KNRUHS MBBS, BDS Admissions: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో యాజమాన్య కోటాలో తుది విడత ప్రవేశాలు, ఇదే చివరి అవకాశం!
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇప్పటికే మూడు విడతల కౌన్సెలింగ్ పూర్తయింది. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకోని వారికి మరో అవకాశం కల్పించాలన్న విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం అనుమతించింది.
తెలంగాణలోని ప్రైవేటు వైద్య, దంత కళాశాలల్లో యాజమాన్య కోటాలో మిగిలిన సీట్లను భర్తీ చేయడానికి తుది విడత ప్రవేశాలు నిర్వహించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం డిసెంబరు 15న ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కోర్సుల్లో ఇప్పటికే మూడు విడతల కౌన్సెలింగ్ పూర్తయిందని, గతంలో రిజిస్ట్రేషన్ చేసుకోని వారికి మరో అవకాశం కల్పించాలన్న అభ్యర్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం జీవోను సడలిస్తూ ఈ ఆఖరి విడత ప్రవేశాలకు అనుమతించిందని పేర్కొంది.
అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని డిసెంబర్ 17న కాకతీయ వర్సిటీ ప్రాంగణంలోని హెల్ప్‌లైన్ కేంద్రంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ సంబంధిత ధ్రువపత్రాలతో హాజరు కావాలని కోరింది. నిబంధనలు, పూర్తి వివరాలకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని సూచించింది.
Also Read:
జేఈఈ మెయిన్-2023 నోటిఫికేషన్ వచ్చేసింది, పరీక్షల షెడ్యూలు ఇలా!
జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రెండు విడతల్లో పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. తొలి విడత పరీక్షలు జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో నిర్వహిస్తామని వెల్లడించింది. రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. జనవరి 12 వరకు తొలి విడత జేఈఈ మెయిన్ దరఖాస్తుల స్వీకరించనున్నట్లు పేర్కొంది.
నోటిఫికేషన్, పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా పీహెచ్‌డీకి అర్హులే- యూజీసీ కీలక నిర్ణయం!
పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) లేకుండానే పీహెచ్‌డీ చేసే అవకాశం విద్యార్థులకు దక్కనుంది. ఈ మేరకు యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) చైర్మన్ జగదీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఇకపై పీహెచ్‌డీలో అడ్మిషన్ కోసం మాస్టర్ డిగ్రీ అవసరం లేదని తెలిపారు. నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసినవారు కూడా పీహెచ్‌డీకి అర్హులని ఆయన ప్రకటించారు. నాలుగేళ్ల డిగ్రీ కోర్సు పూర్తిచేశాక పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులు లేదా రెండో సంవత్సరం విద్యార్థులు కూడా పీహెచ్‌డీలో చేరేందుకు అర్హులవుతారని వెల్లడించారు. కాగా, ఇప్పటి వరకు పీహెచ్‌డీలో అడ్మిషన్ పొందాలంటే పీజీ పూర్తి చేసిన వారే అర్హులు. తాజాగా యూజీసీ నిబంధనలు సవరించడంతో పీజీ పూర్తి చేయకున్న.. నాలుగేళ్ల డిగ్రీ కంప్లీట్ చేసిన వారు కూడా పీహెచ్‌డీలో అడ్మిషన్ పొందేందుకు అర్హులు అవుతారు.
యూజీసీ తీసుకొచ్చిన కొత్త నిబంధనల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి....
డిగ్రీ పరీక్ష విధానంలో సమూల మార్పులు..
డిగ్రీ పరీక్ష విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. పీహెచ్‌డీలో విద్యార్థులు పరిశోధనపై ప్రజెంటేషన్ ఇచ్చినట్లుగానే.. డిగ్రీలోనూ అలాంటి విధానాన్నే ప్రవేశపెట్లే యోచనలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి సమాలోచనలు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో పరీక్షలు, మూల్యాంకన విధానాన్ని మార్చాలని భావిస్తోంది. కొత్త విధానం రూప కల్పన బాధ్యతలను ISBకి అప్పగించింది. ఈ మేరకు ఇవాళ ISB, యూనివర్సిటీల వీసీలతో ఉన్నత విద్యామండలి సమావేశమైంది. ప్రస్తుత పద్ధతులు, తీసుకురావాల్సిన మార్పులపై చర్చించారు. పరీక్ష విధానంలో మార్పులు విద్యార్థి హితంగా ఉండాలని నిర్ణయించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..