By: ABP Desam | Updated at : 02 Dec 2022 05:18 AM (IST)
Edited By: omeprakash
ఎడ్‌సెట్ సీట్ల కేటాయింపు
తెలంగాణ ఎడ్‌సెట్-2022 తుది విడత కౌన్సెలింగ్‌లో భాగంగా డిసెంబరు 1న అధికారులు అభ్యర్థులకు సీట్లను కేటాయించారు. కన్వీనర్ కోటాలో మొత్తం 9413 సీట్లకు ఫైనల్ ఫేజ్ ద్వారా 7054 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. మొత్తం 11,746 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోగా 7054 మందికి సీట్లను కేటాయించినట్లు టీఎస్ సెట్స్ కన్వీనర్ ప్రొ.పి.రమేష్ బాబు పేర్కొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ట్యూషన్ ఫీజును బ్యాంకు చలాన్ ద్వారా చెల్లించాలని సూచించారు. ఆ తర్వాత ఆయా కాలేజీల్లో డిసెంబరు 7 లోపు సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాలని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 14285 బీఈడీ సీట్లల్లో మొదటి విడతలో 10,053 మందికి కేటాయించగా అందులో 5222 మంది మాత్రమే ఇప్పటి వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేశారు. సెకండ్, ఫైనల్ ఫేజ్‌లో 9413 సీట్లల్లో 7054 మందికి సీట్లను కేటాయించారు.
సీట్ల కేటాయింపు వివరాల కోసం క్లిక్ చేయండి..
టీఎస్ ఎడ్‌సెట్-2022 రెండో విడత కౌన్సెలింగ్ నవంబరు 16న ప్రారంభమైన సంగతి తెలిసిందే. 16 నుంచి 22 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించారు. 24న ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. నవంబరు 24 నుంచి 27 వరకు వెబ్‌ఆప్షన్లకు అవకాశం కల్పించారు. 28న వెబ్ఆప్షన్లలో మార్చుకునేందుకు అవకాశం కల్పించి. తాజాగా సీట్లను కేటాయించారు. తొలివిడత సీట్లను నవంబర్ 5న కేటాయించారు. కన్వీనర్ కోటాలో 14,285 బీఈడీ సీట్లు అందుబాటులో ఉండగా 10,053 మందికి సీట్లు కేటాయించారు. రెండో విడతలో 7054 మందికి సీట్లను కేటాయించారు.
ఈ ఏడాది ఈ ఏడాది టీఎస్ ఎడ్‌సెట్ పరీక్ష జూలై 26న టీఎస్‌ఎడ్‌సెట్-2022 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 26న ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షకు మొత్తం 38,091 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 31,578 మంది హాజరుకాగా.. 30,580 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
Also Read:
క్రాఫ్ట్స్ & డిజైనింగ్ కోర్సుల్లో ప్రవేశాలు, ఐఐసీడీ నోటిఫికేషన్ జారీ!!
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ (ఐఐసీడీ) 2023 విద్యాసంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా బీ.డిజైన్, ఎం.డిజైన్, ఎం.వొకేషన్ కోర్సుల్లో సీట్ల భర్తీ చేయనున్నారు. కోర్సుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. డిగ్రీ కోర్సులకు ఇంటర్ అర్హత ఉండాలి. పీజీ కోర్సులకు సంబంధి విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్ధులు జనవరి 21లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
'ఫ్యాషన్' కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రారంభం- చివరితేది ఎప్పుడంటే?
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ప్రవేశాలకు నిర్దేశించిన 'NIFT-2023' రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబరు 1న ప్రారంభమైంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబరు 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.3000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1500 చెల్లిస్తే సరిపోతుంది.
నోటిఫికేషన్, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..
Jee Main 2023 answer key: జేఈఈ మెయిన్ ప్రాథమిక 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
TSWRES Inter Admissions: తెలంగాణ గురుకుల సైనిక పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్! పరీక్ష ఎప్పుడంటే?
TSWRES Admissions: గురుకుల సైనిక పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్! ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?
TTWREIS Admissions: తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి! వివరాలివే!
Union Budget 2023: బడ్జెట్లో విద్యారంగానికి అధిక ప్రాధాన్యత, భారీగా విద్యా సంస్థల ఏర్పాటు! బడ్జెట్ కేటాయింపు ఇలా!
కోటం రెడ్డిపై మొదటి నుంచీ అనుమానాలు- ఆసక్తికర విషయాలు చెబుతున్న సహచరులు!
BRS Vs BJP: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఖర్మరా బాబూ అంటున్న మంత్రి కేటీఆర్
YSRCP Tensions : వైఎస్ఆర్సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?
Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?