అన్వేషించండి

TS SSC Halltickets: తెలంగాణ పదోతరగతి పరీక్షల హాల్‌టికెట్లు విడుదల - డైరెక్ట్ లింక్ ఇదే

SSC Exams Halltickets: తెలంగాణలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌‌టిక్కెట్లు మార్చి 7న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు.

TS SSC Exams Halltickets: తెలంగాణలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌‌టిక్కెట్లు మార్చి 7న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. పదోతరగతి రెగ్యులర్ విద్యార్థులతోపాటు, ప్రైవేట్, ఓపెన్ స్కూల్, ఒకేషనల్ విద్యార్థుల హాల్‌టికెట్లను కూడా విడుదల చేశారు. తమతమ పాఠశాలల లాగిన్‌ వివరాలతోపాటు.. తమ పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  ప్రకటించిన షెడ్యూలు ప్రకారం షెడ్యూలు ప్రకారం.. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు (TS SSC Exams) నిర్వహించనున్నారు.

ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు దాదాపు 5.50 లక్షల మంది విద్యార్థలు హాజరుకానున్నారు. మార్చి 18 నుంచి పరీక్షలు ప్రారంభంకానుండగా..  మార్చి 30తో ప్రధాన పరీక్షలు, ఏప్రిల్ 2తో ఒకేషనల్ పరీక్షలు (Telangana 10th Class Exams) ముగియనున్నాయి. ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్‌ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి.

పదోతరగతి హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

➥ పదోతరగతి హాల్‌టికెట్ల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌ సందర్శించాలి - https://bse.telangana.gov.in/

➥ అక్కడ హోంపేజీలో హాల్‌టికెట్లకు సంబంధించి 'SSC Public Examinations March 2024 Hall Tickets' లింక్‌‌పై క్లిక్ చేయాలి.

➥ తర్వాత వచ్చే పేజీలో పదోతరగతి రెగ్యులర్, ప్రైవేట్, ఓపెన్ స్కూల్, ఒకేషనల్ విద్యార్థుల హాల్‌టికెట్లకు సంబందించిన లింక్స్ కనిపిస్తాయి. 

➥ అక్కడ అడిగిన వివరాలు నమోదు చేసి, Submit బటన్‌ మీద క్లిక్ చేయాలి.

➥ తర్వాతి పేజీలో పదోతరగతి హాల్‌టికెట్‌ను కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.

➥ విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింటవుట్ తీసుకోండి.

పదోతరగతి పరీక్షల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

షెడ్యూలు ప్రకారం మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 21న థర్డ్ లాంగ్వేజ్, మార్చి 23న మ్యాథమెటిక్స్, మార్చి 26న ఫిజికల్ సైన్స్, మార్చి 28న బయలాజికల్ సైన్స్,  మార్చి 30న సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక ఏప్రిల్ 1న  ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులకు, ఏప్రిల్ 2న ఓరియంటెల్ పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.

పరీక్ష తేదీ పేపరు
మార్చి 18 ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 19 సెకండ్ లాంగ్వేజ్
మార్చి 21 థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లిష్)
మార్చి 23 మ్యాథమెటిక్స్
మార్చి 26 ఫిజికల్ సైన్స్ 
మార్చి 28 బయాలజికల్ సైన్స్
మార్చి 30 సోషల్ స్టడీస్
ఏప్రిల్ 1 ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు
ఏప్రిల్ 2 ఓరియంటెల్ పేపర్-2

ALSO READ:

ఏపీ పదోతరగతి హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే!
ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌‌టిక్కెట్లు మార్చి 4న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమతమ పాఠశాలల లాగిన్‌ వివరాలతోపాటు.. తమ పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 18 నుంచి 30 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
ఏపీలో పదోతరగతి పరీక్షల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
Embed widget