News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

అలాంటి చదువులే కావాలంటున్న విద్యార్థులు, యూఎన్ గ్లోబల్ సర్వేలో ఆసక్తికర విషయాలు

ఉన్నత చదువులు చదివి, ఉత్తమమైన జీవితానికి స్థిరత్వం ఉండేలా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు మార్గం చూపే చదువులకే నేటి యువత ఆసక్తి చూపుతోంది. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

FOLLOW US: 
Share:

ఉన్నత చదువులు చదివి, ఉత్తమమైన జీవితానికి స్థిరత్వం ఉండేలా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు మార్గం చూపే చదువులకే నేటి యువత ఆసక్తి చూపుతోంది. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఆర్థిక, సామాజిక భద్రత, స్వతంత్ర జీవనానికి భరోసానిచ్చేలా విద్యాభ్యాసం ఉండాలనే అభిప్రాయాన్ని 10 నుంచి 24 ఏళ్ల వయసున్న 40.5 శాతం మంది విద్యార్థులు వెలిబుచ్చారు. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అనుబంధంగా ఉన్న పీఎంఎన్‌సీహెచ్ (పార్ట్‌నర్‌షిప్ ఫర్ మెటర్నల్, న్యూబోర్న్ & ఛైల్డ్ హెల్త్) సంస్థ 'యువత ఏం కోరుకుంటోంది?' పేరుతో ప్రపంచవ్యాప్త రియల్ టైమ్ సర్వేను నిర్వహిస్తోంది. నేటి యువత కోరుకుంటుందేమిటో తెలుసుకుని దేశాల వారీగా వాటిని సాకారం చేయడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించుకునేందుకు, విధాన నిర్ణేతలను ఒప్పించేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని పీఎంఎన్‌సీహెచ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెల్గా ఫాగ్ స్టాడ్ తెలిపారు.

సర్వేలో భాగంగా 10 నుంచి 24 సంవత్సరాల వయసున్న 7,13,273 మంది లిఖితపూర్వకంగా సమాధానాలిచ్చారు. వీరిలో మన దేశానికి చెందిన వారు 17.2 శాతంగా ఉన్నారు. ప్రతి ఏడాది ఆగస్టు 12న జరుపుకునే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వే నిర్వాహకులు మధ్యంతర నివేదిక విడుదల చేశారు.

నివేదికలోని అంశాలు..

* సర్వేలో పాల్గొన్న వారిలో... 15-19 వయసు గ్రూపు వారు 47.2 శాతంగా ఉన్నారు. వీరిలోనూ కిశోరప్రాయ బాలికలు 49.2 శాతం మంది ఉన్నారు. వీరంతా చదువునే అవకాశాలుండాలని, నాణ్యమైన విద్య లభించాలని కోరుకున్నారు.

* భద్రత.. భరోసానిచ్చే వాతావరణం ఉండాలని 21.2శాతం మంది తెలిపారు.

* మంచి ఆరోగ్యం, పౌష్టికాహారానికి ప్రాధాన్యమిస్తున్నట్లు 16.3 శాతం మంది అభిప్రాయపడ్డారు. 

* కిశోరప్రాయ బాలురు... పరిశుద్ధమైన నీరు, మంచి రోడ్లు ఉండాలని సూచించగా.. అదే వయసు బాలికలు పరిశుద్ధమైన నీరు అందుబాటులో ఉండాలని తెలపడంతో పాటు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ ఇవ్వాలన్నారు. 

ALSO READ:

ఆర్‌ఐఎంసీలో 8వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!
డెహ్రాడూన్‌‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌(ఆర్‌ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి (2024 జులై సెషన్) ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్థానిక బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, వైవా, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్న విద్యార్థులు అక్టోబరు 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. వీరికి డిసెంబరు 2న ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

నవోదయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ - పరీక్ష విధానం, ఎంపిక, అర్హతల వివరాలు ఇలా!
జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరాకిగాను ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ ఏడాది రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 20న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ ఏడాది నవంబరు 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు.. ఇంటర్‌ దాకా ఉచితంగా చదువు, వసతి, భోజనం కల్పిస్తారు. బోధన కూడా అత్యున్నత ప్రమాణాల్లో ఉంటుంది. ప్రవేశ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19న ప్రారంభంకాగా, ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.  
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Published at : 12 Aug 2023 12:50 PM (IST) Tags: PMNCH Survey What Young People Want PMNCH Interim analysis PMNCH world’s largest survey adolescent and youth well-being

ఇవి కూడా చూడండి

US Visa: రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు- 3 నెలల్లో 90 వేల వీసాలు ఇచ్చిన అమెరికా

US Visa: రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు- 3 నెలల్లో 90 వేల వీసాలు ఇచ్చిన అమెరికా

CTET 2023 Results: సీటెట్‌ (జులై) - 2023 ఫలితాలు విడుదల, రిజల్ట్స్‌ కోసం డైరెక్ట్ లింక్

CTET 2023 Results: సీటెట్‌ (జులై) - 2023 ఫలితాలు విడుదల, రిజల్ట్స్‌ కోసం డైరెక్ట్ లింక్

AP ECET: ఏపీఈసెట్‌ ఫార్మసీ కౌన్సెలింగ్‌ ప్రారంభం, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

AP ECET: ఏపీఈసెట్‌ ఫార్మసీ కౌన్సెలింగ్‌ ప్రారంభం, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

ANGRAU Admissions: ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీలో ప్రవేశాలకు 27 నుంచి వెబ్‌ ఆప్షన్లు

ANGRAU Admissions: ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీలో ప్రవేశాలకు 27 నుంచి వెబ్‌ ఆప్షన్లు

Scholarships: సంతూర్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 2023-24, చివరితేది ఎప్పుడంటే?

Scholarships: సంతూర్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 2023-24, చివరితేది ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!