Telangana Inter Results 2022: ఈ నెల 28న ఇంటర్ ఫలితాలు విడుదల , ప్రకటించిన తెలంగాణ ఇంటర్ బోర్డు
TS Inter Results 2022 : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఈనెల 28న విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు ప్రకటించింది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుదల చేయనున్నారు.
TS Inter Results 2022 Online: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఈనెల 28న విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు ప్రకటించింది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఇంటర్ మొదటి, రెండో ఏడాది ఫలితాలు విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. సుమారు 9 లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలు రాశారు.
షెడ్యూల్ ప్రకారం మే 6 నుంచి 23 వరకు తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్, ఇంటర్ సెంకడ్ ఇయర్ పరీక్షలను మే 7 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించారు. అయితే ఫలితాల కోసం ఇంటర్ విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు జూన్ 28న విడుదల చేయనున్నారు. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు.
9 లక్షల విద్యార్థుల ఎదురుచూపులు..
ఇంటర్ ఫలితాలు ఎప్పుడు వస్తాయా అని తల్లిదండ్రులు, విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలను మొత్తం 9,07,393 మంది రాశారు. ఇందులో ఫస్టియర్ పరీక్షలకు 4,64,625 మంది హాజరు కాగా, 4,42,768 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. ఇప్పటకే ఇంటర్ ఫలితాల ప్రకటనపై అధికారులు ట్రయల్ రన్ చేస్తున్నారు. జూన్ 25నే ఫలితాలు విడుదల కావాల్సి ఉంది, కానీ కొంతమంది విద్యార్థుల మార్కులను కంప్యూటర్ ద్వారా ఫీడ్ చేయడంలో తప్పులు దొర్లడంతో రిజల్ట్స్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఫలితాల వెల్లడి ఆలస్యమైనా ఫర్వాలేదని, తప్పులు మాత్రం దొర్లకూడదని అధికారలుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించినట్లు సమాచారం.
తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2022 ఇలా చెక్ చేసుకోండి (Steps to check TS Inter Results 2022)
Step 1: తెలంగాణ ఇంటర్ విద్యార్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in సందర్శించండి
Step 2: హోం పేజీలో తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2022 లింక్ (Telangana Inter Results 2022 link) మీద క్లిక్ చేయండి
Step 3: హాల్ టికెట్ నెంబర్ (రిజిస్ట్రేషన్ నెంబర్), పుట్టిన తేదీ లాంటి వివరాలు నమోదు చేయాలి
Step 4: ఇంటర్ విద్యార్థుల ఫస్టియర్ లేదా సెకండియర్ ఫలితాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి
Step 5: రిజల్ట్స్‌ను విద్యార్థులు పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోండి
Step 6: ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీల ప్రవేశాలు లాంటి భవిష్యత్ అవసరాల కోసం మీ ఫలితాలను ప్రింటౌట్ తీసుకోవడం మరిచిపోవద్దు
గత ఏడాది కరోనా పాస్..
ఏడాది కరోనా నేపథ్యంలో గత ఏడాది ఇంటర్ ఫస్టియర్ పరీక్షా ఫలితాల్లో 49 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. పరిస్థితులను అర్థం చేసుకున్న ఇంటర్ బోర్డ్, రాష్ట్ర విద్యాశాఖ చివరకు కనీస మార్కులతో అందరినీ పాస్ చేశారు. ఇలాంటి పరిస్థితి మరోసారి రాకూడదని అధికారులు జాగ్రత్తలు తీసుకుని ఈ ఏడాది పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు విడుదలయ్యాక కేవలం 15 రోజుల్లోనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. తద్వారా ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ.. ఫలితాల ప్రకటనపై ఇంత వరకు ఇంటర్‌బోర్డు మాత్రం అధికారికంగా ఎలాంటి తేదీ ప్రకటించలేదు.