల జిల్లా వాసి ఉడగండ్ల రామ్‌చరణ్‌రెడ్డికి రెండో ర్యాంకు, విజయనగరం జిల్లాకు చెందిన సూర్యకార్తీక్‌ మూడో ర్యాంకు సాధించారు.

హైదరాబాద్‌లోని నాచారానికి చెందిన ఎం లక్ష్మీభార్గవ్‌కు 4వ ర్యాంకు, మంత్రిరెడ్డి వెంకట గణేశ్‌ రాయల్‌ (హైదరాబాద్)కు 5వ ర్యాంకు, సుంకర సాయి రిశాంత్‌రెడ్డి (హైదరాబాద్) 6వ ర్యాంకు, రష్మిత్‌ బండారి (హైదరాబాద్) 7వ ర్యాంకు, బనిబ్రత మాజీ (బడంగ్‌పేట్‌)కు 8వ ర్యాంకు, కొత్త ధనుష్‌రెడ్డి (హైదరాబాద్‌)కు 9 ర్యాంక్, కొమ్మ కార్తీక్‌ (మేడ్చల్‌)కు 10వ ర్యాంకు వచ్చినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

TG EAPCET Results: తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల చేసిన రేవంత్ రెడ్డి, రెండు విభాగాల్లో టాప్‌ 10 ర్యాంకర్లు వీరే
అగ్రికల్చర్‌-ఫార్మసీ ఫలితాలు..
టీజీ ఎప్‌సెట్‌ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. అగ్రికల్చర్‌- ఫార్మా ఫలితాల్లో మొత్తం 87.82 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 86762 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, వీరిలో 81198 మంది పరీక్షకు హాజరుకాగా, 71309 మంది ఉత్తీర్ణత సాధించారు.

మేడ్చల్‌కు చెందిన సాకేత్‌రెడ్డి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో టాప్ ర్యాంకర్‌గా నిలిచారు. కరీంనగర్‌కు చెందిన సబ్బాని లలిత్‌ వరేణ్యకు రెండో ర్యాంకు, వరంగల్‌కు చెందిన అక్షిత్‌కు 3వ ర్యాంకు, సాయినాథ్‌ (వనపర్తి జిల్లా కొత్తకోట)కు 4వ ర్యాంకు, బ్రాహ్మణి (మాదాపూర్‌)కి 5వ ర్యాంకు, గుమ్మడిదల తేజస్‌ (కూకట్‌పల్లి)కు 6వ ర్యాంకు, అఖిరా నందన్‌రెడ్డి (నిజాంపేట)కు 7వ ర్యాంకు, భానుప్రకాష్ రెడ్డి (సరూర్‌నగర్‌)కి 8వ ర్యాంకు, శామ్యూల్‌ సాత్విక్‌ (హైదర్‌గూడ)కు 9వ ర్యాంకు, అద్దుల శశికరణ్‌ రెడ్డి (బాలాపూర్‌)కి 10వ ర్యాంకు సాధించారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
Embed widget