NEET UG 2022 Counselling: నేటి నుంచి 'నీట్' యూజీ రెండో విడత రిజిస్ట్రేషన్లు, డైరెక్ట్ లింక్ ఇదే!
నీట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు నవంబరు 2 నుంచి 7 వరకు రెండో విడత కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నవంబరు 7న మధ్యాహ్నం 3 గంటల వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంది.
నీట్ యూజీ 2022 రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నవంబరు 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభించనుంది. సెంట్రల్ కౌన్సెలింగ్‌లో భాగంగా నవంబరు 2 నుంచి 10 వరకు ఆల్ ఇండియా కోటాలో, ఇక నవంబరు 7 నుంచి 18 వరకు స్టేట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. నీట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు నవంబరు 2 నుంచి 7 వరకు రెండో విడత కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నవంబరు 7న మధ్యాహ్నం 3 గంటల వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో ఫీజు చెల్లించి, సీట్లు పొందనివారు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు నవంబరు 3 నుంచి 8 వరకు ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ కౌన్సెలింగ్ ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు నవంబరు 9, 10 తేదీల్లో సీట్లు కేటాయిస్తారు. ఇక నవంబరు 11న సీట్ల తుది కేటాయింపు ఫలితాలను విడుదల చేస్తారు. సెంట్రల్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందినవారు నవంబరు 18లోగా, స్టేట్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందినవారు నవంబరు 21లోగా సంబంధిత కళాశాలలో చేరాల్సి ఉంటుంది.
నవంబరు 23 నుంచి చివరి విడత (మాపప్ రౌండ్) కౌన్సెలింగ్..
నీట్ యూజీ 2022 మొదటి, రెండో విడతల్లో సీట్లు పొందలేని విద్యార్థులు చివరి విడత కౌన్సెలింగ్ ద్వారా ప్రయత్నంచేయవచ్చు. నవంబరు 23 నుంచి డిసెంబరు 1 వరకు సెంట్రల్ కౌన్సెలింగ్.. అలాగే డిసెంబరు 6 నుంచి 12 వరకు స్టేట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. సెంట్రల్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందినవారు డిసెంబరు 10 లోగా, స్టేట్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందినవారు డిసెంబరు 16 లోగా సంబంధిత కళాశాలలో చేరాల్సి ఉంటుంది.
మిగిలిపోయిన సీట్లకు...
మూడువిడతల కౌన్సెలింగ్ అనంతరం మిగిలినపోయిన సీట్లను సెంట్రల్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీచేస్తారు. డిసెంబరు 12 నుంచి 14 వరకు ఆల్ ఇండియా కోటాలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబరు 20లోగా కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.
నవంబరు 15 నుంచే తరగతులు..
నీట్ యూజీ 2022 కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందిన విద్యార్థులకు నవంబరు 15 నుంచే తరగతులు ప్రారంభంకానున్నాయి. అయితే బీడీఎస్/బీఎస్సీ నర్సింగ్ కోర్సులకు సంబంధించి రెండో విడత మాపప్ కౌన్సెలింగ్ కూడా నిర్వహించనున్నారు. ఈ షెడ్యూలును వెబ్‌సైట్ ద్వారా తెలియజేస్తారు. విద్యార్థులు శని, ఆదివారాల్లోనూ సంబంధింత కళాశాల్లో రిపోర్టింగ్ చేయవచ్చు.
నీట్ యూజీ 2022 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) సెప్టెంబరు 7న విడుదల చేసిన సంగతి తెలిసిందే. నీట్ పరీక్షకు మొత్తం 18,72,343 మంది రిజిష్టర్ చేసుకోగా.. 17,64,571 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 9,93,069 లక్షల మంది అర్హత సాధించారు. నీట్ పరీక్షలో అర్హత సాధించినవారిలో 4,29,160 మంది మహిళలు; 5,63,902 మంది పురుషులు, ఏడుగురు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. అంటే 56.27 శాతం ఉత్తీర్ణులయ్యారు.
Also Read:
ఐఎస్‌బీలో పీజీ ప్రోగ్రామ్, వీరు మాత్రమే అర్హులు!!
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ)- పీజీ ప్రోగ్రామ్ ప్రో(పీజీపీ ప్రో)లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఆంత్రప్రెన్యూర్స్‌కు ఉద్దేశించించిన ఈ ప్రోగ్రామ్ వ్యవధి 18 నెలలు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు క్యాంపస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇది వీకెండ్ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్. ఇందులో ఫౌండేషన్ కోర్సులు, కోర్ కోర్సులు, అడ్వాన్స్‌డ్ కోర్సులు, స్పెషలైజేషన్ కోర్సులు ఉంటాయి. ఆల్టర్‌నేట్ వీకెండ్ తరగతులు నిర్వహిస్తారు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
NIFT 2023 Registration: 'ఫ్యాషన్' కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రారంభం- చివరితేది ఎప్పుడంటే?
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ప్రవేశాలకు నిర్దేశించిన 'NIFT-2023' రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబరు 1న ప్రారంభమైంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబరు 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.3000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1500 చెల్లిస్తే సరిపోతుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది (2023) ఫిబ్రవరి 5న NIFT-2023 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
కోర్సులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..