NITR: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కెలాలో ఎంబీఏ ప్రోగ్రామ్, వివరాలు ఇలా
NIT Admissions: రూర్కెలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2024-26 విద్యాసంవత్సరానికిగాను ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
NIT Rourkela MBA Notification: రూర్కెలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2024-26 విద్యాసంవత్సరానికిగాను ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ అర్హతతోపాటు క్యాట్ (CAT), గ్జాట్(XAT), మ్యాట్ (MAT), సీమ్యాట్ (CMAT) పరీక్షలో ఏదైనా ఒకదాంట్లో అర్హత స్కోరు కలిగినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వీటితోపాటు అకడమిక్ మెరిట్, వర్క్ ఎక్స్‌పీరియన్స్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 15లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మార్చి 18, 19 తేదీల్లో గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే ఈమెయిల్: admission@nitrkl.ac.in ద్వారా సంప్రదించవచ్చు.
వివరాలు..
➥ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) ప్రోగ్రామ్
సీట్ల సంఖ్య: 75.
సీట్ల కేటాయింపు: ఓపెన్ కేటగిరీ - 30, ఈడబ్ల్యూఎస్ - 07, ఓపెన్ కేటరిగీ (దివ్యాంగులు) - 01, ఓబీసీ - 19, ఓబీసీ (దివ్యాంగులు) - 01, ఎస్సీ - 10, ఎస్సీ (దివ్యాంగులు) - 01, ఎస్టీ-06.
అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేట్. క్యాట్/ ఎక్స్‌ఏటీ/ మ్యాట్/ సీమ్యాట్ స్కోర్ కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
దరఖాస్తు ఫీజు: రూ.500. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కలెక్ట్ పోర్టల్ ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: క్యాట్/ ఎక్స్‌ఏటీ/ మ్యాట్/ సీమ్యాట్ స్కోర్, కెరియర్ మార్కులు, పని అనుభవం, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా. మొత్తం 100 మార్కులకు ఎంపికవిధానం ఉంటుంది. ఇందులో సంబంధిత టెస్ట్ స్కోరుకు 40 మార్కులు, కెరీర్‌కు-30 మార్కులు, వర్క్ ఎక్స్‌పీరియన్స్‌కు 10 మార్కులు, గ్రూప్ డిస్కషన్‌కు 10 మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూకు10 మార్కులు కేటాయించారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.02.2024.
➥ గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా వెల్లడి: 29.02.2024.
➥ గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తేదీలు: 18 - 19.03.2024 29.02.2024.
➥ ఫలితాల వెల్లడి: 29.03.2024.
➥ ప్రవేశాలు పొందేందుకు చివరితేది: 15.04.2024.
➥ మొదటి సెమిస్టర్ కోసం రిజిస్ట్రేషన్: 22.07.2024.
➥ మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభం: 24.07.2024.
ALSO READ:
బిట్స్ పిలానీలో ఎంబీఏ ప్రోగ్రామ్, కోర్సు వివరాలు ఇలా
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS) పిలానీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ ప్రోగ్రామ్‌లో (MBA Admissions) ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రవేశ పరీక్ష (బిజినెస్ అనలిటిక్స్ ఆప్టిట్యూడ్ టెస్ట్-BAAT), పర్సనల్ ఇంటర్వ్యూ (లేదా) క్యాట్ (CAT) 2023/ ఎక్స్‌ఏటీ (XAT) 2024/ జీమ్యాట్ (GMAT) 2023, అకడమిక్ మెరిట్, పని అనుభవం తదితరాల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 19న అర్దరాత్రి 11.59 గంటలలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల సవరణకు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4 వరకు అవకాశం కల్పిస్తారు.
దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..