అన్వేషించండి

PJTSAU: వ్యవసాయ వర్సిటీలో బీటెక్‌ ప్రవేశాలు, నవంబరు 15న వాక్‌ఇన్ కౌన్సెలింగ్ నిర్వహణ

Admission In PJTSAU : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నిజామాబాద్‌ జిల్లాలోని రుద్రూర్‌ వ్యవసాయ కళాశాలలో బీటెక్‌ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించనుంది.

Walk-in Counselling For Admission in PJTSAU: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం(Professor Jayashankar Telangana State Agricultural University), 2023-24 విద్యా సంవత్సరానికి నిజామాబాద్‌ జిల్లాలోని రుద్రూర్‌ వ్యవసాయ కళాశాల9(Rudrur Agricultural College) 0లో ఎంపీసీ/బైపీసీ/ఎంబైపీసీ స్ట్రీమ్ కింద బీటెక్‌ (ఫుడ్ టెక్నాలజీ)(B.Tech (Food Technology) కోర్సుల్లో ప్రవేశాలకు నవంబరు 15న వాక్-ఇన్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు టీఎస్‌‌ఎంసెట్‌-2023 ర్యాంక్ సాధించినవారు ప్రవేశాలకు అర్హులు. ఈ కౌన్సెలింగ్ ద్వారా మొత్తం 46 సీట్లను భర్తీచేయనున్నారు. అభ్యర్థులు అన్ని అవసరమైన ధ్రువపత్రాలతో నవంబరు 15న ఉదయం 10 గంటల నుంచి నిర్వహించే వాక్-ఇన్ కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ గ్రూపులు చదివినవారు కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చు.

కోర్సు వివరాలు..

* బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ): 46 సీట్లు

సీట్ల కేటాయింపు: మొత్తం సీట్లలో ఓసీ - 46%, ఈడబ్ల్యూఎస్ - 10%, బీసీ-ఏ:7%, బీసీ-బి: 10%, బీసీ-సి:1%, బీసీడీ:7%, బీసీ-ఈ: 4%, ఎస్సీ:15%, ఎస్టీ:10% కేటాయించారు.

అర్హత: ఇంటర్మీడియట్ (ఎంపీసీ/బైపీసీ/ఎంబైపీసీ స్ట్రీమ్) ఉత్తీర్ణతతో పాటు టీఎస్‌ ఎంసెట్‌-2023 ర్యాంక్ సాధించి ఉండాలి. గ్రూప్ సబ్జెక్టులలో కనీసం 50 శాతం మార్కులు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 31.12.2023 నాటికి 17 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.

వాక్‌ ఇన్‌ కౌన్సెలింగ్ తేది: 15.11.2023.

వేదిక: 
Water Technology Centre Auditorium,
Rajendranagar, P.J.T.S.A.U.

కౌన్సెలింగ్‌కు వచ్చేవారు తీసుకురావాల్సిన ఒరిజినల్ సర్టిఫికేట్లు..

➥ పుట్టినతేది ధ్రువీకరణ కోసం పదోతరగతి లేదా తత్సమాన మార్కుల మెమో.

➥ఇంటర్ మార్కుల మెమో.

➥ ఎంసెట్-2023 హాల్‌టికెట్, ర్యాంక్ కార్డు. 

➥ 6 నుంచి 12వ తరగతి వరకు బోనఫైడ్/స్టడీ సర్టిఫికేట్ 

➥ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (టీసీ).

➥ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ 

➥ క్యాస్ట్ సర్టిఫికేట్ (బీసీ, ఎస్సీ, ఎస్టీలకు) 

➥ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ (2023-24) 

➥ నాన్-మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్

➥ అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ 

Notification

ALSO READ:

తెలంగాణ 'హార్టిసెట్‌-2023' నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ములుగులోని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, 2023-24 విద్యా సంవత్సరానికిగాను ఉద్యానవన డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు 'హార్టిసెట్‌-2023' నోటిపికేషన్ విడుదల చేసింది. హార్టికల్చర్ విభాగంలో డిప్లొమా(పాలిటెక్నిక్‌) ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా బీఎస్సీ ఆనర్స్‌ (హార్టికల్చర్) డిగ్రీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు నవంబరు 28లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.350 చెల్లిస్తే సరిపోతుంది. దరఖాస్తు పరిశీలన తర్వాత, ప్రవేశపరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను యూనివర్సిటీ ప్రకటిస్తుంది.
హార్టిసెట్ వివరాల కోసం క్లిక్ చేయండి..

హార్టికల్చరల్ ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు..
హార్టికల్చరల్ యూనివర్సిటీ, 2023-24 విద్యా సంవత్సరానికి హార్టికల్చర్‌ ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నవంబరు 3న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంఎస్సీ కోర్సులో ప్రవేశానికి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, పీహెచ్‌‌డీ ప్రవేశాలకు సంబంధిత విభాగంలో ఎంఎస్సీ (హార్టికల్చర్)తో పాటు ఐకార్‌ ఏఐసీఈ- జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ)-2023 స్కోరు సాధించి ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 20లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఆలస్యరుసుముతో నవంబరు 22 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం కల్పించారు.
కోర్సులవివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget