అన్వేషించండి

Engineering Seats: కంప్యూటర్ ఇంజినీరింగ్‌ కోర్సుల సీట్లు పెంపుపై JNTUH ఆందోళన- డేంజర్‌ అంటూ AICTEకి లేఖ

JNTU Hyderabad: ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సంబంధిత కోర్సుల సీట్ల సంఖ్య భారీగా పెంచడంపై ఆందోళన వ్యక్తంచేస్తూ.. జేఎన్‌టీయూహెచ్ ఏఐసీటీకీ లేఖ రాసింది. ఇది మంచి పరిణామం మంచిదికాదని లేఖలో పేర్కొంది.

JNTU Hyderabad Letter Ro AICTE: తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించి కంప్యూటర్ సైన్స్, ఐటీ తదితర సీట్ల సంఖ్య భారీగా పెరగడంపై జేఎన్‌టీయూ హైదారబాద్ (JNTUH) ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కోర్ ఇంజినీరింగ్ బ్రాంచీలను తగ్గిస్తూ.. సీఎస్‌ఈ, ఐటీ సంబంధిత విభాగాల్లో సీట్లను విపరీతంగా పెంచడం మంచిది కాదని తెలిపింది. ఇది భవిష్యత్తులో తీవ్ర విపరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు ఏఐసీటీఈకి జేఎన్‌టీయూహెచ్ గురువారం (జులై 4న) లేఖ రాసింది. సీట్లు పెంచితే అధ్యాపకుల కొరత తలెత్తుతుందని లేఖలో పేర్కొంది. ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సూచన మేరకు జేఎన్‌టీయూ వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్ రావు ఈ లేఖ రాశారు.

వర్సిటీ లేఖపై కళాశాలల యాజమాన్యాలు షాక్..
రాష్ట్రంలో కొత్త కళాశాలలు, సీట్ల పెంపుకు సంబంధించిన అనుమతుల విధివిధానాలపై ఏఐసీటీఈ గత జనవరిలోనే హ్యాండ్ బుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అపరిమిత సీట్లు మంజూరు చేస్తామని అందులో స్పష్టం చేసింది. ఆ మేరకు సీట్లపెంపుకు దరఖాస్తు చేసుకున్న కళాశాలలకు ఏఐసీటీఈ అనుమతులిచ్చింది. ఈ నేపథ్యంలో జేఎన్‌టీయూహెచ్ వర్సిటీ ఏఐసీటీఈకి లేఖ రాయడంపై కళాశాలల యాజమాన్యాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అనుమతుల ప్రక్రియ అంతా పూర్తయ్యాక లేఖ రాయడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. 

కొత్తగా 20,500 ఇంజినీరింగ్ సీట్లు..
రాష్ట్రంలో ఒకపక్క ఇంజినీరింగ్ కాలేజీల సంఖ్య భారీగా పెరగ్గా.. ఆ మేరకు సీట్ల సంఖ్య కూడా భారీగా పెరగనుంది. ముఖ్యంగా డిమాండ్‌ ఉన్న కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో ఏకంగా 20,500 సీట్లు పెరగనున్నాయి. అయితే పెరగిని ఈ సీట్లు కేవలం జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలోని కళాశాలల్లోనివి మాత్రమే కావడం గమనార్హం. ఇక ఉస్మానియా యూనివర్సిటీ (OU) కాకతీయ యూనివర్సిటీల్లో(KU) కలిపితే సీట్ల సంఖ్య మరింత పెరుగుతాయి.

జులై 8 నుంచి వెబ్ఆప్షన్ల ఎంపిక..
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ జులై 4న ప్రారంభమైన సంగతి తెలిసిందే. విద్యార్థులు జులై 12 వరకు నిర్ణీత ప్రాసెసింగ్ ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంది. వీరికి జులై 6 నుంచి 13 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినవారు కళాశాలలు, బ్రాంచ్‌ల ఎంపిక కోసం జులై 8 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. వీరికి జులై 19న మొదటి దశ ఇంజినీరింగ్‌ సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందినవారు జులై 19 నుంచి 23 మధ్య సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే జులై 8 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో జేఎన్‌టీయూహెచ్ పరిధిలో దాదాపు 88 వేల సీట్లకు అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. అందులో ఇతర కోర్ బ్రాంచ్‌లలో సుమారు 7 వేల సీట్లను కుదించుకొని సీఎస్‌ఈ తదితర డిమాండ్ ఉన్న బ్రాంచీల్లో సీట్ల సంఖ్య పెంచుకున్నట్లు తెలుస్తోంది. 

గతేడాది ఇలా..
బీటెక్ కోర్సుల్లో చేరేవారు మొదటి ఛాయిస్‌గా కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత కోర్సులనే ఎంచుకుంటున్నారు. దీంతో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ బ్రాంచీల్లో కన్వీనర్‌ కోటా సీట్లు సగం కూడా నిండలేదు. గతేడాది మూడు కోర్‌ బ్రాంచీల్లో 12,751 సీట్లుండగా.. అందులో కేవలం 5,838 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇక మేనేజ్‌మెంట్ కోటాలో చేరే వారే కరవయ్యారు. ఆ సీట్లను కూడా కలిపితే మొత్తం సీట్ల భర్తీ 40 శాతానికి మించదు. 

ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Coaching Institutions Rules 2026: ఏపీలో కోచింగ్ సెంటర్ల ఆగడాలకు చెక్ … ఇష్టారాజ్యం కుదరదు.. ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్
ఏపీలో కోచింగ్ సెంటర్ల ఆగడాలకు చెక్ … ఇష్టారాజ్యం కుదరదు.. ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్
JEE Mains 2026 Admit Cards: జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
Study Table Mistakes : పరీక్షల సమయంలో పిల్లలు బాగా చదవాలంటే స్టడీ టేబుల్‌పై ఈ 5 వస్తువులు పెట్టొద్దు.. రీజన్స్ ఇవే
పరీక్షల సమయంలో పిల్లలు బాగా చదవాలంటే స్టడీ టేబుల్‌పై ఈ 5 వస్తువులు పెట్టొద్దు.. రీజన్స్ ఇవే
NHAI Summer Internship 2026: NHAI సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2026 ప్రారంభం! నెలకు రూ. 20,000 పొందుతూ హైవే ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం!
NHAI సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2026 ప్రారంభం! నెలకు రూ. 20,000 పొందుతూ హైవే ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం!

వీడియోలు

CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam
Jadeja Destroys CSK vs RR IPL 2026 | ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జడేజా | ABP Desam
IPL 2026 RR VS CSK Highlights | చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ | ABP Desam
Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Vaidya Seva: ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
AP handloom weavers: ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
Kerala Assembly Elections: కేరళలో బీజేపీ అగ్రనేతల విస్తృత ప్రచారం - మార్పు కనిపిస్తోందని ధీమా!
కేరళలో బీజేపీ అగ్రనేతల విస్తృత ప్రచారం - మార్పు కనిపిస్తోందని ధీమా!
Donald Trump: దారిలోకి రాని ఇరాన్! ట్రంప్‌లో పెరిగిపోతున్న అసహనం! మిత్రదేశాలకు తీవ్ర హెచ్చరిక!
దారిలోకి రాని ఇరాన్! ట్రంప్‌లో పెరిగిపోతున్న అసహనం! మిత్రదేశాలకు తీవ్ర హెచ్చరిక!
IT Rules 2021 Amendments:డిజిటల్ మీడియాపై పట్టుకు కేంద్రం ప్రయత్నిస్తోందా? కొత్తగా తీసుకొస్తున్న మార్పులేంటీ?
డిజిటల్ మీడియాపై పట్టుకు కేంద్రం ప్రయత్నిస్తోందా? కొత్తగా తీసుకొస్తున్న మార్పులేంటీ?
Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
Third Temple In Israel: ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
Embed widget