News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Degree Admissions: డిగ్రీ రెండో విడత ప్రవేశాలకు ఆగస్టు 28 నుంచి రిజిస్ట్రేషన్, షెడ్యూలు ఇలా!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానుంది.

FOLLOW US: 
Share:

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులు ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 1 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ పూర్తిచేసినారు సెప్టెంబర్‌ 4 నుంచి 8 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి సెప్టెంబర్‌ 12న సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందివారు సెప్టెంబర్‌ 12న సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక రెండో విడతలో ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్‌ 20 వరకు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోటాలో సీట్లను కూడా భర్తీ చేయనున్నారు. ఇంటర్‌లో 80 శాతం, 90 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులకు రెండవ దశలో ప్రవేశాలు ఉంటాయి.

రిజిస్ట్రేషన్, ఇతర వివరాలు ఇలా..

➥ రిజిస్ట్రేషన్: అభ్యర్థులు ముందుగా OAMDC పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి.

➥ దరఖాస్తు రుసుము చెల్లింపు: అభ్యర్థులు తప్పనిసరిగా నిర్ణీత దరఖాస్తు రుసుము చెల్లించాలి.

➥ దరఖాస్తు ఫారమ్ నింపడం: అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో నింపాలి.

➥ పత్రాల అప్‌లోడ్: అభ్యర్థులు తమ 12వ తరగతి మార్కు షీట్, కుల ధృవీకరణ పత్రం మరియు ఇతర అవసరమైన పత్రాల స్కాన్ చేసిన కాపీలను తప్పనిసరిగా అప్‌లో డ్ చేయాలి.

➥ వెబ్ ఎంపికలు: అభ్యర్థులు వారు దరఖాస్తు చేయాలనుకుంటున్న కళాశాలల కోసం వెబ్ ఎంపికలను ఉపయోగించగలరు.

➥ సీట్ల కేటాయింపు: APSCHE ఆన్‌లైన్ మోడ్‌లో సీట్ల కేటాయింపు జాబితాను విడుదల చేస్తుంది.

కాలేజీకి రిపోర్టింగ్: ఎంపికైన అభ్యర్థులు కేటాయించిన కాలేజీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు సమర్పణ కోసం పత్రాల జాబితా..

➥ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ కాపీ

➥ ఇంటర్మీడియట్ బదిలీ సర్టిఫికేట్ (అసలు)

➥ 10వ తరగతి ఉత్తీర్ణత & మెమో సర్టిఫికెట్

➥ ఇంటర్మీడియట్ పాస్ & మెమో సర్టిఫికేట్

➥ కండక్ట్ & స్టడీ సర్టిఫికెట్లు  (గత 3 సంవత్సరాలు)

➥ MRO జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం (SC, ST, BC విషయంలో)

➥ MRO జారీ చేసిన తాజా ఆదాయ ధృవీకరణ పత్రం

➥ నివాస ధృవీకరణ పత్రం

➥ NCC సర్టిఫికేట్లు (వర్తిస్తే)

➥ క్రీడా ధృవపత్రాలు (వర్తిస్తే)

➥ శారీరకంగా సవాలు చేయబడిన సర్టిఫికేట్ (వర్తిస్తే)

➥ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ

➥ యాంటీ ర్యాగింగ్/అండర్ టేకింగ్ ఫారమ్

➥ SC/ST ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం తల్లిదండ్రుల డిక్లరేషన్ ఫారమ్

➥ రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

ALSO READ:

ఇకపై 22 భారతీయ భాషల్లో సీబీఎస్‌ఈ చదువులు - పుస్తకాల రూపకల్పన దిశగా ఎన్‌సీఈఆర్‌టీ
తెలుగు సహా మరో 21 ప్రాంతీయ భాషల్లో సీబీఎస్ఈ సిలబస్ బోధించాలని నిర్ణయించింది. ఆయా భాషల్లో పాఠ్యపుస్తకాలను రూపొందించాలని ఎన్‌సీఈఆర్‌టీ కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. ఆ మేరకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల ప్రచురణపై దిశగా అడుగులు వేస్తోంది. కాలానుగుణంగా వస్తున్న మార్పులు, సంస్కరణలకు అనుకూలంగా.. భారతదేశ విద్యారంగం కొత్త మార్పులు సంతరించుకుంటోంది. ప్రస్తుతం హిందీ, ఆంగ్ల భాషల్లో బోధన జరుగుతుండగా.. కొత్తగా బోధన మీడియం భాషలుగా తెలుగు సహా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో గుర్తించిన మరో 21 భాషలను చేరుస్తూ బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో కొత్త పీజీ కోర్సు అందుబాటులోకి, ఈ ఏడాది నుంచే ప్రవేశాలు
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ (JNAFAU)లో కొత్త పీజీ (మాస్టర్స్) కోర్సు అందుబాటులోకి వచ్చింది. ఎనర్జీ అండ్‌ సస్టైనబుల్‌ బిల్ట్‌ ఎన్విరాన్‌మెంట్‌ పేరుతో కొత్త మాస్టర్స్‌ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు యూనివర్సిటీ అధికారులు శనివారం నాడు ప్రకటించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ యూనివర్సిటీలో ఈ కోర్సును ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఈ కోర్సును ప్రవేశపెట్టిన తొలి విద్యాసంస్థ ఇదేనని వర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎన్‌.కవితా దర్యాణిరావు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో ఈ కోర్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పరిశ్రమ, సబ్జెక్ట్‌ నిపుణుల సహకారంతో ఈ కోర్సును రూపొందించబడిందని, కోర్సులో 20 మందికి ప్రవేశాలను కల్పించనున్నట్లు తెలిపారు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 28 Aug 2023 12:39 PM (IST) Tags: Degree Admissions Degree Admission Notification AP Degree Courses Degree Online Application AP Degree Online Admissions

ఇవి కూడా చూడండి

CPGET Seat Allotment: సెప్టెంబరు 29న సీపీగెట్‌ సీట్ల కేటాయింపు, ఈ తేదీలోగా జాయిన్ అవ్వాల్సిందే!

CPGET Seat Allotment: సెప్టెంబరు 29న సీపీగెట్‌ సీట్ల కేటాయింపు, ఈ తేదీలోగా జాయిన్ అవ్వాల్సిందే!

IITTP: తిరుపతి ఐఐటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, వివరాలు ఇలా

IITTP: తిరుపతి ఐఐటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, వివరాలు ఇలా

IIAD: ఐఐఏడీ-న్యూఢిల్లీలో యూజీ, పీజీ కోర్సులు - వివరాలు ఇలా

IIAD: ఐఐఏడీ-న్యూఢిల్లీలో యూజీ, పీజీ కోర్సులు - వివరాలు ఇలా

IITTP: తిరుపతి ఐఐటీలో ఎంఎస్‌ రిసెర్చ్‌ ప్రోగ్రామ్, వివరాలు ఇలా

IITTP: తిరుపతి ఐఐటీలో ఎంఎస్‌ రిసెర్చ్‌ ప్రోగ్రామ్, వివరాలు ఇలా

World University Rankings 2024: వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకుల్లో 91 భారతీయ విశ్వవిద్యాలయాలకు చోటు

World University Rankings 2024: వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకుల్లో 91 భారతీయ విశ్వవిద్యాలయాలకు చోటు

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది