NEET UG 2022: నీట్ యూజీ 'రౌండ్-1' సీట్ల రిసిగ్నేషన్‌కు నేడే ఆఖరు, ఇది చేసిన వారికే 'రౌండ్-2' అవకాశం!
మొదటి రౌండ్‌లో సీట్లు పొంది, సంబంధిత కళాశాలలో చేరకూడదనుకునే అభ్యర్థులు, ఈ విషయాన్ని MCCకి తెలియజేయాలని స్పష్టం చేస్తూ మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) నోటీసు జారీ చేసింది.
NEET UG 2022 Counseling Resignation: నీట్ యూజీ కౌన్సెలింగ్ రెండో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబరు 2 నుంచి ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో మొదటి రౌండ్‌లో సీట్లు పొంది, సంబంధిత కళాశాలలో చేరకూడదనుకునే అభ్యర్థులు, ఈ విషయాన్ని MCCకి తెలియజేయాలని స్పష్టం చేస్తూ మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) నోటీసు జారీ చేసింది. ఈ సమాచారాన్ని ఇవ్వడానికి, అంటే సీటును తిరస్కరించడానికి నవంబర్ 1తో గడువు ముగియనుంది. నవంబరు 1న సాయంత్రం 5 గంటల వరకు, అభ్యర్థులు సీటు నిరాకరణకు సంబంధించిన వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేసుకున్న అభ్యర్థులను మాత్రమే రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తారు.
నోటీసులో ఏముంది?
ఎంసీసీ జారీచేసిన నోటిసు ప్రకారం.. మొదటి రౌండ్‌లో సీట్లు పొంది, ఆస్తిక లేని విద్యార్థులు రెండో రౌండ్‌లో పాల్గొనాలనుకుంటే మొదటి రౌండ్‌లో వచ్చిన సీటును వదులుకుంటున్నట్లు తెలపాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా సంబంధిత కళాశాల నుంచి రిజిగ్నేషన్ లెటర్ జనరేట్ చేసుకోవాలి. ఇందుకు అక్టోబరు 28 నుంచి నవంబరు 1న సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. ఇలా దరఖాస్తు కున్నవారికి మాత్రమే రెండో రౌండ్‌కు అర్హులుగా పరిగణిస్తారు.
నవంబర్ 2 నుంచి రెండో విడత కౌన్సెలింగ్..
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-యూజీ (NEET-UG 2022) రెండో దశ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ నవంబర్ 2 నుండి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) అధికారిక వెబ్‌సైట్ mcc.nic.inలో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. నవంబర్ 7 వరకు రౌండ్ 2 కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. అధికారిక షెడ్యూల్ ప్రకారం.. ఫీజు చెల్లింపు సౌకర్యం నవంబర్ 7న మధ్యాహ్నం 3 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో నమోదు చేసుకున్న అభ్యర్థులు నవంబర్ 3 నుండి నవంబర్ 8 వరకు ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులకు నవంబర్ 7 నుండి నవంబర్ 8 వరకు సంబంధిత విశ్వవిద్యాలయాలు/సంస్థల ద్వారా ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. రెండో రౌండ్ సీట్ల కేటాయింపు ఫలితాలు నవంబర్ 11న విడుదల కానున్నాయి. ఎంపికైన అభ్యర్థులు నవంబర్ 12 నుండి నవంబర్ 18 వరకు అడ్మిషన్ కోసం కేటాయించిన ఇన్‌స్టిట్యూట్‌లలో రిపోర్ట్ చేయవచ్చు.
Also Read:
తెలంగాణ లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్య తేదీలివే!
తెలంగాణలో ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబర్ 2 నుంచి 12 వరకు ఆన్‌లైన్‌లో సర్టిఫికేట్ల పరిశీలన చేయనున్నారు. నవంబర్ 18, 19 తేదీల్లో లాసెట్, పీజీఎల్ సెట్ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఆప్షన్లు నమోదు చేసుకున్న అభ్యర్థులకు నవంబర్ 22న ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం సీట్లను కేటాయించనున్నారు. నవంబర్ 28 నుంచి ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం తరగతులు ప్రారంభం కానున్నాయి. కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ నవంబరు 1న వెలువడనుంది.