అన్వేషించండి

GATE - 2024: 'గేట్' దరఖాస్తుకు నేటితో ఆఖరు, ఆలస్యరుసుముతో ఎప్పటివరకంటే?

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌(గేట్‌)-2024 దరఖాస్తు గడువు ఆలస్యరుసుము లేకుండా అక్టోబర్ 12తో ముగియనుంది. ఆలస్యరుసుముతో అక్టోబరు 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో పీజీ, డాక్టోరల్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌(గేట్‌)-2024 దరఖాస్తు గడువు ఆలస్యరుసుము లేకుండా అక్టోబర్ 12తో ముగియనుంది.  అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే రూ.500 ఆలస్యరుసుముతో అక్టోబరు 20 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఏడాది గేట్ పరీక్షను  ఐఐఎస్సీ-బెంగళూరు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో గేట్ పరీక్షలను నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 200 నగరాలు, పట్టణాల్లో పరీక్ష జరుగుతుంది. గేట్‌లో సాధించిన స్కోరును బట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహించి, ఉద్యోగాలకు ఎంపిక చేస్తాయి.  'గేట్‌'లో ఇప్పటివరకు మొత్తం 29 ప్రశ్నపత్రాల్లో పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి కొత్తగా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(డీఏ) ప్రశ్నపత్రాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీంతో గేట్ పరీక్షలో మొత్తం పేపర్ల సంఖ్య 30కి చేరినట్లయింది.

గేట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 7 ఐఐటీలు (బొంబయి, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ)తోపాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్ ఆఫ్ సైన్స్, ఇతర ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు కూడా గేట్ స్కోరునే ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి. కొన్ని ప్రభుత్వ సంస్థలు గేట్ స్కోరు ద్వారా ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నాయి.

అర్హతలు..

✦ బ్యాచిలర్స్ డిగ్రీ (ఇంజినీరింగ్/టెక్నాలజీ).

✦ బ్యాచిలర్స్ డిగ్రీ (ఆర్కిటెక్చర్).

✦ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ విభాగంలో నాలుగేళ్ల డిగ్రీ.

✦ మాస్టర్ డిగ్రీ (సైన్స్/మ్యాథ్స్/స్టాటిస్టిక్స్/కంప్యూటర్ అప్లికేషన్స్).

✦ నాలుగేళ్ల ఇంటిగ్రేడెట్ మాస్టర్ డిగ్రీ (ఇంజినీరింగ్/టెక్నాలజీ).

✦ ఐదేళ్ల ఇంటిగ్రేడెట్ మాస్టర్ డిగ్రీ లేదా డ్యూయల్ డిగ్రీ (ఇంజినీరింగ్/టెక్నాలజీ).

✦ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఎలా?

✦ గేట్ పరీక్షకు దరఖాస్తు చేయగోరువారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

✦ రిజిస్ట్రేషన్ తర్వాత అభ్యర్థికి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వస్తాయి. వీటి ద్వారా గేట్‌కు సంబంధించిన భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది.

✦ దరఖాస్తు సమయంలో విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికేట్ స్కాన్ కాపీలు, ప్రొవిజనల్ సర్టిఫికేట్లు అందుబాటులో ఉంచుకోవాలి.

✦ ఐడీ ప్రూఫ్ తప్పనిసరిగా అవసరమవుతుంది. ఐడీ ప్రూఫ్‌గా పాస్‌పోర్ట్, పాన్ కార్డు, ఓటరు కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, కాలేజీ ఐడీ, ఎంప్లాయ్ ఐడీకార్డుల్లో ఏదైనా ఒకటి తప్పనిసరిగా ఉండాలి.

పరీక్ష విధానం..

✦ మొత్తం 30 సబ్జెక్టుల్లో గేట్ పరీక్ష నిర్వహిస్తారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలతోపాటు.. ఇతర దేశాలలోని నగరాల్లో కూడా గేట్ పరీక్ష నిర్వహిస్తారు.

✦ ప్రకటించిన తేదీల్లో మొత్తం రెండు సెషన్లలో (9:30 am - 12:30 pm,  2:30 pm - 5:30 pm.) గేట్ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.

✦ ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే గేట్ పరీక్షలో 100 మార్కులకు 65 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి 10 ప్రశ్నలకుగాను 15 మార్కులు; టెక్నికల్, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగాల నుంచి 55 ప్రశ్నలకుగాను 85 మార్కులు ఉంటాయి.

✦ నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. 1 మార్కు ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానాకి 1/3 చొప్పున, 2 మార్కుల ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానాకి 2/3 చొప్పున కోత విధిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు..

తెలంగాణలో: హైదరాబాద్, మెదక్, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్

ఏపీలో: చీరాల, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కడప, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, ఏలూరు, కాకినాడ, సూరంపాలెం, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, కర్నూలు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 31.08.2023. 

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 29.09.2023. (12.10.2023 వరకు పొడిగించారు).

➥ రూ.500 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది: 20.10.2023

➥ గేట్- 2024 పరీక్ష తేదీలు: 2024, ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో.

Notification

Online Application

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustad Zakir Hussain : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించారని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించారని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
IND vs AUS: బ్రిస్బేన్‌లో భారత్‌ ముందు భారీ స్కోర్‌- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌; బుమ్రాకు 6 వికెట్లు 
బ్రిస్బేన్‌లో భారత్‌ ముందు భారీ స్కోర్‌- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌; బుమ్రాకు 6 వికెట్లు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustad Zakir Hussain : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించారని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించారని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
IND vs AUS: బ్రిస్బేన్‌లో భారత్‌ ముందు భారీ స్కోర్‌- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌; బుమ్రాకు 6 వికెట్లు 
బ్రిస్బేన్‌లో భారత్‌ ముందు భారీ స్కోర్‌- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌; బుమ్రాకు 6 వికెట్లు 
Telangana Weather: తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
Embed widget