TS LAWCET 2024: తెలంగాణ లాసెట్‌కు పెరిగిన దరఖాస్తులు, 'ఫైన్'తో దరఖాస్తుకు ఎప్పటివరకు అవకాశమంటే?
Telangana Lawcet: తెలంగాణ లాసెట్ పరీక్షలకు ఇప్పటివరకు మొత్తం 49,671 దరఖాస్తులు అందాయి. గతేడాది కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి.
![TS LAWCET 2024: తెలంగాణ లాసెట్‌కు పెరిగిన దరఖాస్తులు, 'ఫైన్'తో దరఖాస్తుకు ఎప్పటివరకు అవకాశమంటే? huge response for ts lawcet 2024 Submission of Online Applications with Late Fee is 25th may TS LAWCET 2024: తెలంగాణ లాసెట్‌కు పెరిగిన దరఖాస్తులు, 'ఫైన్'తో దరఖాస్తుకు ఎప్పటివరకు అవకాశమంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/17/a9de9ec3ce6b930659c65c0efe853ca71715925272443522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
TS LAWCET/ PGLCET 2024 Exams: తెలంగాణలోని న్యాయకళాశాలల్లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు ఎలాంటి ఆలస్యరుసుము లేకుండా దరఖాస్తు గడువు మే 4తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే రూ.2000 ఆలస్య రుసుముతో మే 20 వరకు, రూ.4000 ఆలస్య రుసుముతో మే 25 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఈసారి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటివరకు మొత్తం 49,671 దరఖాస్తులు అందాయి. గతేడాది కంటే 5,967 మంది అదనంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుకు మరింత గడువు ఉండటంతో.. దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో లాసెట్, పీజీఎల్‌సెట్ ప్రవేశ పరీక్షలను జూన్ 3న నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 20 నుంచి 25 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించినట్లు ఆమె తెలిపారు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్ 3న ఉదయం 9.00 గంటల నుంచి 10.30 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మూడేళ్ల డిగ్రీ కోర్సుకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక సాయంత్రం 4 గంటల నుంచి 5.30 వరకు అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, టీఎస్ పీజీఎల్ సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను మే 30 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీని జూన్ 6న విడుదల చేయనున్నారు. అభ్యర్థుల నుంచి జూన్ 7 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆ తర్వాత తుది ఆన్సర్ కీతోపాటు ఫలితాలను వెల్లడించనున్నారు.
వివరాలు...
➥ తెలంగాణ లాసెట్, పీజీఎల్‌సెట్ - 2024
కోర్సుల వివరాలు..
1) మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు
- ఎల్‌ఎల్‌బీ
- ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్)
అర్హత: 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. డిగ్రీ చివరిసంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు. ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ-ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.
2) ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు
- బీఏ ఎల్‌ఎల్‌బీ
- బీకామ్ ఎల్‌ఎల్‌బీ
- బీబీఏ ఎల్‌ఎల్‌బీ
అర్హత: 45 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు. ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ-ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.
3) రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సు
అర్హత: ఎల్‌ఎల్‌బీ/బీఎల్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లా డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: లాసెట్, పీజీఎల్ సెట్ ర్యాంకు ఆధారంగా.
దరఖాస్తు ఫీజు:
➦ లాసెట్ దరఖాస్తుకు రూ.900 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.
➦ పీజీఎల్‌సెట్ దరఖాస్తు్కు రూ.1100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.900 చెల్లిస్తే సరిపోతుంది.
పరీక్ష విధానం, మార్కులు, సిలబస్ వివరాల కోసం క్లిక్ చేయండి..
పరీక్ష అర్హత మార్కులు:
➥ లాసెట్ పరీక్షలో కనీస అర్హత మార్కులను 35 శాతంగా నిర్ణయించారు. అంటే 120 మార్కులకుగాను 42 మార్కులు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులకు ఎలాంటి అర్హతమార్కులు లేవు.
➥ పీజీఎల్‌సెట్ పరీక్షలో కనీస అర్హత మార్కులను 25 శాతంగా నిర్ణయించారు. అంటే 120 మార్కులకుగాను 30 మార్కులు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులకు ఎలాంటి అర్హతమార్కులు లేవు.
ముఖ్యమైన తేదీలు..
➥ టీఎస్ లాసెట్/పీజీఎల్‌సెట్ నోటిఫికేషన్: 28.02.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.03.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 04.05.2024.
➥ రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 10.05.2024.
➥ రూ.1,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 15.05.2024.
➥ రూ.2,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 20.05.2024
➥ రూ.4,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 25.05.2024
➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 20.05.2024 నుంచి 25.05.2024 వరకు.
➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 30.05.2024.
➥ లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్ష తేది: 03.06.2024.
➥ ప్రాథమిక కీ విడుదల: 06.06.2024.
➥ ప్రాథమిక ఆన్సర్ కీ అభ్యంతరాల గడువు: 07.06.2024.
➥ తుది కీ, ఫలితాల వెల్లడి: ప్రకటించాల్సి ఉంది.
పరీక్ష కేంద్రాలు: హైద్రాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కరీంనగర్, సిద్ధిపేట, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, నర్సంపేట, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి, విజయవాడ.
Application Fee Payment |
Fill Application Form |
Payment Status |
Download Application Form |
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)