IIML: లక్నో- ఐఐఎంఎల్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు, వివరాలు ఇలా
లక్నోలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ , సీఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత ఉన్నవారు అర్హులు.
లక్నోలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ , సీఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా వచ్చే ఏడాది జనవరి 31లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. క్యాట్, గేట్, జీఆర్‌ఈ, జీమ్యాట్ పరీక్షల మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
వివరాలు...
🔰 డాక్టోరల్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (పీహెచ్‌డీ)
విభాగాలు: అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్, డెసిషన్ సైన్సెస్, ఎకనామిక్స్, ఫైనాన్స్ & అకౌంటింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ & సిస్టమ్స్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, స్ర్టాటజిక్ మేనేజ్‌మెంట్.
అర్హతలు:
➥ 55 శాతం మార్కులతో ఏదైనా పీజీ డిగ్రీ (లేదా) 65 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ (ఇంజినీరింగ్)/నాలుగేళ్ల గ్రాడ్యుయేట్ డిగ్రీ (లేదా) 55 శాతం మార్కులతో సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్ ప్రొఫెషనల్ డిగ్రీ ఉండాలి. డిగ్రీ స్థాయిలో బీకామ్ ఉండాలి. (లేదా) 60 శాతం మార్కులతో ఐఐఎం నుంచి పీజీడీఎం(రెండేళ్ల/మూడేళ్లు) ఉండాలి. (లేదా) ఐఐఎం లక్నో నుంచి పీజీపీడబ్యూఈ కోర్సు చేసి ఉండాలి.
➥ పదోతరగతి నుంచి అన్ని పబ్లిక్ పరీక్షల్లో 55 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి.
వయోపరిమితి: 30.06.2024 నాటికి 55 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: 2022, జనవరి 1 తర్వాత నిర్వహించిన క్యాట్, గేట్, జీఆర్‌ఈ, జీమ్యాట్ పరీక్షల మార్కుల ఆధారంగా.
దరఖాస్తుకు చివరితేది: 31.01.2024.
ALSO READ:
బీహెచ్‌ఈఎల్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్, సూపర్‌వైజర్ పోస్టులు - ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా అర్హతలు
బెంగళూరులోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్), తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజినీర్, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు ఇంజినీరింగ్ డిగ్రీ, ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ పోస్టులకు డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నవంబరు 1 వరకు దరఖాస్తులు సమర్పించి, నవంబరు 4లోగా నిర్ణీత చిరునామాకు దరఖాస్తు హార్డ్ కాపీలను పంపాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఖాళీలను భర్తీ చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఇండియన్ ఆర్మీలో 'టెక్నికల్ ఎంట్రీ స్కీమ్' దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
ఇండియన్ ఆర్మీలో జులై-2024లో ప్రారంభమయ్యే 51వ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్(టీఈఎస్) కోర్సు శిక్షణలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 90 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో 10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) లేదా దానికి సమానమైన పరీక్షతో పాటు జేఈఈ(మెయిన్స్)-2023లో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 13న ప్రారంభంకాగా.. నవంబరు 12 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..