అన్వేషించండి

UGC MPhil: ఎంఫిల్‌ ప్రవేశాలు నిలిపేయండి, యూనివర్సిటీలకు UGC కీలక ఆదేశాలు

దేశంలోని యూనివర్సిటీలు తక్షమణే ఎంఫిల్‌ డిగ్రీ ప్రవేశాలు ఆపేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) ఆదేశించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

UGC MPhil Degree: దేశంలోని యూనివర్సిటీలు తక్షమణే ఎంఫిల్‌(Master of Philosophy) డిగ్రీ ప్రవేశాలు ఆపేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) ఆదేశించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎంఫిల్ డిగ్రీకి యూజీసీ గుర్తింపు లేదని, విద్యార్థులు ఈ కోర్సులో చేరవద్దని స్పష్టం యూజీసీ చేసింది. అంతేకాకుండా 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఫిల్‌ ప్రవేశాలు నిలిపివేయాలంటూ అన్ని యూనివర్సిటీలను ఆదేశించింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని యూజీసీ తెలిపింది. 

ఎంఫిల్‌ ప్రవేశాల కోసం పలు యూనివర్సిటీలు దరఖాస్తులు కోరుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఎంఫిల్‌ అనేది గుర్తింపు పొందిన డిగ్రీ కాదని యూజీసీ పేర్కొంది. ఈ ప్రోగ్రామ్‌ను ఉన్నత విద్యా సంస్థలు నిర్వహించరాదంటూ యూజీసీ నిబంధనలు-2022 రెగ్యులేషన్‌ నంబర్‌ 14 స్పష్టంగా చెబుతోంద తాజా నోటీసులో యూజీసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో 2023-24 విద్యా సంవత్సరానికి ఎంఫిల్‌లో ప్రవేశాల ప్రక్రియను నిలిపివేసే చర్యలు చేపట్టాలని యూనివర్సిటీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపింది. విద్యార్థులు ఇందులో అడ్మిషన్‌ తీసుకోవద్దని యూజీసీ సెక్రటరీ మనీశ్‌ జోషి సూచించారు.

UGC MPhil: ఎంఫిల్‌ ప్రవేశాలు నిలిపేయండి, యూనివర్సిటీలకు UGC కీలక ఆదేశాలు

'స్కిల్' కోర్సులకు యూజీసీ మార్గదర్శకాలు..
దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో స్వల్పకాలిక 'స్కిల్ డెవలప్‌మెంట్' కోర్సులను ప్రవేశపెట్టేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) డిసెంబరు 18న మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనిపై సలహాలు, సూచనలు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. ఆర్టిఫీషియన్ ఇంటెలిజెన్స్ (AI)-మెషిన్ లెర్నింగ్, ఏఐ-రోబోటిక్స్, ఐఓటీ, ఇండస్ట్రీస్ ఐఓటీ, డేటా సైన్స్, అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి 29 విభాగాల్లో స్వల్పకాలిక నైపుణ్య కోర్సులను యూజీసీ సూచించింది. మౌలిక సదుపాయాలు, శిక్షణ సామర్థ్యం ఆధారంగా ఆయా కళాశాలలు ఈ కోర్సులను ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొంది. 

పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకోవాలని, కంప్యూటర్ ల్యాబ్, యంత్రాలు, పరికరాలు తప్పనిసరిగా ఉండాలని విద్యాసంస్థలను యూజీసీ ఆదేశించింది. అధ్యాపకులతోపాటు ఈ కోర్సుల్లో అనుభవం ఉన్న వారి సేవలను వినియోగించుకోవచ్చని సూచించింది. కొత్తగా ప్రవేశపెట్టే ఈ షార్ట్‌టర్మ్ స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను 3-6 నెలలు సర్టిఫికేట్ కోర్సులుగా నిర్వహించాల్సి ఉంటుందని యూజీసీ పేర్కొంది. ఇందులో వారానికి ఒక గంట థియరీ, రెండు గంటలు ప్రాక్టీకల్స్ ఉండాలని తెలిపింది. థియరీ 15 గంటలకు ఒక క్రెడిట్, ప్రాక్టీకల్, నైపుణ్య శిక్షణ ఇచ్చే 30గంటలకు ఒక క్రెడిట్ చొప్పున ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. విద్యార్థుల, అధ్యాపకుల కనీస నిష్పతి 30:1గా ఉండాలని, ప్రతి కోర్సుకు ఉన్నత విద్యాసంస్థలు ముందుగా ఫీజులు నిర్ణయించి సొంత నిధులతో ఇవి కొనసాగేలా రూపకల్పన చేయాలని సూచించింది.

ALSO READ:

'ఫ్యాషన్' కోర్సుల్లో ప్రవేశాలకు 'నిఫ్ట్-2024' నోటిఫికేషన్ వెల్లడి, ఎంపిక ఇలా
దేశవ్యాప్తంగా ఉన్న 18 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT), క్యాంపస్‌లలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(NTA) నిర్వహించే ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఆయా కోర్సుల్లో సీట్లను భర్తీచేస్తారు. యూజీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత, పీజీ కోర్సులకు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులకు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, ప్రవేశాల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP DesamChahal Dhanashree Verma Divorce | చాహల్ ధనశ్రీకి విడాకులు మంజూరు చేసిన కోర్ట్ | ABP DesamVidya Veerappan Political Career | రాజకీయాల్లో వీరప్పన్ కూతురు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Hari Hara Veera Mallu: పవన్ 'హరిహర వీరమల్లు' టీం నుంచి బిగ్ అప్ డేట్ - ఈ డేట్ మార్క్ చేసుకోండి అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..
పవన్ 'హరిహర వీరమల్లు' టీం నుంచి బిగ్ అప్ డేట్ - ఈ డేట్ మార్క్ చేసుకోండి అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..
Allu Arjun: బాలీవుడ్ హీరోలెవరు ఇప్పటి వరకు అలా చేయలేదు... అల్లు అర్జునే ఫస్ట్ హీరో
బాలీవుడ్ హీరోలెవరు ఇప్పటి వరకు అలా చేయలేదు... అల్లు అర్జునే ఫస్ట్ హీరో
Viral News: ఆ ప్రొఫెసర్‌ ఫోన్‌లో 72 అశ్లీల వీడియోలు - అన్నీ విద్యార్థులతోనే - ఇతను గురువేనా ?
ఆ ప్రొఫెసర్‌ ఫోన్‌లో 72 అశ్లీల వీడియోలు - అన్నీ విద్యార్థులతోనే - ఇతను గురువేనా ?
Embed widget