అన్వేషించండి

Inter: 'ఇంటర్' విద్యలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల హవా, సగానికిపైగా కాలేజీలు అవే!

తెలంగాణలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల హవా కొనసాగుతోంది. ఇంటర్‌ విద్యలో సర్కారు కాలేజీలు సరికొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న ఇంటర్ కళాశాలల్లో సగానికి పైగా ప్రభుత్వ కాలేజీలే ఉండటం విశేషం.

తెలంగాణలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల హవా కొనసాగుతోంది. ఇంటర్‌ విద్యలో సర్కారు కాలేజీలు సరికొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న ఇంటర్ కళాశాలల్లో సగానికి పైగా ప్రభుత్వ కాలేజీలే ఉండటం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,216 జూనియర్‌ కాలేజీలు ఉంటే.. వాటిలో 1,602 ప్రభుత్వ కళాశాలలు కాగా, 1,571 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. ఒకప్పుడు రాష్ట్రంలో ప్రైవేట్‌, కార్పొరేట్‌ కాలేజీల హవా సాగగా, గత కొన్నేళ్లగా ప్రభుత్వ కాలేజీల జోరు నడుస్తోంది. ఏటా గురుకులాలు, కేజీబీవీల అప్‌గ్రేడేషన్‌తోపాటు కొత్తగా ప్రభుత్వ కాలేజీలను మంజూరు చేస్తుండటంతో వాటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అదే సమయంలో ప్రైవేట్‌ కాలేజీల సంఖ్య తగ్గుతూ వస్తోంది.

రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్క కొత్త ప్రైవేట్‌ కాలేజీకి కూడా ప్రభుత్వం అనుమతినివ్వలేదు. గతంలో గుర్తింపు పొందిన కాలేజీలకే ఏటా గుర్తింపును పునరుద్ధరిస్తూ వస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 68 ప్రైవేటు కాలేజీలను గతంలోనే ఇంటర్‌బోర్డు మూసివేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 2,600 పైచిలుకు ప్రైవేట్‌ కాలేజీలుంటే.. ఈ విద్యాసంవత్సరంలో అవి 1,571 చేరుకున్నాయి. అంటే సుమారుగా వెయ్యికిపైగా కాలేజీలు మూతబడ్డాయి. ఇదే క్రమంలో వెయ్యికిపైగా కొత్త ప్రభుత్వ కాలేజీలు మంజూరయ్యాయి.

రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల సంఖ్య: 3216

⫸ ప్రభుత్వ కళాశాలలు: 1602.

⫸ ప్రైవేటు కళాశాలలు: 1571.

⫸ ప్రభుత్వ కళాశాలల వివరాలు ఇలా..

⫸ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు - 408

⫸ ఆర్మీ జూనియర్ కళాశాలలు - 03

⫸ తెలంగాణ గురుకులాలు - 37

⫸ సోషల్ వెల్ఫేర్ గురుకులాలు - 238

⫸ గిరిజన గురుకులాలు - 125

⫸ బీసీ గురుకులాలు - 145

⫸ మోడల్ స్కూల్స్ - 194

⫸  కస్తుర్భా గాంధీ బాలికా విద్యాలయాలు - 246

⫸ మైనార్టీ గురుకులాలు - 204

⫸  ఆర్టీసీ కళాశాల - 01

⫸  స్పోర్ట్స్ కళాశాల - 01   

ALSO READ:

నీట్ యూజీ 2023 కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!
నీట్‌ యూజీ (NEET UG) 2023 కౌన్సెలింగ్‌ ప్రక్రియ జులై 20  నుంచి ప్రారంభంకానుంది. కౌన్సెలింగ్‌ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూలును మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (MCC) జులై 14న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూలును అందుబాటులో ఉంచింది. నీట్ యూజీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ తేదీలను చూసుకోవచ్చు. నీట్ యూజీ కౌన్సెలింగ్ ద్వారా దేశంలోనిప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్(కేంద్రయూనివర్సిటీల్లో) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్స్, సెంట్రల్ యూనివర్శిటీలు, డీమ్డ్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్/డెంటల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం 15శాతం ఆలిండియా కోటా సీట్లు, 85 శాతం స్టేట్ కోటా సీట్లతో కలిపి 100 శాతం సీట్లకు ఎంసీసీ/DGHS కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

టీఎస్ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, జులై 29 నుంచి రిజిస్ట్రేషన్!
తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో పాలిటెక్నిక్, డిప్లొమా విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన 'టీఎస్ ఈసెట్‌-2023' కౌన్సెలింగ్‌ షెడ్యూలును అధికారులు ప్రకటించారు. షెడ్యూలు ప్రకారం జులై 29 నుంచి రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్‌ ప్రారంభంకానుంది. ఆగస్టు 1 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. రిజిస్ట్రేషన్ పూర్తిచేసిన అభ్యర్థులకు జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ఇక ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినవారు జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 
ఈసెట్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget