MBBS and BDS: ఎంబీబీఎస్, బీడీఎస్ ‘స్ట్రే వేకెన్సీ’ సీట్ల భర్తీకి నోటిఫికేషన్, దరఖాస్తుకు రేపే ఆఖరు
ఏపీలోని మెడికల్, డెంటల్ కళాశాలల్లో మొదటి మూడు విడతల కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన ‘స్ట్రే వేకెన్సీ’ సీట్ల ప్రవేశానికి విజయవాడలోని వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్సిటీ నవంబరు 2న నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏపీలోని మెడికల్, డెంటల్ కళాశాలల్లో మొదటి మూడు విడతల కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన ‘స్ట్రే వేకెన్సీ’ సీట్ల ప్రవేశానికి విజయవాడలోని వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్సిటీ నవంబరు 2న నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి మూడు విడతల కౌన్సెలింగ్‌లో సీట్లు రాని అభ్యర్థులు శనివారం(నవంబరు 4) రాత్రి 9 గంటల్లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎంబీబీఎస్‌లో తిరుపతి పద్మావతి వైద్య కళాశాలలో ఎన్నారై ఒక సీటు, ఇబ్రహీంపట్నం నిమ్రా వైద్య కళాశాలలో సి-కేటగిరీ ఒక సీటు ఉండగా, బీడీఎస్ కోర్సులో 6 ప్రైవేటు కళాశాలల్లో 60 సీట్లు అందుబాటులోకి ఉంచారు.
అర్హతలు: 50 శాతం మార్కులతో ఇంటర్ (బైపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: 31.12..2023 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి.
నీట్ యూజీ-2023 కటాఫ్ మార్కులు..
➥ జనరల్ (ఓసీ, ఈడబ్ల్యూఎస్): 50 పర్సంటైల్ - 137 మార్కులు
➥ ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు (ఎస్సీ, బీసీ): 40 పర్సంటైల్ - 107 మార్కులు
➥ బదివ్యాంగులు (ఎస్టీ): 40 పర్సంటైల్ - 108 మార్కులు
➥దివ్యాంగులు (జనరల్-ఓసీ, ఈడబ్ల్యూఎస్): 40 పర్సంటైల్ - 108 మార్కులు
అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్లు..
- నీట్ యూజీ 2023 ర్యాంకు కార్డు
- బర్త్ సర్టిఫికేట్ (10వ తరగతి మార్కుల మెమో)
- క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ (ఇంటర్ మార్కుల మెమో)
- ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (ఇంటర్ టీసీ)
- 6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు (ఏపీకి చెందినవారు మాత్రమే)
- క్యాస్ట్ సర్టిఫికేట్
- ఫొటో గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు)
- పీడబ్ల్యూడీ సర్టిఫికేట్
- ఫొటోలు
- అభ్యర్థి సంతకం ఫోటో
ఎన్నారై విద్యార్థులకు..
- డిక్లరేషన్
- గ్రీన్ కార్డు/సిటిజెన్‌షిప్ కార్డు
- 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్
- సంబంధిత దేశం జారీచేసిన పాస్‌పోర్ట్
- ఎన్నారై పేరిట ఎలక్ట్రిసిటీ బిల్/గ్యాస్ బిల్/వాటర్ బిల్
- వీసా/డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటిని స్వీకరించరు
ALSO READ:
బీఎస్సీ అలైడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, ముఖ్యమైన తేదీలు ఇలా
తెలంగాణలోని బీఎస్సీ అలైయిడ్ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను భర్తీచేయనున్నారు. విద్యార్థులు అక్టోబరు 27 నుంచి నవంబర్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితా విడుదల చేయనున్నారు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..
జేఈఈ మెయిన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2024 మొదటి విడత దరఖాస్తు ప్రక్రియ షెడ్యూలు ప్రకారం నవంబరు 1న ప్రారంభంకావాల్సి ఉండగా... నవంబరు 2న ప్రారంభమైంది. అభ్యర్థులు నిర్ణీత ఫీజు చెల్లించి ఆన్‌లైన్ దరఖాస్తు ద్వారా నవంబర్ 30న రాత్రి 9 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ పరీక్షలను రెండు విడతలుగా నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో మొదటి సెషన్, ఏప్రిల్‌లో రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ విధానంలో జేఈఈ పరీక్షలు జరుగనున్నాయి.
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...