TSET 2023: జనవరి 3 నుంచి టీఎస్ సెట్ ఒరిజినల్ సర్టిఫికేట్లు అందుబాటులో, ఇవి తప్పనిసరి!
టీఎస్ సెట్-2023లో అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు జనవరి 3 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. అభ్యర్థులు యూనివర్సిటీలో ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందవచ్చని అధికారులు తెలిపారు.
Telangana SET 2023 Original Certificates: తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (TSET)-2023లో అర్హత సాధించిన అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు జనవరి 3 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. అభ్యర్థులు యూనివర్సిటీలో ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందవచ్చని అధికారులు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య కేంద్రంలోని టీఎస్ సెట్ కార్యాలయం నుంచి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒరిజినల్ ఎకనాలెడ్జ్‌మెంట్ స్లిప్, గతంలో సమర్పించని పత్రాలను అందజేసి TS SET సర్టిఫికెట్ పొందవచ్చని అధికారులు పేర్కొన్నారు.
టీఎస్ సెట్ – 2023 పరీక్ష ఫలితాలు (TS SET 2023 Results) డిసెంబరు 6న విడుదలైన సంగతి తెలిసిందే. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబరు 14 నుంచి 17 వరకు దూరవిద్య కేంద్రంలోని ఆన్‌లైన్ కౌన్సెలింగ్ సెంటర్‌లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు.
➥ డిసెంబరు 14న: జియోగ్రఫీ, కామర్స్, ఎకనామిక్స్, ఎర్త్‌సైన్స్, జర్నలిజం&మాస్ కమ్యూనికేషన్, కెమికల్ సైన్సెస్.
➥ డిసెంబరు 15న: మేనేజ్‌మెంట్, ఎడ్యుకేషన్, కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్, హిందీ, హిస్టరీ, ఇంగ్లిష్, లైఫ్ సైన్సెస్.
➥ డిసెంబరు 16న: లా, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజియోలజీ, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఫిజికల్ సైన్సెస్, పొలిటికల్ సైన్సెస్, ఉర్దూ, లైబ్రరీ & ఇన్‌ఫర్మేషన్ సైన్స్, మ్యాథమెటికల్ సైన్సెస్.
➥ డిసెంబరు 17న: సంస్కృతం, తెలుగు, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, లింగ్విస్టిక్స్, అన్ని సబ్జెక్టులకు చెందిన దివ్యాంగులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు.
తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు/లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే పరీక్ష తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (టీఎస్ సెట్)-2023 నోటిఫికేషన్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం జులై 29న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 5న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 28 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఇక ఆలస్యరుసుముతో సెప్టెంబరు 24 వరకు దరఖాస్తులు స్వీకరించారు. కంప్యూటర్ బేస్డ్ టెస్టు పద్ధతిలో అక్టోబరు 28 - 30 వరకు 'సెట్' పరీక్షలు నిర్వహించారు.
సెట్ పరీక్ష విధానం: మొత్తం 29 సబ్జెక్టులకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత టెస్టు(సీబీటీ) పద్ధతిలో జరిగే పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు.
సబ్జెక్టులు: జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ (పేపర్-1), జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా , మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్.
ALSO READ:
సీయూఈటీ పీజీ రిజిస్ట్రేషన్ ప్రారంభం - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!
దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (CUET-PG-2024) నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 26న ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు డెబిట్/క్రెడిట్ కార్డులతో పాటు నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా దరఖాస్తు ఫీజును చెల్లించవచ్చు. సీయూటీ పీజీ ప్రవేశ పరీక్షను మార్చి 11 నుంచి 28 వరకు దేశవ్యాప్తంగా 324 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. మొత్తం 157 సబ్జెక్టులకు ఈ పరీక్ష జరుగనుంది. పరీక్ష ఫలితాలు ఏప్రిల్ నెలాఖరులో విడుదలయ్యే అవకాశం ఉంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..