అన్వేషించండి

RBI 90 Quiz: విద్యార్థులకు ఆర్‌బీఐ బంపరాఫర్, ఏకంగా రూ.10 లక్షలు గెలుచుకునే ఛాన్స్!

RBI: ఆర్‌బీఐ ఏర్పడి 90 వసంతాలు పూర్తిచేసుకున్న నేపథ్యంలో విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించనున్నారు. డిగ్రీ స్థాయిలో విద్యార్థుల మేధాశక్తిని పరీక్షించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

RBI Nationwide Quiz for Graduate Students: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విద్యార్థులకు బంపరాఫర్ ప్రకటించింది. ఆర్‌బీఐ ఏర్పడి 90 సంవత్సరాలు పూర్తవడంతో విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా డిగ్రీ స్థాయిలో విద్యార్థుల మేధాశక్తిని పరీక్షించేందుకు 'ఆర్బీఐ-90' పేరుతో ఈ క్విజ్ పోటీలను జాతీయ స్థాయిలో నిర్వహించనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకాగా.. సెప్టెంబరు 17 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సెప్టెంబరు 19  నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు క్విజ్ పోటీలు నిర్వహించనున్నారు. 2024 సెప్టెంబరు 1 నాటికి 25 ఏళ్లలోపు వయసు ఉండి ఏదైనా కళాశాలలో డిగ్రీ చదువుతున్న వారు ఈ పోటీలో పాల్గొనవచ్చు. 

10 లక్షలు గెలుచుకునే అవకాశం..
దీనిద్వార ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల విద్యార్థులు రూ.10 లక్షలు గెలుచుకునే సువర్ణావకాశాన్ని ఆర్బీఐ కల్పించింది. విద్యార్థుల్లో రిజర్వు బ్యాంకు ఆర్థిక వ్యవస్థ గురించి అవగాహనతోపాటు డిజిటల్ లావాదేవీలు, సురక్షిత బాధ్యతాయుత వినియోగం తదితరాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఆర్‌బీఐ ఈ పోటీలను నిర్వహిస్తోంది. 

నాలుగు దశల్లో పోటీలు..
ప్రతి కళాశాల నుంచి ఎంతమంది విద్యార్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో టీమ్‌లో కనీసం ఇద్దరు విద్యార్థులు ఉండాలి. మొత్తం నాలుగు దశల్లో క్విజ్ పోటీలు జరగనున్నాయి. తొలుత జిల్లా స్థాయి, ఆన్‌లైన్ దశ ప్రారంభమై రాష్ట్ర, జోనల్, జాతీయ స్థాయి పోటీలు నిర్వహించనున్నారు. విజేతలకు రూ.లక్ష నుంచి రూ.10 లక్షలు గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఆంగ్లం, హిందీ భాషల్లో పోటీలు ఉంటాయి. ప్రధానంగా దేశ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాలు, ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ, ఆర్థిక వ్యవస్థ, క్రీడలు, చరిత్ర, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమకాలీన అంశాలు, తదితరాలపై ప్రశ్నలుంటాయి.  

బహుమతులు ఇలా..

➥ రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి 2 లక్షలు, ద్వితీయ బహుమతి 1.5 లక్షలు, తృతీయ బహుమతి కింద రూ.1 లక్ష ఇస్తారు. 

➥ జోనల్ స్థాయిలో ప్రథమ బహుమతి 5 లక్షలు, ద్వితీయ బహుమతి 4 లక్షలు, తృతీయ బహుమతి కింద రూ.3 లక్షలు ఇస్తారు. 

➥ జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి 10 లక్షలు, ద్వితీయ బహుమతి 8 లక్షలు, తృతీయ బహుమతి కింద రూ.6 లక్షలు ఇస్తారు.

దరఖాస్తులు ఇలా.. 

➥ దరఖాస్తు కోసం విద్యార్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. www.rbi90quiz.in  

➥ వెబ్‌సైట్‌లో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.

➥ రిజిస్ట్రేషన్ పేజీలో విద్యార్థులు తమ వివరాలు సమర్పించాలి. రాష్ట్రం, జిల్లా, కళాశాల వివరాలు నమోదుచేయాలి. 

➥ పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ఒకరైతే ఒకరు, ఇద్దరైతే ఇద్దరు పేర్లు నమోదు చేయాలి.

➥ దరఖాస్తు సమయంలో స్టూడెంట్ ఐడీ, ఈమెయిల్, ఫోన్ నంబర్, జెండర్, పుట్టినతేదీ తదితర వివరాలు నమోదుచేయాలి. 

➥ వివరాల నమోదుప్రక్రియ పూర్తయిన తర్వాత ఒకసారి సరిచూసుకొని Submit బటన్ మీద క్లిక్ చేయాలి. 

➥ దరఖాస్తు కోసం విద్యార్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget