NIT Tiruchy: నిట్ సీటు సాధించిన తొలి గిరిజన విద్యార్థి- ఐఐటీ తిరుచీలో చేరిన రోహిణి
Tribal Girl Clears JEE Exam: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో 73.8 స్కోరు సాధించి, పచ్చమలై హిల్స్‌కు చెందిన ఎం. రోహిణి (18) జిల్లా నుంచి నిట్ తిరుచ్చిలో ప్రవేశం పొందిన తొలి గిరిజన బాలికగా నిలిచింది.
Tribal Girl Secures Seat In NIT-Tiruchy: ఆ గిరిజన బాలికది నిరుపేద కుటుంబం, ఆమె తల్లిదండ్రులు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. అయితేనేమీ అద్భుత విజయంతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఒకవైపు చదువుకుంటూనే.. పనుల్లో తల్లిదండ్రుదలకు చేదోడువాదోడుగా నిలుస్తూ.. జేఈఈ మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ అయిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-తిరుచ్చి (NIT-Tiruchy)లో సీటు దక్కించుకుంది. నిట్-తిరుచ్చిలో ఓ గిరిజన విద్యార్థికి సీటు రావడానికి 60 ఏళ్ల సమయం పట్టడం విశేషం.
60 ఏళ్లలో తొలిసారి..
తమిళనాడులోని పచ్చమలై హిల్స్‌కు చెందిన ఎం. రోహిణి (18) జిల్లా నుంచి జాతీయ విద్యాసంస్థలో (నిట్ తిరుచ్చి) ప్రవేశం పొందిన తొలి గిరిజన బాలికగా చరిత్ర సృష్టించిందని గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. ఇటీవల విడుదలైన JEE మెయిన్స్ ఫలితాల్లో రోహిణి 73.8 స్కోరు సాధించి, రాష్ట్ర స్థాయిలో 29 గిరిజన పాఠశాలల్లో అగ్రస్థానంలో నిలిచింది.
నా స్కూల్ విద్యార్థులకు నా వంతు సాయం..
తన విజయం పట్ల రోహిణి స్పందిస్తూ.. “గత రెండేళ్లలో నా ఉపాధ్యాయుల కృషిని మర్చిపోలేను. నా ప్రధానోపాధ్యాయుడు, మా పాఠశాల సిబ్బంది కారణంగా నేను బాగా చదవగలిగాను. వారు నన్ను అన్ని పరీక్షలకు హాజరుకావాలని ప్రోత్సహించారు. నా ఫీజులన్నీ చెల్లించేందుకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. నాకు సహాయం చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. నేను ఇంజనీర్ కావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు నేను NIT-Tలో సీటు సంపాదించాను. నేను చదివిన పాఠశాల విద్యార్థులు ఈ రకమైన విజయం సాధించడానాకి నేను నా వంతు ప్రయత్నం చేస్తాను" అని గర్వంగా చెబుతోంది.
రోహిణి తల్లిదండ్రులు కేరళ వలస వెళ్లి భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. రోహిణి NEET, CLAT మరియు JEE సహా అన్ని పరీక్షలకు హాజరయ్యారు. ఆమె జేఈఈ మెయిన్స్‌లో 73.8% స్కోరు సాధించి, జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ ద్వారా నిట్ తిరుచ్చిలో కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో చోటు సంపాదించింది.
#WATCH | Tiruchirappalli, Tamil Nadu: Rohini, a girl belonging to a tribal community clears the JEE exam and will join the National Institute of Technology, Trichy. pic.twitter.com/gmhlN5CZdd
— ANI (@ANI) July 9, 2024
ALSO READ:
ఏపీలో ఇంజినీరింగ్ ఫీజులు ఖరారు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీలోని ఇంజినీరింగ్ కళాశాలల ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలోని దాదాపు ఇంజినీరింగ్ కాలేజీలు, ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులను నిర్ధారిస్తూ తాజాగా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కళాశాలల స్థాయిని బట్టి ఫీజు ఇంజినీరింగ్ కోర్సులకు అత్యధిక ఫీజు రూ.1.03 - రూ.1.05 లక్షలు ఉండగా, కనీస ఫీజు రూ.40 వేలుగా నిర్ణయించారు. ఇందులో రూ.40 వేల ఫీజు ఉన్న కళాశాలలు 114 ఉన్నాయి. లక్షకుపైగా ఫీజు ఉన్న కళాశాలలు ఎనిమిది ఉన్నాయి. ఇక రెండు ఆర్కిటెక్చర్ కళాశాలల్లో ఫీజులను రూ.35 వేలుగా ఖరారుచేశారు. కాగా ఈ ఫీజుల నిర్ధారణ కేవలం 2024-25 ఏడాదికి మాత్రమే వర్తించనున్నాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..