News
News
వీడియోలు ఆటలు
X

JEE Main 2023 City Intimation Slip: జేఈఈ మెయిన్‌ ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చేశాయ్, ఇలా చెక్ చేసుకోండి!

ఏప్రిల్ 1న ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ను ఎన్టీఏ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. సిటీ ఇంటిమేషన్ స్లిప్‌‌లో అభ్యర్థి పరీక్ష రాసే నగరం, పరీక్ష తేది వివరాలు ఉంటాయి.

FOLLOW US: 
Share:

జేఈఈ మెయిన్-2023 రెండో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 12తో ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 2న అడ్మిట్ కార్డులు విడుదలయ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1న ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ను ఎన్టీఏ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. సిటీ ఇంటిమేషన్ స్లిప్‌‌లో అభ్యర్థి పరీక్ష రాసే నగరం, పరీక్ష తేది వివరాలు ఉంటాయి. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 011-40759000/011-69227700 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్: jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు. 

ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇక రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్ పరీక్షలు ఏప్రిల్‌ 6, 8, 10, 11, 12 తేదీల్లో జరగనుండగా ఏప్రిల్‌ 13, 15 తేదీలను ఎన్‌టీఏ రిజర్వ్‌ చేసింది. ఆయా తేదీల్లో ప్రతిరోజు రెండు  షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి సెషన్‌లో ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, రెండో సెషన్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. జనవరి 24 నుండి ఫిబ్రవరి 1 వరకు జరిగిన జేఈఈ మెయిన్స్‌ పరీక్షల మొదటి సెషన్‌కు రికార్డు స్థాయిలో 8 లక్షల మంది హాజరైన సంగతి తెలిసిందే.

JEE Main Session-2 Advance City Intimation Slip

జేఈఈ మెయిన్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఎన్‌ఐటీలు, ఐఐటీలు, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో యూజీ కోర్సు్లో (బీఈ/బీటెక్) ప్రవేశాల కోసం పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌‌డ్ కోసం కూడా దీన్నే అర్హత పరీక్షగా పరిగణిస్తారు. ఇక బీఆర్క్, బీప్లానింగ్ కోర్సు్ల్లో ప్రవేశాల కోసం పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్-2023 పరీక్షను మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మలయాళం, కన్నడ, మరాఠి, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ, పంజాబీ భాషల్లో పరీక్ష ఉంటుంది.

బీఈ, బీటెక్‌, బీఆర్క్‌, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్‌ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. వీరిలో మంచి స్కోర్‌ సాధించిన 2.5 లక్షల మంది విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు.   

JEE Main 2023  కార్డు డౌన్‌లోడ్ ఇలా..

అడ్మిట్ కార్డుల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి - jeemain.nta.nic.in 

➥ హోంపేజీలో సెషన్‌-2కు సంబంధించి 'Advance City Intimation Slip' లింక్‌పై క్లిక్ చేయాలి.

మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అవ్వాలి.

➥ జేఈఈ మెయిన్ ఇంటిమేషన్ స్లిప్ స్క్రీన్‌పై కనబడుతుంది.

ఆ తర్వాత దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓ కాపీని ప్రింటవుట్ తీసుకుని పెట్టుకోవాలి.

➥ కార్డుపై మీరు పరీక్ష రాసే నగరం, ఇతర వివరాలన్నీ ఉన్నాయో లేదో సరిచూసుకోండి.

ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు వివిధ తేదీల్లో జరిగిన జేఈఈ మెయిన్- 2023 తొలి విడత పరీక్షల కోసం దేశవ్యాప్తంగా దాదాపు తొమ్మిది లక్షల మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్ చేయించుకున్నారు. అయితే, పేపర్-1 (బీఈ/బీటెక్ కోర్సులు) పరీక్ష రాసేందుకు 8.22 లక్షల మంది హాజరు కాగా.. వీరిలో 2.6లక్షల మందికి పైగా అమ్మాయిలు; 6లక్షల మందికి పైగా అబ్బాయిలు ఉన్నారు. అలాగే, పేపర్-2 (బీ.ఆర్క్/బీ.ప్లానింగ్) పరీక్షను 46వేల మందికి పైగా రాయగా.. వీరిలో 25వేల మంది అబ్బాయిలు; 21వేల మందికి పైగా అమ్మాయిలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు, జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12వరకు జరగనున్న విషయం తెలిసిందే.

Published at : 02 Apr 2023 05:02 PM (IST) Tags: National Testing Agency Joint Entrance Examination JEE Main Session 2 JEE Main 2023 Session 2 exam city Advance City Intimation Slip

సంబంధిత కథనాలు

TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథ‌మిక కీ విడుద‌ల‌! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథ‌మిక కీ విడుద‌ల‌! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

NEET UG 2023: వెబ్‌సైట్‌లో నీట్ యూజీ రెస్పాన్స్ షీట్లు, త్వరలోనే ఆన్సర్ కీ!

NEET UG 2023: వెబ్‌సైట్‌లో నీట్ యూజీ రెస్పాన్స్ షీట్లు, త్వరలోనే ఆన్సర్ కీ!

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రారంభం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది రాస్తున్నారంటే?

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రారంభం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది రాస్తున్నారంటే?

NMMS RESULTS: ఏపీ ఎన్‌ఎంఎంఎస్‌-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

NMMS RESULTS: ఏపీ ఎన్‌ఎంఎంఎస్‌-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

టాప్ స్టోరీస్

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్