అన్వేషించండి

PG Medical Fee: పీజీ మెడికల్‌ విద్యార్థులకు ఊరట, ఫీజులపై మెడికల్ కాలేజీలకు హైకోర్టు కీలక ఆదేశాలు

TG PG Medical Fees: పీజీ మెడికల్‌, డెంటల్‌ విద్యార్థులకు హైకోర్టులో కాస్త ఊరట లభించింది. ట్యూషన్‌ ఫీజుల్లో మిగిలిన మొత్తాన్ని చెల్లించాలంటూ ఒత్తిడి తీసుకురావద్దని మెడికల్ కాలేజీలనను ఆదేశించింది.

Telangana Highcourt orders: తెలంగాణలో పీజీ మెడికల్ కోర్సులకు 2023-25 కాలానికి సంబంధించి పెంచిన ఫీజుల్లో వ్యత్యాసం మొత్తాన్ని చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి చేయొద్దని పీజీ మెడికల్‌ కాలేజీలకు హైకోర్టు ఆదేశించింది. కోర్టు అనుమతించిన మేరకే ఫీజులు వసూలు చేయాలని, అదనపు చెల్లించాలని పిటిషనర్లపై ఒత్తిడి తీసుకురావద్దని హైకోర్టు ఏప్రిల్ 3న మెడికల్ కాలేజీలను ఆదేశించింది. ఈ మేరకు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజయ్‌ పాల్‌, జస్టిస్‌ యారా రేణుకతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా విద్యార్థులను తరగతులకు అనుమతించాలని తేల్చిచెప్పింది.  

2023-2026 బ్లాక్‌ పీరియడ్‌ సంబంధించి పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు ట్యూషన్‌ ఫీజును ఏడాదికి రూ.5.8 లక్షల నుంచి రూ.24 లక్షలకు, కన్వీనర్‌ కోటా ఫీజును రూ.3.2 లక్షల నుంచి రూ. 7.75 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం జీవోలు జారీచేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ డాక్టర్‌ అద్వైత శంకర్‌ సహా 124మంది మెడికల్‌ పీజీ విద్యార్థులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను సింగిల్‌ జడ్జి ధర్మాసనం కొట్టేసింది. దీంతో పిటిషనర్లందరూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో రిట్‌ అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యారా రేణుకల ధర్మాసనం విచారణ చేపట్టింది. 

2020-23లో కూడా ఫీజుల పెంపునకు ఉత్తర్వులివ్వగా 50 నుంచి 60 శాతం వసూలు చేయాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషనర్లు పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఫీజు వసూలు చేసుకోవాలని, మిగిలిన ఫీజు చెల్లించాలంటూ ఒత్తిడి చేయరాదని, వారిని తరగతులకు అనుమతించాలని స్పష్టం చేస్తూ..    తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది. 

స్థానికత అంశంలోనూ వివాదమే..
స్థానికత నిబంధనలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను న్యాయస్థానం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఎంబీబీఎస్‌లో స్థానిక కోటా కింద రాష్ట్రంలో ప్రవేశాలు పొందిన వారే.. పీజీలోనూ స్థానిక కోటా రిజర్వేషన్లకు అర్హులు అని కోర్టు గతేడాది డిసెంబరులో స్పష్టంచేసింది. ఇతర రాష్ట్రాలకు చెందినవారు తెలంగాణలో ఎంబీబీఎస్ చదివినంత మాత్రాన పీజీలో స్థానిక కోటా వర్తించదంటూ తెచ్చిన జీవో 148, 149లను హైకోర్టు కొట్టివేసింది. తెలంగాణలో ఎంబీబీఎస్, బీహెచ్‌ఎంఎస్/బీఏఎంఎస్ చేసినవారికి ఇకపై పీజీలో స్థానిక కోటా పరిధిలోనే ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొంది. అదేవిధంగా తెలంగాణలో స్థానికులై ఉండి.. రాష్ట్రం వెలుపల ఎంబీబీఎస్ చదివిలన, ఇన్ సర్వీసు(తెలంగాణలో సివిల్ సర్జన్లుగా చేస్తున్న) అభ్యర్థులకు సైతం రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుందని అప్పట్లో కోర్టు తెలిపింది. 

స్థానికత ఆధారంగా రిజర్వేషన్లు కల్పించవచ్చు.. 
స్థానికత ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలన్న విధానం పూర్తిగా తొలగించాల్సింది కాదు. పీజీ కోర్సుల్లో స్థానికత ఆధారంగా ప్రవేశాలు కల్పించే వెసులుబాటు ఉంది. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు.. నాన్-లోకల్ కేటగిరీలో రాష్ట్రంలో ఎంబీబీఎస్‌లో చేరినవారు స్థానిక కోటా కింద పీజీలో ప్రవేశాలకు అర్హులుకాదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 6 నుంచి ఇంటర్ వరకు రాష్ట్రంలో చదివినవారికే స్థానిక కోటా కింద ఎంబీబీఎస్‌లో ప్రవేశాలు లభిస్తాయి. వారికే పీజీ ప్రవేశాల్లో స్థానిక కోటా కింద అర్హత లభిస్తుందన్న వాదన చట్టవిరుద్ధం. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నాలుగేళ్లు స్థానికంగా చదువుకున్నట్లయితే స్థానిక అభ్యర్థిగా పరిగణించాలి. ప్రభుత్వ జీవోలు రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధం. రాష్ట్ర విద్యాసంస్థల నియంత్రణ చట్టంలోని సెక్షన్ 3(2)కు సైతం విరుద్ధం. 2021 చట్టంలోని నిబంధన 8 ఇన్ సర్వీసు అభ్యర్థులకు పూర్తిస్థాయి నిషేధం కల్పించలేదు. ఇందులో నిబంధన 1, 6, 8ల మధ్య తేడాలేదు. ఒకసారి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమయ్యాక నిబంధనలను సవరించడం సరికాదు. ఈ కారణాలతో జీవో 148, 149లను కొట్టివేస్తున్నామని తీర్పులో ధర్మాసనం పేర్కొంది. 

టాప్ హెడ్ లైన్స్

How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget