News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

హెచ్‌సీయూలో ఎంటెక్ కోర్సు, ఎస్సీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, సెంటర్ ఫర్ మోడలింగ్ అండ్ సిమ్యులేషన్ అండ్ డిజైన్(సీఎంఎస్‌డీ) సంయుక్తంగా ఎంటెక్ ఇన్ మోడలింగ్ అండ్ సిమ్యులేషన్ కోర్సును నిర్వహిస్తున్నాయి.

FOLLOW US: 
Share:

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, సెంటర్ ఫర్ మోడలింగ్ అండ్ సిమ్యులేషన్ అండ్ డిజైన్(సీఎంఎస్‌డీ) సంయుక్తంగా ఎంటెక్ ఇన్ మోడలింగ్ అండ్ సిమ్యులేషన్ కోర్సును నిర్వహిస్తున్నాయి. కంప్యూటర్ సైన్స్, ఇన్‌ఫర్మేషన్ సైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, లైఫ్ సైన్సెస్ అండ్ ఇంజినీరింగ్ సైన్సెస్, టెక్నాలజీ రంగాల్లో అవసరమైన పరిజ్ఞానం పొందేందుకు ఈ కోర్సు ఉపయోగపడుతుంది. ప్రవేశాలు కోరువారు 04023138000 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు. హెచ్‌సీయూలో ఎంటెక్‌‌ కొత్త కోర్సును 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఏఐసీటీఈ ఆమోదం పొందిన ఈ కోర్సును మొత్తం 4 సెమిస్టర్లుగా అందిస్తున్నారు. 

కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ఎస్సీ గురుకుల ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల కళాశాలల్లో మిగిలిపోయిన ఇంటర్ ప్రథమ సంవత్సరం సీట్ల భర్తీకి జూన్ 6 నుంచి 15 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్ రాస్ జూన్ 5న ఒక ప్రకటనలో తెలిపారు. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.100 చెల్లించాలని ఆయన సూచించారు.

Also Read:

దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!
దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో గతేడాది మొదటి స్థానంలో నిలిచిన ఐఐటీ-మద్రాస్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2023 ర్యాంకుల్లో ఐఐటీ-మద్రాస్ తర్వాత రెండో స్థానంలో ఐఐఎస్సీ-బెంగళూరు నిలవగా, 3వ స్థానంలో ఐఐటీ-ఢిల్లీ నిలిచింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యాసంస్థల్లో ఐఐటీ-హైదరాబాద్ 14వ స్థానంలో నిలవగా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 20వ స్థానంలో నిలిచింది. వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) 53వ స్థానంలో, ఉస్మానియా యూనివర్సిటీ 64వ స్థానంలో నిలిచింది. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ 76వ స్థానంలో నిలిచింది. ఐఐటీ మద్రాసు అగ్రస్థానంలో నిలవడం ఇది ఐదోసారి కావడం విశేషం.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

ఉచిత ఏఐ కోర్సులు అందిస్తున్న గూగుల్, పూర్తి చేసిన వారికి బ్యాడ్జ్‌లు
ఇది ఏఐ యుగం. కృత్రిమ మేధ రాజ్యమేలడానికి సిద్ధమవుతోంది. ఇప్పుడు ఏ రంగంలో చూసినా కృత్రిమ మేధ దూసుకుపోతోంది. కేవలం టెక్నాలజీ రంగం అనే కాకుండా ప్రతి రంగంలోనూ ఆర్డిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశిస్తోంది. ఇప్పటికే చాట్ జీపీటీ, గూగుల్ బార్డ్ లాంటి ఏఐ టూల్స్ చేస్తున్న పనులు చూస్తూ నోరెళ్లబెడుతున్నాం. ఏఐ టూల్స్ వాడుకుంటూ వివిధ దేశాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు, సినీ, క్రీడా ప్రముఖులు వంట వండుతున్నట్లు, సెల్ఫీలు తీసుకుంటున్నట్లు క్రియేట్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాల్లో చూస్తూనే ఉన్నాం. ఈ రోజుల్లో ఏఐపై పెరుగుతున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని గూగుల్ సంస్థ ప్రత్యేకమైన కోర్సులను రూపొందించింది. 
పూర్తివివరాలకు క్లిక్ చేయండి..

తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాలు ఇలా!
హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023-23 విద్యాసంవత్సరానికి దూరవిద్య కేంద్రం (CDE) ద్వారా నిర్వహించే కోర్సుల్లో ప్రవేశాలకు మే 31న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా శిల్పం, చిత్రలేఖనం, డిజైన్స్, లైబ్రరీ సైన్స్, సంగీతం, రంగస్థలం, నృత్యం, జానపదం, తెలుగు, చరిత్ర, పర్యాటకం, భాషాశాస్త్రం, జర్నలిజం, జ్యోతిష్యం, యోగా తదితర అంశాలకు సంబంధించి.. డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 06 Jun 2023 11:40 AM (IST) Tags: Education News in Telugu HCU Admissions UOH Admissiosn UOH MTech Programme University of Hyderabd SC Gurukulam Inter admissions

ఇవి కూడా చూడండి

IITTP: తిరుపతి ఐఐటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, వివరాలు ఇలా

IITTP: తిరుపతి ఐఐటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, వివరాలు ఇలా

IIAD: ఐఐఏడీ-న్యూఢిల్లీలో యూజీ, పీజీ కోర్సులు - వివరాలు ఇలా

IIAD: ఐఐఏడీ-న్యూఢిల్లీలో యూజీ, పీజీ కోర్సులు - వివరాలు ఇలా

IITTP: తిరుపతి ఐఐటీలో ఎంఎస్‌ రిసెర్చ్‌ ప్రోగ్రామ్, వివరాలు ఇలా

IITTP: తిరుపతి ఐఐటీలో ఎంఎస్‌ రిసెర్చ్‌ ప్రోగ్రామ్, వివరాలు ఇలా

World University Rankings 2024: వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకుల్లో 91 భారతీయ విశ్వవిద్యాలయాలకు చోటు

World University Rankings 2024: వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకుల్లో 91 భారతీయ విశ్వవిద్యాలయాలకు చోటు

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

టాప్ స్టోరీస్

Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !

Kotamreddy :  చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత -  కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !

Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు - అర్ధరాత్రి ఆఖరి పూజ, వేకువజాము నుంచి యాత్ర

Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు - అర్ధరాత్రి ఆఖరి పూజ, వేకువజాము నుంచి యాత్ర

Nara Bramhani Politics : టీడీపీలో మోస్ట్ వాంటెడ్ లీడర్‌గా నారా బ్రాహ్మణి - రాజకీయాల్ని ఇక సీరియస్‌గా తీసుకుంటారా ?

Nara Bramhani Politics :  టీడీపీలో మోస్ట్ వాంటెడ్ లీడర్‌గా నారా బ్రాహ్మణి - రాజకీయాల్ని ఇక సీరియస్‌గా తీసుకుంటారా ?

Best Electric Scooters: దేశంలో టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు - కొనాలనుకుంటే ఆప్షన్లలో ఇవి ఉండాల్సిందే!

Best Electric Scooters: దేశంలో టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు - కొనాలనుకుంటే ఆప్షన్లలో ఇవి ఉండాల్సిందే!