అన్వేషించండి

CUET: సీయూఈటీ (యూజీ) ఫైనల్ ఆన్సర్ 'కీ' విడుదల, ఫలితాలు ఎప్పుడంటే?

దేశంలోని వివిధ కాలేజీలు, యూనివర్సిటీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష ఫైనల్ ఆన్సర్ కీ విడుదలైంది.అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచారు..

దేశంలోని వివిధ కాలేజీలు, యూనివర్సిటీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష ఫైనల్ ఆన్సర్ కీ విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచారు. మే 21 నుంచి జూన్‌ 23 వరకు 13 బాషల్లో, తొమ్మిది దశల్లో నిర్వహించగా.. దేశవ్యాప్తంగా 387 నగరాలు, విదేశాల్లోని 24 నగరాల్లో దాదాపు 14.90లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష ప్రాథమిక కీని ఏప్రిల్ 29న విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్సర్ కీపై జూన్ 29 నుంచి జులై 1 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం తాజాగా తుది కీని ఎన్టీఏ విడుదల చేసింది. జులై 15న సీయూఈటీ (యూజీ) ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.  
ఫైనల్ 'కీ' కోసం క్లిక్ చేయండి.. 

ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న 44 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికిగానూ యూజీ కోర్సుల్లో చేరవచ్చు. ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలు సైతం అడ్మిషన్ల కోసం సీయూఈటీ స్కోరును పరిగణనలోకి తీసుకుంటాయి. వీటిలో 12 రాష్ట్ర యూనివర్సిటీలు, 11 డీమ్డ్ వర్సిటీలు, 19 ప్రైవేటు యూనివర్సిటీలతో కలిపి మొత్తం 99 యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్ష ద్వారా జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇగ్నో, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ వంటి మరెన్నో ప్రముఖ విద్యాసంస్థల్లో సీటు సంపాదించవచ్చు. 

ALSO READ:

ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదల, కౌన్సెలింగ్ ఎప్పుడంటే?
ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలోని 4 ట్రిపుల్‌ ఐటీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను గురువారం (జులై 13) విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపికైన అభ్యర్థుల జాబితాలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంచారు. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళంలోని ఒక్కో ట్రిపుల్‌ ఐటీలో 1000 చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయి. జులై 20 నుంచి 25 వరకు ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..

జోసా కౌన్సెలింగ్-2023 మూడో రౌండ్‌ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ 2023 మూడో రౌండ్ ఫలితాలు జులై 13న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో సీట్ల కేటాయింపు ఫలితాలను అందుబాటులో ఉంచారు. మూడో రౌండ్ కౌన్సెలింగ్‌లో జేఈఈ ర్యాంకు వివరాలు నమోదు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో సీటు కేటాయింపు చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ జేఈఈ మెయిన్ అప్లికేషన్ నెంబరు, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు ఇతర విద్యా సంస్థల్లో బీటెక్‌ సీట్లు జోసా కౌన్సెలింగ్‌తో భర్తీ చేస్తారు. మూడో రౌండ్ కౌన్సెలింగ్‌లో సీటు పొందిన అభ్యర్థులు సీట్ ప్రాసెసింగ్ ఫీజును జమ చేసి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..

ఏపీ వైద్య కళాశాలల్లో పారామెడికల్ డిప్లొమా కోర్సులు, వివరాలు ఇలా!
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్(ఏపీఎస్ఏహెచ్‌పీసీ) 2023-2024 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రైవేటు పారామెడికల్‌ కళాశాలల్లో అందుబాటులో ఉన్న వివిధ పారామెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. రెండేళ్ల కాలపరిమితితో అందిస్తున్న ఈ కోర్సులకు ఇంటర్మీడియట్‌ బైపీసీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జులై 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
Skyroot Vikram-1 launch: నింగిలోకి దూసుకెళ్లిన స్కైరూట్ విక్రమ్‌-1! అంతరిక్షానికి ఉబర్‌ లాంటి సేవలు ప్రారంభం!
నింగిలోకి దూసుకెళ్లిన స్కైరూట్ విక్రమ్‌-1! అంతరిక్షానికి ఉబర్‌ లాంటి సేవలు ప్రారంభం!
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Embed widget