అన్వేషించండి

Telangana Universities: యూనివర్సిటీ వీసీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్, పాత పద్ధతిలోనే ఫ్యాకల్టీల భర్తీ!

తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు త్వరలోనే కొత్త వైస్ ఛాన్స్​లర్ల(వీసీ)ను నియమించనున్నారు. ఇందు కోసం ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వీసీల నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

Telangana Universities: తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు త్వరలోనే కొత్త వైస్ ఛాన్స్​లర్ల(వీసీ)ను నియమించనున్నారు. ఇందు కోసం ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నెలాఖరులోగా వీసీల నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ పరిధిలో మొత్తం12 యూనివర్సిటీలున్నాయి. వీటిలో 4 యూనివర్సిటీలకు వీసీలు లేరు. ఇందులో కొత్తగా వచ్చిన తెలంగాణ మహిళా యూనివర్సిటీతో పాటు రాజీవ్‌గాంధీ వైజ్ఞానికి సాంకేతిక విశ్వవిద్యాలయం(RGUKT)కు వీసీల నియామకం జరగలేదు. 

తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ రవీందర్ గుప్తా గతేడాది జూన్‌లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా ఆయనను పదవి నుంచి తప్పించారు. దీంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. మిగిలిన వీసీల మూడేళ్ల కాలపరిమితి ఈ ఏడాది మే నెలతో ముగియనుంది. అయితే, ఈసారి యూనివర్సిటీల బలోపేతంపై దృష్టిపెట్టిన ప్రభుత్వం.. నిబంధనల ప్రకారం కాలపరిమితి ముగిసేలోపే కొత్తవారిని ఎంపిక చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా వీసీల భర్తీకి రాష్ట్ర ఉన్నత విద్యామండలి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీనిద్వారా అర్హులైన సీనియర్ ప్రొఫెసర్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం, ప్రభుత్వానికి అధికారులు నివేదిక సమర్పిస్తారు. ఈ క్రమంలోనే ఒక్కో వర్సిటీకి ముగ్గురు సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీని నియమించనుంది. దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారిని ఆ సెర్చ్ కమిటీలు ఒక్కో వర్సిటీకి ముగ్గురి పేర్లను గవర్నర్​కు ప్రతిపాదిస్తారు. వీరిలో ఒకరిని గవర్నర్, వీసీగా నియమిస్తారు.

ఖాళీల భర్తీకీ కసరత్తు..
తెలంగాణలోని యూనివర్సిటీల్లో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీని సాధ్యమైనంత త్వరలగా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు (CRB) సంబంధించిన బిల్లును గత ప్రభుత్వం గవర్నర్‌కు పంపడం...గవర్నర్ దాన్ని రాష్ట్రపతికి పంపిన నేపథ్యంలో గవర్నర్ తమిళిసైతో మాట్లాడి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో విద్యాశాఖ ఈ అంశంపై దృష్టి సారించింది. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆమోదంపై తాజా పరిస్థితిని తెలుసుకొని...ఒకవేళ దాని ఆమోదం ఆలస్యమైతే పాత విధానంలోనే వర్సిటీల వారీగా నియామకాలు జరపాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఉమ్మడి బోర్డు ద్వారా ఆచార్యుల నియామకాలు చేపట్టాలని 2022 సెప్టెంబరులో అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి గవర్నర్ ఆమోదానికి పంపారు. ఆ తర్వాత దాన్ని రాష్ట్రపతి పరిశీలనకు గవర్నర్ పంపారు. గతేడాది మరోసారి అసెంబ్లీలో బిల్లును ఆమోదించి గవర్నర్‌కు పంపినా ఆమోదం లభించలేదు. రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలో 11 విశ్వవిద్యాలయాలుండగా 2,825 మంజూరు బోధనా సిబ్బంది పోస్టులకుగాను కేవలం 850 మందే పనిచేస్తున్నారు.

పాతపద్ధతిలోనే ఫ్యాకల్టీల భర్తీ..
రాష్ట్రంలోని 15 విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి తలపెట్టిన ‘ది తెలంగాణ యూనివర్సిటీస్‌ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లు’ను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉపసంహరించుకోనుంది. పాత పద్ధతిలోనే వర్సిటీ రిక్రూట్‌మెంట్లు నిర్వహించాలని నిర్ణయించింది. ఏ యూనివర్సిటీ పరిధిలోని పోస్టులను ఆయా వర్సిటీలే నోటిఫికేషన్లు జారీచేసి, భర్తీచేస్తాయి. ఆయా పోస్టుల భర్తీకి ఎలాంటి స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఉండదు. సర్టిఫికెట్ల పరిశీలన, ఇంటర్వ్యూ విధానంలో నియామకాలను పూర్తిచేస్తారు. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు ఉపసంహరణకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవలే విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీని ఆదేశించారు. దీంతో ఈ బిల్లు ఉపసంహరణకు రాజ్‌భవన్‌తో సీఎంవో, విద్యాశాఖ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Venkatesh: వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
AP Weather Updates: ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Embed widget