News
News
వీడియోలు ఆటలు
X

Telangana Inter Results 2023: తెలంగాణ ఇంటర్‌ సెకండ్ ఇయర్‌లో 67.27 శాతం పాస్

Telangana Inter Results 2023: తెలంగాణ ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్షలకు 3,80,920 మంది హాజరైతే... 2,56,241 మంది పాస్ అయ్యారు.

FOLLOW US: 
Share:

తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు మే 9న విడుదలయ్యాయి. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు.  ఇంటర్ ఫస్టియర్‌లో 63.85 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, సెకండియర్‌లో 67.26 శాతం ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ ఇంటర్ సెకండ్‌ ఇయర్ ఫలితాల్లో 1,73,61 మందికి గ్రేడ్‌-ఎ వచ్చింది. ఇక 54,776 మంది విద్యార్థులకు గ్రేడ్‌-బి వచ్చింది. సెకండ్ ఇయర్‌లో మొత్తం 2,56,241 మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలవారీగా చూస్తే ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్(75.27 %) మొదటి స్థానం, రంగారెడ్డి (72.82 %), కొమరంభీమ్ ఆసిఫాబాద్ (72.96%) మొదటి మూడుస్థానాల్లో నిలిచాయి. అదేవిధంగా సెకండియర్‌ ఫలితాల్లో ములుగు (85.08 %), కొమరంభీమ్ ఆసిఫాబాద్ (80.16 %),  మేడ్చల్(72.27 %) జిల్లాలు మొదటి మూడుస్థానాల్లో నిలిచాయి .

ఫలితాలపై సందేహాలున్న విద్యార్థుల సౌలభ్యం కోసం రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు సబితా వెల్లడించారు. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 4 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులపై ఒత్తిడి ఉండకూడదనే ఈ సారి ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ తొలగింపు.

ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ రిజల్ట్స్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంటర్ సెకండ్ ఇయర్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలో ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 5 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 9.47 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో రెండో సంవత్సరం ఇంటర్‌ పరీక్షలకు 3,80,920 మంది హాజరైతే... 2,56,241 మంది పాస్ అయ్యారు. అంటే పాస్ పర్సంటేజ్ శాతం 67.27 శాతంగా ఉంది. మొత్తం ఇంటర్ రెండు సంవత్సరాలు కలిపి 61.68 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 68.68 శాతం పాస్ అయ్యారు. బాలురు 54.66 శాతం పాస్ అయ్యారు. 

సెకండియర్‌లో బాలికలు 2,29,958 మంది రాస్తే...1,64,598 మంది పాస్ అయ్యారు. బాలికల్లో ఉత్తీర్ణత శాతం 71.57%. బాలురులో 2,35,520 మంది పరీక్షకు హాజరైతే... 1,30,952 మంది మాత్రమే పాస్ అయ్యారు. అంటే 55.60% మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 1,91,698 మందికి A గ్రేడ్, 64,385 మందికి B గ్రేడ్, 21,166 మందికి C గ్రేడ్, 7784 మందికి D గ్రేడ్ వచ్చింది. జిల్లాల వారీగా పాస్ పర్సంటేజ్ చూస్తే... ములుగు (85.08 %), కొమరంభీమ్ ఆసిఫాబాద్ (80.16 %), మేడ్చల్(72.27 %) జిల్లాలు మొదటి మూడుస్థానాల్లో నిలిచాయి. చిట్టచివరి స్థానంలో నిలిచిన జిల్లాలు వరుసగా.... మెదక్‌(52%) నాగర్ కర్నూల్(54%), వరంగల్‌(58%) ఉన్నాయి.

ఈ సంద‌ర్భంగా మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ 2022-23 ఫ‌లితాల‌ను విడుద‌ల చేశాం. మార్చి 15 నుంచి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాం. విద్యార్థి ద‌శ‌లో ఇంట‌ర్ అనేది కీల‌క‌మైంది. జీవితానికి ట‌ర్నింగ్ పాయింట్. మన రాష్ట్రంలో ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ 9,45,153 మంది హాజ‌ర‌య్యారు. 1473 కేంద్రాల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించాం. 26 వేల మంది సేవ‌లందించారు. ప‌రీక్ష‌లు ప్ర‌శాంతంగా జ‌రిగేందుకు స‌హ‌క‌రించిన అన్ని విభాగాల వారికి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు అని స‌బితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఎంసెట్ విష‌యంలో ఇంట‌ర్ వెయిటేజీని తీసేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. పిల్ల‌లు ఎవ‌రూ కూడా ఒత్తిడికి గురి కావొద్ద‌నే ఉద్దేశంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని స‌బితా ఇంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు.

జూన్ 4 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు...
ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 4 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సబితా తెలిపారు. ఫెయిల్ అయిన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఆందోళన చెందవద్దని ఆమె సూచించారు. ముఖ్యంగా సెకండియర్ విద్యార్థులు టెన్షన్ పడొద్దని, తల్లిదండ్రులు కూడా వారి పరిస్థితి అర్థం చేసుకోవాలని, పిల్లలపై కోపడవద్దని కోరారు. ఫలితాలపై సందేహాలున్న విద్యార్థుల సౌలభ్యం కోసం రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు సబితా వెల్లడించారు. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 4 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులపై ఒత్తిడి ఉండకూడదనే ఈ సారి ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ తొలగించారు. 

Published at : 09 May 2023 11:19 AM (IST) Tags: Intermediate results Telangana inter Breaking News TS Inter Results ABP Desam Telangana Inter Results 2023 Telangana Inter news Inter Results Today

సంబంధిత కథనాలు

TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథ‌మిక కీ విడుద‌ల‌! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథ‌మిక కీ విడుద‌ల‌! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

NEET UG 2023: వెబ్‌సైట్‌లో నీట్ యూజీ రెస్పాన్స్ షీట్లు, త్వరలోనే ఆన్సర్ కీ!

NEET UG 2023: వెబ్‌సైట్‌లో నీట్ యూజీ రెస్పాన్స్ షీట్లు, త్వరలోనే ఆన్సర్ కీ!

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రారంభం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది రాస్తున్నారంటే?

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రారంభం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది రాస్తున్నారంటే?

NMMS RESULTS: ఏపీ ఎన్‌ఎంఎంఎస్‌-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

NMMS RESULTS: ఏపీ ఎన్‌ఎంఎంఎస్‌-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

టాప్ స్టోరీస్

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"

Bandi Sanjay on TDP:

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Byjus Loan Default: బైజూస్‌కు షాక్‌! రూ.329 కోట్ల వడ్డీ చెల్లించకుంటే లోన్‌ ఎగ్గొట్టినట్టే!

Byjus Loan Default: బైజూస్‌కు షాక్‌! రూ.329 కోట్ల వడ్డీ చెల్లించకుంటే లోన్‌ ఎగ్గొట్టినట్టే!