TISS Admissions: 'టిస్'లో పీజీ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) వివిధ పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు గడువును మరో 13 రోజులపాటు పొడిగిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది.
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) వివిధ పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు గడువును మరో 13 రోజులపాటు పొడిగిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. పీజీ కోర్సుల దరఖాస్తుకు జనవరి 15తో ముగియాల్సిన గడువును అధికారులు జనవరి 28 వరకు పొడిగించారు. ఇప్పటికదాకా దరఖాస్తు చేసుకోలేని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ప్రవేశపరీక్ష (టిస్-నెట్) ద్వారా, స్టేజ్-1 పరీక్షలో చూపిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి 'స్టేజ్-2' ఆన్‌లైన్ అసెస్‌మెంట్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. తుది ఎంపికలో స్టేజ్-1, 2 రెండింటికీ సమాన వెయిటేజీ ఉంటుంది. హైదరాబాద్, విశాఖపట్నంలో పరీక్ష నిర్వహిస్తారు.
టిస్ సంస్థ 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవశ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. టిస్ సంస్థ ముంబయి, హైదరాబాద్, తుల్జాపూర్, గువాహటి క్యాంపస్‌లలో మొత్తం 60 కోర్సులను అందిస్తోంది. వీటిలో 57 పీజీ, 3 పీజీ డిప్లొమా కోర్సులు ఉన్నాయి. టిస్ ముంబయి క్యాంపస్‌లో 38, హైదరాబాద్‌లో 10, తుల్జాపూర్‌లో 4, గువాహటిలో 8 కోర్సులు అందుబాటులో ఉన్నాయి.ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.
పరీక్ష విధానం:
టిస్ నెట్ ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి 100 నిమిషాలు. ప్రశ్నలన్నీ ఇంగ్లిష్‌లోనే ఉంటాయి. జనరల్ అవేర్ నెస్-40 ప్రశ్నలు-40 మార్కులు, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ-30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథ్స్ అండ్ లాజికల్ రీజనింగ్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి. ఇంగ్లిష్, రీజనింగ్, మ్యాథ్స్ విభాగాల్లోని ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్‌లో కటాఫ్ మార్కులు పొందడం తప్పనిసరి. పరీక్షపై అవగాహన కోసం టిస్ వెబ్‌సైట్‌లో మాక్ టెస్టు అందుబాటులో ఉంది.
హైదరాబాద్ క్యాంపస్‌లో..
ఎంఏ | ఎడ్యుకేషన్, సిటీస్ అండ్ గవర్నెన్స్, నేచురల్ రిసోర్సెస్ అండ్ గవర్నెన్స్, పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్, డెవలప్ మెంట్ స్టడీస్, రూరల్ డెవలప్ మెంట్ అండ్ గవర్నెన్స్, ఉమెన్ స్టడీస్. |
పీజీ డిప్లొమా | సిటీస్ అండ్ గవర్నెన్స్, నేచురల్ రిసోర్సెస్ అండ్ గవర్నెన్స్, పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్ కోర్సులు. |
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.01.2023. (జనవరి 28 వరకు పొడిగించారు)
➥ TISS NET స్టేజ్-1 పరీక్ష తేది: 2023, జనవరి 28 - ఫిబ్రవరి 28 మధ్య.
Notification
Online Application
Programmes Details
Also Read:
➥ తెలంగాణ 'మోడల్ స్కూల్స్' ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తులు ప్రారంభం! వివరాలు ఇలా!
➥ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి 'టీజీ యూజీసెట్', నోటిఫికేషన్ వెల్లడి! పరీక్ష ఎప్పుడంటే?
➥ టీఎస్ పాలిసెట్-2023 నోటిఫికేషన్ విడుదల, పూర్తి వివరాలు ఇలా!
➥ యూజీ ఆయుష్ కన్వీనర్ కోటా సీట్ల వెబ్ కౌన్సెలింగ్ తేదీలు వెల్లడి, షెడ్యూలు ఇదే!