BDS Counselling: బీడీఎస్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల, షెడ్యూలు ఇదే!
యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ దంత కళాశాలల్లోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
రాష్ట్రంలో బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నవంబరు 9,10 తేదీల్లో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. ఈ మేరకు నవంబరు 8న మొదటి విడత ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ను అందుబాటులో ఉంచింది.
యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ దంత కళాశాలల్లోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. కళాశాలలవారీగా సీట్ల వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. నవంబరు 9న ఉదయం 6 గంటల నుంచి నవంబరు 10న సాయంత్రం 6 గంటల వరకు అభ్యర్థులు ప్రాధాన్యత క్రమంలో కళాశాలలవారీగా వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
BDS SEAT MATRIX
NOTIFICATION FOR EXERCISING WEB-OPTIONS FOR FIRST PHASE COUNSELING
బీడీఎస్ కన్వీనర్ కోటా నోటిఫికేషన్‌తోపాటు పీజీ మెడికల్ (ఎండీ/ఎంఎస్/డిప్లొమా) మేనేజ్‌మెంట్ కోటా రెండో రౌండ్ సీట్ల కేటాయింపు జాబితాను యూనివర్సిటీ విడుదల చేసింది.
ALLOTMENT LIST AFTER SECOND PHASE OF COUNSELLING
ఫీజు వివరాలు ఇలా...
సీట్లు పొందిన విద్యార్థులు యూనివర్సిటీ ఫీజు కింద ఆన్‌లైన్ గేట్ వే (డెబిట్/క్రెడిట్ కార్డు/నెట్ బ్యాంకింగ్) ద్వారా రూ.12,000 చెల్లించి సీటు అలాట్‌మెంట్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్యూషన్ ఫీజును ప్రభుత్వ డెంటల్ కాలేజీలో ఏడాదికి రూ.10,000; ప్రైవేట్ డెంటల్ కాలేజీలో ఏడాదికి రూ.45,000; ఆర్మీ డెంటల్ కాలేజీలో రూ.4,25,000గా నిర్ణయించారు.
Also Read:
పీజీఈసెట్ స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ షెడ్యూలు వెల్లడి - ముఖ్య తేదీలివే!
తెలంగాణలో ఎంటెక్, ఎంఫార్మసీ సీట్ల భర్తీకి సంబంధించి నవంబరు 9 నుంచి స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. పీజీఈసెట్ మొదటి, రెండో విడతల కౌన్సెలింగ్‌లలో పాల్గొనని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు నవంబరు 9 నుంచి 11 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తయినవారు నవంబరు 11, 12 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. వీరికి నవంబరు 15న సీట్లను కేటాయిస్తారు. కాలేజీలవారీగా సీట్లు పొందిన అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.
NOTIFICATION FOR SPECIAL ROUND OF WEB COUNSELLING
స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ షెడ్యూలు...
➛ నవంబరు 9 నుంచి 11 వరకు: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్, ఆన్‌లైన్ పేమెంట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం డాక్యుమెంట్స్ అప్‌లోడింగ్.
➛ నవంబరు 11 నుంచి 12 వరకు: వెబ్ ఆప్షన్ల నమోదు.
➛ నవంబరు 15: కళాశాలలవారీగా సీట్లు పొందిన అభ్యర్థుల జాబితా ప్రకటన
➛ నవంబరు 15 నుంచి 19 వరకు: సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాలి. ఒరిజినల్ సర్టిఫికేట్లను పరిశీలిస్తారు. ట్యూషన్ ఫీజు చలానా సమర్పించాలి.
తెలంగాణలో ఎంటెక్, ఎం ఫార్మసీ, అర్కిటెక్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) ఆగస్టు 2 నుంచి 5 వరకు నిర్వహించారు. మొత్తం 12 కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో ఉస్మానియా యూనివర్సిటీ ఈ పరీక్షలను నిర్వహించింది. పరీక్ష ఫలితాలను సెప్టెంబర్ 3న విడుదల చేశారు. ఫలితాల్లో మొత్తం 91.48 శాతం మంది అర్హత సాధించారు. 19 విభాగాల్లో జరిగిన పరీక్షలకు మొత్తం 12,592 మంది హాజరుకాగా.. వారిలో 11,520 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైనవారిలో 6,440 మంది (55.90 శాతం) అమ్మాయిలు, 5,080 మంది అబ్బాయిలు ఉన్నారు. ఒక్క ఫార్మసీ విభాగంలోనే 5,186 మంది ఉత్తీర్ణులు కావడం విశేషం.