అన్వేషించండి

CSIR UGC NET June 2024: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ 2024 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం, పరీక్ష వివరాలు ఇలా

NTA: దేశంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో సైన్స్ విభాగంలో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం  'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్' నోటిఫికేషన్ వెలువడింది.

Joint CSIR-UGC NET June 2024: దేశంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో సైన్స్ విభాగంలో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ (జేఆర్‌ఎఫ్), అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల అర్హత, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం  'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్' పరీక్ష నిర్వహిస్తున్న సంగతి విదితమే. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సంయుక్తంగా ఏడాదికి రెండుసార్లు (జూన్, డిసెంబరు) ఈ అర్హత పరీక్షను నిర్వహిస్తాయి. ఈ ఏడాదికి గాను 'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్-జూన్ 2024' నోటిఫికేషన్ వెలువడింది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 1న ప్రారంభంకాగా.. మే 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు మే 22, 23 తేదీల్లో పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1150 చెల్లించాలి. ఓబీసీ అభ్యర్థులు రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.325 చెల్లిస్తే సరిపోతుంది. 

వివరాలు..

* సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్-జూన్ 2024 ( Joint CSIR UGC NET June 2024)

అర్హతలు..
★ సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ/ తత్సమాన డిగ్రీ ఉండాలి. (లేదా) ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్స్/ మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.
★ 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ బీఫార్మసీ/ ఎంబీబీఎస్. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

వయోపరిమితి..
★ జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ (జేఆర్ఎఫ్) కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 01.07.2024 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు. వయోపరిమితిలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, థర్డ్ జెండర్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు ఉంది.
★ అసిస్టెంట్ ప్రొఫెసర్/ పీహెచ్‌డీ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు రూ.1150; ఓబీసీ అభ్యర్థులు రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.325 చెల్లించాలి. 

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

పరీక్ష విధానం..
➥ మొత్తం 5 సబ్జెక్టులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో కెమికల్ సైన్సెస్, ఎర్త్/ అట్మాస్ఫియరిక్/ ఓషియన్/ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ సబ్జెక్టులు ఉంటాయి. ప్రతి సబ్జెక్టు నుంచి మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 3 గంటలు. పరీక్షలో సబ్జెక్టుల వారీగా నెగెటివ్ మార్కులు ఉంటాయి.

➥ పరీక్ష పేపర్‌లో మూడు (పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి) విభాగాలుంటాయి. 'పార్ట్-ఎ' విభాగంలో జనరల్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలసిస్, అనలిటికల్ & న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిజన్, సిరీస్, ఇతర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 'పార్ట్-బి', 'పార్ట్-సి' విభాగాల్లో సంబంధిత సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడుగుతారు.

➥ ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.05.2024.

➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 22.05.2024 - 23.05.2024 (upto 11:50 PM).

➥ దరఖాస్తుల సవరణ: 25.05.2024 - 27.05.2024.

➥ పరీక్ష తేదీ: 25.06.2024 - 27.06.2024. 

Notification

Online Application

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

టాప్ హెడ్ లైన్స్

Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget