KNRUHS: కటాఫ్ స్కోర్ తగ్గించిన కేంద్రం, మెడికల్ సీట్ల భర్తీకి కాళోజీ యూనివర్సిటీ నోటిఫికేషన్
నీట్ పీజీ కటాఫ్ మార్కులను 'సున్నా'కు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో.. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ కన్వీనర్, యాజమాన్య కోటా సీట్ల భర్తీకి మరోమారు నోటిఫికేషన్ విడుదల చేసింది.
నీట్ పీజీ కటాఫ్ స్కోర్‌ను కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తగ్గించిన సంగతి తెలిసిందే. కటాఫ్ మార్కులను 'సున్నా'కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈనేపథ్యంలో మెడికల్ సీట్లకు మరోమారు దరఖాస్తులు చేసుకునే అవకాశం లభించింది. దీంతో వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో కన్వీనర్, యాజమాన్య కోటాలో మరోమారు దరఖాస్తులను స్వీకరించనున్నారు.
సెప్టెంబరు 24న సాయంత్రం 6 గంటల వరకు అర్హులైన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని వరంగల్‌లోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ గురువారం (సెప్టెంబరు 21న) సాయంత్రం అధికారిక ప్రకటన జారీ చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలని సూచించారు. ధృవపత్రాల పరిశీలన అనంతరం తుదిమెరిట్ జాబితాను విడుదలచేస్తారు. పూర్తివివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని యూనివర్సిటీ వర్గాలు పేర్కొన్నారు.
సందేహాల పరిష్కారానికి హెల్ప్‌లైన్ సేవలు..
➥ వెబ్‌కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులకు ఏమైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే 9392685856, 7842542216, 9059672216 ఫోన్ నెంబర్లలో, లేదా ఈమెయిల్: tspgmed2023@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.
➥ నిబంధనలకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే 9490585796, 7901098840 ఫోన్ నెంబర్లలో, లేదా ఈమెయిల్: knrugadmission2023@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.
➥ ఫీజు చెల్లింపు సమయంలో సమస్యలు ఎదురైతే 9959101577 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.
➥ నిర్దేశిత తేదీల్లో ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు మాత్రమే హెల్ప్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి.
ALSO READ:
NEET PG: నీట్ పీజీ విద్యార్థులకు గుడ్ న్యూస్, 'సున్నా' మార్కులకు తగ్గిన కటాఫ్!
నీట్ పీజీ విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. పీజీ మెడికల్/డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఈ ఏడాది నీట్ పీజీ మూడో రౌండ్ కౌన్సెలింగ్‌లో కటాఫ్ మార్కులను 'సున్నా'కు తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కేటగిరీలకు ఈ 'జీరో' కటాఫ్ వర్తించనుంది. సున్నా మార్కులు వచ్చినా కౌన్సెలింగ్‌కు అర్హత ఉన్నట్లే అని ప్రభుత్వం తెలిపింది. మూడో రౌండ్‌లో మొత్తం 13 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో నీట్ పీజీ 2023 పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ కౌన్సెలింగ్‌కు అర్హత సాధించినట్లయింది. ఇందుకు సంబంధించి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) సెప్టెంబరు 20న ఒక ప్రకటన విడుదల చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
భారతీయ వైద్య విద్యార్థులు ఇక విదేశాల్లోనూ ప్రాక్టీస్ చెయ్యొచ్చు
భారతీయ వైద్య విద్యార్థులు ఇక మీదట పలు విదేశాలలో కూడా ప్రాక్టీస్ చేయొచ్చని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. మన దేశంలో వైద్య విద్య అభ్యసించిన వారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పీజీ కోర్సుల్లో చేరవచ్చని అలాగే ఆ దేశాల్లో ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకు వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ (WFME) నుంచి జాతీయ వైద్య మండలి (NMC)కి 10 ఏళ్ల కాల పరిమితికి గుర్తింపు లభించినట్లు ప్రకటనలో వెల్లడించింది. 2024 సంవత్సరం నుంచి భారతీయ వైద్య విద్యార్థులు విదేశాల్లో విద్య, ప్రాక్టీస్ కోసం అప్లై చేసుకోవచ్చని తెలిపింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..