By: ABP Desam | Updated at : 24 Mar 2023 03:01 PM (IST)
Edited By: omeprakash
పదోతరగతి పరీక్షల హాల్‌టికెట్లు
తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి ప్రారంభంకానున్న పదోతరగతి వార్షిక పరీక్షల హాల్‌టిక్కెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. ఏపీలో ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదోతరగతి వార్షిక పరీక్షలు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు తమ జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,94,616 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్భందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
పదోతరగతి పరీక్షల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్, 4న సెకండ్ లాంగ్వేజ్, 6న ఇంగ్లిష్, 8న మ్యాథమెటిక్స్, 10న సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ), 11న సోషల్, 12న ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు, 13 ఓరియంటెల్ పేపర్-2 పరీక్షలు జరుగనున్నాయి. ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు దాదాపు 5.50 లక్షల మంది విద్యార్థలు హాజరుకానున్నారు.
ఆఖరి 15 నిమిషాల్లోనే బిట్ పేపర్..
తెలంగాణ వ్యాప్తంగా ఇదిలా ఉంటే విద్యార్థులకు ఇచ్చే మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నపత్రం (బిట్ పేపర్)ను ఆఖరి 15 నిమిషాల్లోనే ఇవ్వాలని తెలిపింది. అంతేకాకుండా జనరల్ సైన్స్ పరీక్షలోని రెండు ప్రశ్నపత్రాలను ఒకేసారిగా కాకుండా నిర్దేశించిన సమయానికి విద్యార్థులకు విడివిడిగా ఇవ్వాలని పేర్కొంది. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలను ఆరు పేపర్లుగానే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను ఆరు పేపర్లుగానే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో జనరల్ సైన్స్ పరీక్షలో 40 మార్కుల చొప్పున రెండు పేపర్లు ఉంటాయి. ఇందులో ఒకటి ఫిజికల్ సైన్స్ కాగా మరొకటి బయాలాజికల్ సైన్స్. జనరల్ సైన్స్‌లో తొలుత ఓ పేపర్‌ను ఇచ్చి దానికి సమాధానాలు రాసేందుకు 90 నిమిషాలు సమయం ఇవ్వాలని అధికారులకు సూచించారు. అనంతరం 20 నిమిషాల సమయం ఇచ్చి విద్యార్థులకు రెండో పేపర్ ఇవ్వాలని తెలిపారు. రెండో పేపర్ రాసేందుకు మరో 90 నిమిషాల సమయం కేటాయించాలని చెప్పారు. ఇక, మల్టీపుల్ చాయిస్ ప్రశ్నల పత్రాన్ని పరీక్ష చివరి 15 నిమిషాల ముందు ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు ఆ పదిహేను నిమిషాల్లోనే అందులోని పది ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
Also Read: ఏపీ పదోతరగతి హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే!
కాగా, ఇప్పటికే మోడల్ ప్రశ్నాపత్రాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. ఈసారి 6 పేపర్లతోనే పరీక్షలు జరుగుతుండగా... ఇందులో రాత పరీక్షలకు 80 మార్కులు, ఫార్మటివ్ అసెస్మెంట్ కు 20 మార్కులు ఉంటాయి. అన్ని ఎగ్జామ్స్ కు 3 గంటలు, సైన్స్ కు మాత్రం 3.20 గంటల సమయం ఉంటుంది. ఈ మేరకు విద్యాశాఖ విడుదల చేసిన ప్రకటనలో పూర్తి వివరాలను వెల్లడించారు.
పరీక్ష తేదీ | పేపరు |
ఏప్రిల్ 3 | ఫస్ట్ లాంగ్వేజ్ |
ఏప్రిల్ 4 | సెకండ్ లాంగ్వేజ్ |
ఏప్రిల్ 6 | ఇంగ్లిష్ |
ఏప్రిల్ 8 | మ్యాథమెటిక్స్ |
ఏప్రిల్ 10 | సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ) |
ఏప్రిల్ 11 | సోషల్ |
ఏప్రిల్ 12 | ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు |
ఏప్రిల్ 13 | ఓరియంటెల్ పేపర్-2 |
ALso Read:
'టెన్త్' విద్యార్థులకు గుడ్ న్యూస్, కొత్త మోడల్ పేపర్లు వచ్చేశాయ్! ఇక 'ఛాయిస్' మీదే!
తెలంగాణలో పదోతరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొత్త మోడల్ పేపర్లు అందుబాటులోకి వచ్చాయి. టెన్త్ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాల్లో మార్పులకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రశ్నపత్రాల్లో మార్పులతో కొత్త మోడల్ పేపర్లను విడుదల చేసింది. ఎన్‌సీఈఆర్‌టీ అధికారిక వెబ్‌సైట్‌లో మోడల్ పేపర్లను అందుబాటులో ఉంచింది. త్వరలోనే పాఠశాలలకు కొత్త మోడల్ పేపర్లు, బ్లూప్రింట్‌ను ప్రభుత్వం సరఫరా చేయనుంది.
పదోతరగతి మాదిరి ప్రశ్నపత్రాల కోసం క్లిక్ చేయండి..
Inter Results: తెలంగాణ ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్స్ ఇవే!
Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!
TS DEECET: డీఈఈసెట్ ప్రిలిమినరీ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
హెచ్‌సీయూలో ఎంటెక్ కోర్సు, ఎస్సీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు!
EMRS Teacher Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!
Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!