అన్వేషించండి

NEET UG 2024: మే 5న నీట్‌యూజీ - 2024 పరీక్ష, అభ్యర్థులారా! ఈ నిబంధనలు పాటించాల్సిందే!

దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 5న నీట్ యూజీ-2024 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా ముఖ్యమైన సూచనలు పాటించాల్సి ఉంటుంది.

NEET UG 2024: దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 5న నీట్ యూజీ-2024 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  దేశవ్యాప్తంగా 571 కేంద్రాల్లో మే 5న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు నీట్ యూజీ ప్రవేశ పరీక్ష జరుగనుంది. పెన్ను, పేపర్ విధానంలో జరిగే ఈ పరీక్షలకు ఎన్టీఏ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. తెలుగుతో పాటు 13 బాషల్లో నీట్ యూజీ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది నీట్ పరీక్ష కోసం 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే నీట్ అడ్మిట్ కార్డులను వెల్లడించిన సంగతి తెలిసిందే. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్‌కార్డుతోపాటు, ప్రభుత్వం జారీచేసిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డును, ఫోటోలను తీసుకొని పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రానికి కనీసంగంటన్నర ముందు చేరుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అడ్మిట్‌కార్డుపై ఉన్న నిబంధనలను స్పష్టంగా చదవవాలి. ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతించేవి, అనుమతించనవి ఏవో ఉంటాయి. ఏయే డాక్యుమెంట్లు తీసుకెళ్లాలో సూచనలు కూడా ఉంటాయి. ఈ గైడ్ లైన్స్ అన్నింటినీ అభ్యర్థులు పూర్తిగా చదివి అందుకు అనుగుణంగా అన్నీ సిద్ధం చేసుకొని పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.

NEET (UG) - 2024 Admit Cards

విద్యార్థులకు ముఖ్య సూచనలు..

🔰 నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్‌కార్డుతో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటోను తీసుకెళ్లాలి. ఫొటోను అటెండెన్స్‌ షీట్‌పై అతికించాల్సి ఉంటుంది.

🔰 అభ్యర్థులు డ్రెస్‌ కోడ్‌ తప్పనిసరిగా పాటించాలి. పొడవు చేతులున్న డ్రెస్సులు, షూలు, నగలు, మెటల్‌ వస్తువులను లోనికి అనుమతించరు.

🔰 స్లిప్పర్లు, తక్కువ ఎత్తున్న శాండిల్స్‌ మాత్రమే వేసుకోవాలి.

🔰 పేపర్లు, జామెట్రీ/పెన్సిల్‌ బాక్సులు, ప్లాస్టిక్‌ పౌచ్‌లు, కాలిక్యులేటర్లు, స్కేళ్లు, రైటింగ్‌ ప్యాడ్స్‌, పెన్‌డ్రైవ్స్‌, ఎలక్ట్రానిక్‌ పెన్నులు వంటి వాటిని పరీక్ష కేంద్రానికి అనుమతించరు.

🔰  చేతికి వాచ్‌లు, వాలెట్లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, బెల్ట్‌లు, టోపీలు వంటివి కూడా ధరించకూడదు.

నీట్ యూజీ పరీక్ష విధానం..
➥ నీట్ ప్రవేశ పరీక్ష పూర్తి ఆఫ్‌లైన్‌ (పెన్, పేపర్) విధానంలో నిర్వహించబడుతుంది. మూడు గంటల 20 నిముషాల నిడివితో జరిగే ఈ పరీక్షలో ప్రతి సబ్జెక్టు నుండి గరిష్టంగా 45 ప్రశ్నలు చెప్పున మొత్తం 180 ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రశ్నలు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ మరియు జూవాలాజీ సబ్జెక్టులకు సంబంధించి ఉంటాయి.

➥ ఒక్కో సబ్జెక్టు నుంచి రెండు సెక్షన్ల (సెక్షన్-ఎ, బి) వారీగా 50 ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-ఎ నుంచి 35 ప్రశ్నలు, సెక్షన్-బి నుంచి 15 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-బి లోని 15 ప్రశ్నల్లో 10 ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అభ్యర్థి సమాధానం చేసిన మొదటి 10 ప్రశ్నలను మాత్రమే లెక్కింపు సమయంలో పరిగణలోకి తీసుకుంటారు.

➥ ప్రతి ప్రశ్న మల్టిఫుల్ ఛాయస్ పద్దతిలో నాలుగు ఆప్షనల్ సమాధానాలు కలిగి ఉంటుంది. అందులో ఒక సరైన సమాధానాన్ని గుర్తించవలసి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. తప్పు సమాధానం ఇచ్చిన ప్రశ్నకు మైనస్ 1 మార్కు ఇవ్వబడుతుంది.

➥ మొత్తం 720 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 10+2/ఇంటర్మీడియట్ స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలాజీ) లకు సంబంధించిన సిలబస్ నుండి ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్న పత్రాలు దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

NEET UG Notification: నీట్‌ యూజీ - 2024 నోటిఫికేషన్‌ వచ్చేసింది, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ!

Information Broucher

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

GVMC Mayor Voting: విశాఖ మేయర్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం, కూటమి ఖాతాలో మరో మేయర్ పీఠం
విశాఖ మేయర్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం, కూటమి ఖాతాలో మరో మేయర్ పీఠం
Hyderabad News: ఆమెతో మాట్లడాలంటే భయపడేవాళ్లం.. ఆరోజు పిల్లలను చంపేందుకే స్కూల్ మాన్పించింది- ABP దేశంతో పనిమనిషి
ఆమెతో మాట్లడాలంటే భయపడేవాళ్లం.. ఆరోజు పిల్లలను చంపేందుకే స్కూల్ మాన్పించింది- ABP దేశంతో పనిమనిషి
Mithun Reddy in AP Liquor Scam: లిక్కర్ స్కాంలో విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి, ప్రశ్నల వర్షం కురిపిస్తున్న అధికారులు
ఏపీ లిక్కర్ స్కాంలో విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి, ప్రశ్నల వర్షం కురిపిస్తున్న అధికారులు
Bhu Bharathi Act: ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB Loss in Chinna Swamy Stadium | ఆర్సీబీకి విజయాలను అందించలేకపోతున్న చిన్నస్వామి స్టేడియంPBKS Great Victories in IPL 2025 | ఊహించని రీతిలో విజయాలు సాధిస్తున్న పంజాబ్ కింగ్స్Trolls on RCB for Crossing 49 Runs | జర్రుంటే సచ్చిపోయేవాళ్లు..ఓ రేంజ్ లో RCB కి ట్రోల్స్Tim David 50* vs PBKS IPL 2025 | పీకల్లోతు కష్టాల్లో నుంచి RCB ని బయటపడేసిన టిమ్ డేవిడ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GVMC Mayor Voting: విశాఖ మేయర్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం, కూటమి ఖాతాలో మరో మేయర్ పీఠం
విశాఖ మేయర్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం, కూటమి ఖాతాలో మరో మేయర్ పీఠం
Hyderabad News: ఆమెతో మాట్లడాలంటే భయపడేవాళ్లం.. ఆరోజు పిల్లలను చంపేందుకే స్కూల్ మాన్పించింది- ABP దేశంతో పనిమనిషి
ఆమెతో మాట్లడాలంటే భయపడేవాళ్లం.. ఆరోజు పిల్లలను చంపేందుకే స్కూల్ మాన్పించింది- ABP దేశంతో పనిమనిషి
Mithun Reddy in AP Liquor Scam: లిక్కర్ స్కాంలో విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి, ప్రశ్నల వర్షం కురిపిస్తున్న అధికారులు
ఏపీ లిక్కర్ స్కాంలో విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి, ప్రశ్నల వర్షం కురిపిస్తున్న అధికారులు
Bhu Bharathi Act: ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
Trisha Krishnan: 'పెళ్లిపై మీ ఒపీనియన్ ఏంటి?' - నటి త్రిష ఏం చెప్పారో తెలుసా?
'పెళ్లిపై మీ ఒపీనియన్ ఏంటి?' - నటి త్రిష ఏం చెప్పారో తెలుసా?
Urvashi Rautela: తనకు గుడి కట్టాలన్న నటి ఊర్వశీ రౌతేలా - ఆ కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చిన టీం.. ఏం చెప్పారంటే?
తనకు గుడి కట్టాలన్న నటి ఊర్వశీ రౌతేలా - ఆ కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చిన టీం.. ఏం చెప్పారంటే?
AP 10th Class Results: ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది, ఈసారి ఎంతో ప్రత్యేకం
ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది, ఈసారి ఎంతో ప్రత్యేకం
PM Modi AP Tour: మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
Embed widget