అన్వేషించండి

ASER Report: ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న చేరికలు, అసర్ సర్వేలో వెల్లడి!

దేశంలోని అయిదేళ్ల చిన్నారుల్లో మూడింట ఒకవంతు మంది ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి కంటే తక్కువ తరగతిలోనే చదువుతున్నారు. నూతన విద్యా విధానం ప్రకారం దేశంలో 1వ తరగతిలో చేరడానికి చిన్నారుల వయసు ఆరేళ్లు ఉండాలి.

దేశంలో గత దశాబ్ద కాలంగా ఏటా 60 కంటే తక్కువ విద్యార్థులు చేరుతున్న ప్రభుత్వ పాఠశాలల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. అసర్ (యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌) నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దేశంలో గల అయిదేళ్ల చిన్నారుల్లో మూడింట ఒకవంతు మంది ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి కంటే తక్కువ తరగతిలోనే చదువుతున్నారు. నూతన విద్యా విధానం ప్రకారం దేశంలో 1వ తరగతిలో చేరడానికి చిన్నారులకు కనిష్ఠంగా ఆరేళ్ల వయసు వచ్చి ఉండాలి.

నివేదిక వివరాలు ఇలా..

➥ 2022లో చిన్న పాఠశాలలు ఎక్కువగా హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఉన్నాయి. వాటి సంఖ్య ఉత్తర్‌ప్రదేశ్‌లో 2018లో 10.4% నుంచి 2022లో 7.9%కు, కేరళలో 2018లో 24.1%నుంచి 2022లో 16.2%కు తగ్గింది.

➥ తొలి అసర్‌ సర్వే 2005లో జరిగింది. అప్పట్నుంచి పదేళ్ల పాటు ఏటా నిర్వహించారు. మళ్లీ నాలుగేళ్ల తర్వాత 2022లో తొలిసారిగా క్షేత్రస్థాయి ప్రాథమిక సర్వే చేశారు. కొవిడ్ మహమ్మారి కారణంగా పాఠశాలలు మూసేసిన తర్వాత మళ్లీ ఇప్పుడే విద్యార్థులు వస్తుండటంతో ఈ సర్వే ప్రాధాన్యం సంతరించుకుంది.

➥ ఇందులో భాగంగా 19,060 గ్రామాల్లోని 3,74,544 కుటుంబాల్లో 3 నుంచి 16 సంవత్సరాల మధ్య వయసున్న 6,99,597 మంది పిల్లలను పరిశీలించారు. 2018 స్థాయి కంటే విద్యాహక్కు చట్టంలోని సూచికలన్నింటిలో దేశవ్యాప్తంగా కొంత మెరుగుదల కనిపించింది.

➥ 2018లో బాలికలు ఉపయోగించగల మరుగుదొడ్లు 66.4% ఉండగా, అది 2022లో 68.4%కు పెరిగింది. అలాగే తాగునీటి సదుపాయం 74.8% నుంచి 76%కు పెరిగింది. పాఠ్యపుస్తకాలే కాక, ఇతర పుస్తకాలున్న పాఠశాలల సంఖ్య 36.9% నుంచి 44%కు పెరిగింది.

➥ అయితే రాష్ట్రాల వారీగా ఈ గణాంకాల్లో తేడాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో తాగునీరు అందుబాటులో ఉన్న పాఠశాలల సంఖ్య 2018లో 58.1% నుంచి 2022 నాటికి 65.6%కు పెరిగింది.

అరుణాచల్‌ ప్రదేశ్‌లో పెరిగిన చేరికలు
➥ అరుణాచల్ ప్రదేశ్‌లో గత 15 ఏళ్లలో పాఠశాలల్లో పిల్లల చేరిక పెరిగింది. 2018లో ఇది 97.2% ఉండగా, 2022లో 98.4% ఉంది. ప్రథమ్ ఫౌండేషన్ కారణంగా ఇక్కడి అభ్యసన ఫలితాలు మెరుగుపడ్డాయి.

➥ సుకన్యా సమృద్ధి యోజన, బేటీ బచావో బేటీ పఢావో లాంటి కార్యక్రమాలతో పాఠశాలల్లో బాలికల చేరిక కూడా పెరిగింది. కానీ... ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అయిదో తరగతి పిల్లలు తీసివేతలు చేయగల సామర్థ్యం 2018లో 27.1% ఉండగా, 2022లో 22.9%కు తగ్గింది.

➥ ఎనిమిదో తరగతిలోనూ తీసివేతలు చేసే సామర్థ్యం 2018లో 49.3% నుంచి 2022లో 45.9%కు తగ్గింది. సాధారణ ఇంగ్లిషు వాక్యాలు చదివే సామర్థ్యం అరుణాచల్ ప్రదేశ్‌లో కొద్దిగా పెరిగింది.

Also Read:

ఇక కంప్యూటర్‌ సైన్స్‌లో ‘బీఎస్సీ ఆనర్స్‌' డిగ్రీ, ఈ ఏడాది నుంచే అమల్లోకి!
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో కొత్తగా బీఎస్సీ ఆనర్స్ కోర్సును అందుబాటులోకి తేనున్నారు. 2023-24 విద్యాసంవత్సరం నుంచే కళాశాలల్లో హానర్స్ కోర్సును ప్రవేశపెట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. జనవరి 20న హైదరాబాద్‌లోని విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన పాలకమండలి సమావేశంలో ఈ మేరకు ఆమోదముద్ర వేశారు. ఈ సమావేశంలో విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. 
కోర్సుల పూర్తి వివరాలు ఇలా..

'ప్రతిభావంతులకు' సహకారం, ఓఎన్‌జీసీ 'ఉపకారం' - ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్‌!
ఆయిల్ & నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్‌జీసీ) 2021-22 విద్యా సంవత్సరానికిగాను వివిధ స్కాలర్‌షిష్‌ల కోసం డిగ్రీ, పీజీ విద్యార్థుల నుంచి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ ఉపకారవేతనాలు పొందడానికి అర్హులు. విద్యార్థుల వయసు 30 సంవత్సరాలలోపు ఉండాలి. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షల్లోపు ఉండాలి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్‌ అందుతుంది. 
స్కాలర్‌షిప్ వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు కీలక ప్రకటన చేసిన టీటీడీ
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు కీలక ప్రకటన చేసిన టీటీడీ
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
WhatsApp New Features: ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP DesamUdhaynidhi Stalin on Pawan Kalyan Comments | పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఉదయనిధి కౌంటర్లు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు కీలక ప్రకటన చేసిన టీటీడీ
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు కీలక ప్రకటన చేసిన టీటీడీ
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
WhatsApp New Features: ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
OG Update: 'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
World War III : మూడో ప్రపంచయుద్ధం వస్తే ఈ దేశాలు చాలా సేఫ్ - ముందే పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకుంటే మంచిదేమో ?
మూడో ప్రపంచయుద్ధం వస్తే ఈ దేశాలు చాలా సేఫ్ - ముందే పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకుంటే మంచిదేమో ?
Tirumala News: తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
Best Budget Cars: రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
Embed widget