అన్వేషించండి

TG EAPCET Date: తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. PGECET ఎగ్జామ్ డేట్స్ ఫిక్స్

TG PGECET Schedule | తెలంగాణలో పలు కోర్సులో ప్రవేశాల కోసం ఎంట్రన్స్ టెస్టుల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేశారు. దాని ప్రకారం TG EAPCET, PG PGECET నిర్వహించనున్నారు.

TG EAPCET Exam Date & PGECET Exam Dates | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్య మండలి (TGCHE) ఆధ్వర్యంలో నిర్వహించే TG EAPCET–2026 షెడ్యూల్‌ను అధికారులు అధికారికంగా విడుదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఫిబ్రవరి 19 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుండగా, ఎలాంటి ఆలస్య (Without Late Fee) రుసుము లేకుండా ఏప్రిల్ 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షల విషయానికొస్తే.. మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగానికి, మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ విభాగానికి ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.

పీజీఈసెట్ షెడ్యూల్ వివరాలు..

మరోవైపు, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH), ఉన్నత విద్య మండలి సంయుక్తంగా TG PGECET–2026 షెడ్యూల్‌ను కూడా ఖరారు చేశాయి. దీనికి సంబంధించి తొలి సెట్ (CET) కమిటీ సమావేశం నిర్వహించి షెడ్యూల్‌కు ఆమోదం తెలిపారు. ఈ పరీక్ష నోటిఫికేషన్ జనవరి 30, 2026 (శుక్రవారం) న విడుదలవుతోంది. ఆన్‌లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమై, ఫిబ్రవరి 27 వరకు లేట్ ఫీజు లేకుండా స్వీకరించబడతాయి. మే 6న హాల్ టికెట్లు విడుదల చేయనుండగా, మే 28 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

TG EAPCET–2026 (ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ)

  • నోటిఫికేషన్ విడుదల తేదీ: ఫిబ్రవరి 14, 2026.

  • దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 19 నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభం.

  • చివరి తేదీ: ఏప్రిల్ 4, 2026 (ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా).

  • పరీక్ష తేదీలు: * అగ్రికల్చర్ & ఫార్మసీ: మే 4, మే 5.

  • ఇంజినీరింగ్: మే 9 నుంచి మే 11వ తేదీ వరకు.

TG PGECET–2026 (పీజీ కోర్సులు)

  • నోటిఫికేషన్ విడుదల: జనవరి 30, 2026 (శుక్రవారం).

  • దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 23, 2026 (సోమవారం) నుంచి ప్రారంభం.

  • చివరి తేదీ: ఫిబ్రవరి 27, 2026 (ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా).

  • హాల్ టికెట్లు: మే 6, 2026 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

  • పరీక్ష తేదీలు: మే 28 నుంచి మే 31 వరకు (గురువారం నుంచి ఆదివారం వరకు).

తెలంగాణ టెట్ (TET) అప్‌డేట్స్

ఇక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) కు సంబంధించి కూడా కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ నెల 3 నుంచి 20 వరకు నిర్వహించిన టెట్ పరీక్షల ప్రాథమిక కీని అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు ఈ కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే వచ్చే నెల 31వ తేదీ వరకు ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఇచ్చారు.

ప్రాథమిక కీ: ఈ నెల (జనవరి) 3 నుండి 20 వరకు జరిగిన పరీక్షల ప్రాథమిక కీ విడుదలయ్యింది.

అభ్యంతరాలు: విడుదలైన కీపై అభ్యంతరాలు తెలపడానికి మార్చి 31, 2026 వరకు గడువు కలదు.

తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ - 2026

పరీక్ష పేరు నోటిఫికేషన్ తేదీ దరఖాస్తుల ప్రారంభం చివరి తేదీ (ఆలస్య రుసుము లేకుండా) హాల్ టికెట్లు / పరీక్ష తేదీలు
TG EAPCET–2026 14-02-2026 19-02-2026 04-04-2026

అగ్రికల్చర్ & ఫార్మసీ: మే 4, 5


ఇంజినీరింగ్: మే 9 - 11

TG PGECET–2026 30-01-2026 23-02-2026 27-02-2026

హాల్ టికెట్లు: 06-05-2026


పరీక్షలు: మే 28 - 31

TG TET–2026 - - అభ్యంతరాలకు గడువు: 31-03-2026 ప్రాథమిక కీ విడుదల: 30-01-2026

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

JEE Main 2027 Registration: జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
AP Inter Exams Schedule: విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
FCRI Admissions 2026: ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Convoy Accident: రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
Tadipatri Tension: తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్రించిన నేత
తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్ర
Arnab Cyclone: ఏపీ వైపు దూసుకొస్తోన్న'అర్నబ్' తుపాను.. బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం.. రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్!
ఏపీ వైపు దూసుకొస్తోన్న'అర్నబ్' తుపాను.. బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం.. రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్!
Tips To Focus at Work : ఆఫీసులో పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా? ఏకాగ్రత పెంచే ఈ టిప్స్ ట్రై చేయండి
ఆఫీసులో పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా? ఏకాగ్రత పెంచే ఈ టిప్స్ ట్రై చేయండి
Telangana El Nino: ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
మూడున్నర లక్షల అమ్మకాలు దాటిన Tata Altroz.. ధర, మైలేజీ, ఫీచర్లు తెలిస్తే మీకూ కొనాలనిపిస్తుంది!
ఈ కారుకు దేశవ్యాప్తంగా ఫుల్‌ డిమాండ్‌.. టాటా అమ్మే ప్రతి 3 కార్లలో ఒకటి ఇదే!
Hero Xtreme 250R Standard - Carbon మధ్య తేడాలివే! కేవలం రూ.14,000 ఖర్చుకు దక్కే అదనపు ఫీచర్లు ఏంటి?
Hero Xtreme 250R లో కొత్త వేరియంట్‌.. ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
Pushpaka Vimanam Series OTT : లిఫ్ట్‌లో ఒక్కసారి గతంలోకి వెళ్తే! - ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లిఫ్ట్‌లో ఒక్కసారి గతంలోకి వెళ్తే! - ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget