అన్వేషించండి

NIFT Exam Results: నిఫ్ట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, స్కోర్‌ కార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ లో ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మార్చి 21న ఫలితాలను విడుదల చేసింది.

NIFT Results 2024 Declared: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT)లో ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మార్చి 21న ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి స్కోరుకార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 60 నగరాల్లోని 72 సెంటర్లలో ఫిబ్రవరి 5న ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని విడుదల చేసిన ఎన్‌టీఏ.. ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించింది. అభ్యంతరాలను నిపుణులు పరిశీలించిన తర్వాత ఫైనల్ ఆన్సర్ కీతోపాటు తాజాగా.. ఫలితాలను ఎన్టీఏ ప్రకటించింది.
 
నిఫ్ట్- (NIFT) ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇలా చూసుకోండి..
 
➥ ఫలితాల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌ సందర్శించాలి - https://www.nift.ac.in/
 
➥ అక్కడ హోంపేజీలోని ADMISSIONS సెక్షన్‌లో కనిపించే Declaration of results of NIFT Entrance Examination -2024 లింక్ మీద క్లిక్ చేయాలి.
 
➥ ఆ లింక్ మీద క్లిక్ చేయగానే.. ఫలితాలకు సంబంధించిన లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది.
 
➥ ఆ పేజీలో అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదచేసి Submit బటన్ మీద క్లిక్ చేయాలి.
 
➥ అభ్యర్థులు స్కోరుకార్డు కంప్యూటర్ స్క్రీన్ మీద దర్శమిస్తుంది
 
➥ స్కోరుకార్డు డౌన్‌లోడ్ చేసుకొని, భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.

ఫలితాల కోసం క్లిక్ చేయండి..

ఆ కోర్సులకు ఏప్రిల్ 1 నుంచి ఇంటర్వ్యూలు..  
బీఎఫ్ టెక్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ఫలితాలను ఏప్రిల్ చివరి వారంలో విడుదల చేయనున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. మరోవైపు, ఎన్‌ఐఎఫ్‌టీల్లో మాస్టర్స్ ప్రోగ్రామ్స్ (మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) ప్రోగ్రామ్‌లకు సంబంధించిన ఇంటర్వ్యూలకు షెడ్యూల్ ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి 6 వరకు ఢిల్లీలో ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొంది. పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని సూచించింది. ఏవైనా సందేహాలు ఉంటే అభ్యర్థులు ఎన్‌టీఏ హెల్ప్ డెస్క్ 011-40759000 నంబర్ లేదా nift@nta.ac.in ద్వారా తెలపవచ్చని ఎన్‌టీఏ తెలిపింది.

NIFT Exam Results: నిఫ్ట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, స్కోర్‌ కార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

కోర్సు వివరాలు..

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ప్రవేశాలు (NIFT - 2024)

నిఫ్ట్ క్యాంపస్‌లు: బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, దమణ్‌, గాంధీనగర్, హైదరాబాద్, జోధ్‌పుర్, కాంగ్రా, కన్నూర్, ముంబయి, న్యూదిల్లీ, పట్నా, పంచకుల, రాయ్‌బరేలి, షిల్లాంగ్, శ్రీనగర్.

➥ బ్యాచిలర్ ప్రోగ్రామ్స్

కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.

⫸ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్(బీడీఈఎస్‌)

విభాగాలు: ఫ్యాషన్ డిజైన్/ లెదర్ డిజైన్/ యాక్సెసరీ డిజైన్/ టెక్స్‌టైల్ డిజైన్/ నిట్‌వేర్ డిజైన్/ ఫ్యాషన్ కమ్యూనికేషన్.

⫸ బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (బీఎఫ్‌టెక్) ప్రోగ్రామ్

➥ మాస్టర్స్ ప్రోగ్రామ్‌

కోర్సు వ్యవధి: రెండేళ్లు. 

⫸ మాస్టర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్ (ఎండీఈఎస్‌)

⫸ మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ (ఎంఎఫ్‌ఎం)

⫸ మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎంఎఫ్‌టెక్‌)

➥ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌

విభాాగాలు: డిజైన్, మేనేజ్‌మెంట్, టెక్నాలజీ.

అర్హతలు: పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌కు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

Notification

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
State Wise EV Subsidy: ఇండియాలో ఏ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ సబ్సిడీ ఇస్తున్నారు - ఏపీ, తెలంగాణల్లో ఎంత వస్తుంది?
ఇండియాలో ఏ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ సబ్సిడీ ఇస్తున్నారు - ఏపీ, తెలంగాణల్లో ఎంత వస్తుంది?
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Embed widget