IMU: ఇండియన్ మారిటైం వర్సిటీలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులు - వివరాలు ఇవే!
సరైన అర్హతలున్న అభ్యర్థులు మే 18లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కోర్సును అనుసరించి ప్రవేశ పరీక్ష, గేట్, పీజీసెట్, మ్యాట్, సీమ్యాట్ తదితరాల ఆధారంగా సీటు కేటాయిస్తారు.
ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ (ఐఎంయూ) 2023-24 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న ఆరు క్యాంపస్‌లలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఐఎంయూ క్యాంపస్‌లు నవీ ముంబయి, ముంబయి పోర్ట్, కోల్‌కతా, విశాఖపట్నం, చెన్నై, కొచ్చిలో ఉన్నాయి. డిగ్రీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత, పీజీ కోర్సులకు డిగ్రీ విద్యార్హత, పీహెచ్‌డీ కోర్సులకు సంబంధించిన సబ్జెక్టులో పీజీ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్థులు మే 18లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కోర్సును అనుసరించి ప్రవేశ పరీక్ష, గేట్, పీజీసెట్, మ్యాట్, సీమ్యాట్ తదితరాల ఆధారంగా సీటు కేటాయిస్తారు.
కోర్సుల వివరాలు...
➥ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు..
➙ బీటెక్- మెరైన్ ఇంజినీరింగ్: 4 సంవత్సరాలు
➙ బీటెక్- నావల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజినీరింగ్: 4 సంవత్సరాలు
➙ బీఎస్సీ- నాటికల్ సైన్స్: 3 సంవత్సరాలు
➙ డీఎన్‌ఎస్(డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్): 1 సంవత్సరం
➙ బీబీఏ- లాజిస్టిక్స్, రిటైలింగ్ అండ్ ఇ-కామర్స్: 3 సంవత్సరాలు
➙ అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ బీబీఏ- మారిటైమ్ లాజిస్టిక్స్: 3 సంవత్సరాలు
➙ బీఎస్సీ- షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్: 3 సంవత్సరాలు
➥ పీజీ కోర్సులు..
➙ ఎంటెక్- నావల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజినీరింగ్: 2 సంవత్సరాలు
➙ ఎంటెక్- డ్రెడ్జింగ్ అండ్ హార్బర్ ఇంజినీరింగ్: 2 సంవత్సరాలు
➙ ఎంటెక్- మెరైన్ టెక్నాలజీ: 2 సంవత్సరాలు
➙ ఎంబీఏ- ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్: 2 సంవత్సరాలు
➙ ఎంబీఏ- పోర్ట్ అండ్ షిప్పింగ్ మేనేజ్‌మెంట్: 2 సంవత్సరాలు
➥ పీజీ డిప్లొమా (మెరైన్ ఇంజినీరింగ్): ఏడాది.
➥ రిసెర్చ్ ప్రోగ్రాం: పీహెచ్‌డీ, ఎంఎస్ (బై రిసెర్చ్).
అర్హత: కోర్సుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. డిగ్రీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత, పీజీ కోర్సులకు డిగ్రీ విద్యార్హత, పీహెచ్‌డీ కోర్సులకు సంబంధించిన సబ్జెక్టులో పీజీ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: కోర్సును అనుసరించి ప్రవేశ పరీక్ష, గేట్, పీజీసెట్, మ్యాట్, సీమ్యాట్ తదితరాల ఆధారంగా సీటు కేటాయిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➦ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 18.05.2023.
➦ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ ప్రారంభం: 26.05.2023.
➦ ఐఎంయూ-సెట్ తేదీ: 10.06.2023
➦ ఫలితాల వెల్లడి: 19.06.2023.
Also Read:
ఎన్‌సీఈఆర్‌టీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్-2023, ముఖ్యమైన తేదీలివే!
న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) దేశవ్యాప్తంగా ఉన్న 5 ప్రాంతీయ విద్యాసంస్థల్లో(ఆర్‌ఐఈ)వివిధ ఉపాధ్యాయ విద్యా సంబంధిత కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'ఎన్‌సీఈఆర్‌టీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్-2023' నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎన్‌సీఈఆర్‌టీకి సంబంధించిన ప్రాంతీయ విద్యాసంస్థలు అజ్మీర్, భువనేశ్వర్, భోపాల్, మైసూర్, షిల్లాంగ్‌లలో ఉన్నాయి.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..
టీఎస్ఈసెట్-2023 దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాలకు డిప్లొమా విద్యార్థులకు నిర్వహించే టీఎస్ ఈసెట్-2023 దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. మే 2తో దరఖాస్తు గడువు ముగిసినప్పటికీ మే 8 వరకు ఎలాంటి ఆలస్య రుసుములేకుండా దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అయితే రూ.500 ఆలస్యం రుసుంతో మే 11 వరకు, రూ.1000 ఆలస్యం రుసుంతో మే 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తులను మే 8 నుంచి మే 13 వరకు ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మే 16 నుంచి అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 20న ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈసెట్ ద్వారా బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సు్లో లేటరల్ ఎంట్రీ ద్వారా సెకండియర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఈసెట్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..