Education in Mother Tongue: ఇక చదువులన్నీ మాతృభాషలోనే, స్పష్టం చేసిన ప్రధానమంత్రి మోదీ
దేశంలోని చదువులన్నీ ఇక మాతృభాషలోనే సాగనున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నూతన విద్యావిధానంతో భారత్‌లోని భాషలన్నింటికి గౌరవం తేనున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
దేశంలోని చదువులన్నీ ఇక మాతృభాషలోనే సాగనున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నూతన విద్యావిధానంతో భారత్‌లోని భాషలన్నింటికి గౌరవం తేనున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రధానమంత్రి శనివారం(జులై 29) న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ‘అఖిల భారత శిక్షా సమాగం’ మూడో వార్షికోత్సవంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా సాంఘిక శాస్త్రం నుంచి ఇంజినీరింగ్ వరకు బోధన ఇక మాతృభాషలోనే జరగనుందని చెప్పారు.
సామర్థ్యం ఆధారంగా కాకుండా భాషను బట్టి విద్యార్థుల ప్రతిభను అంచనా వేస్తున్నామని.. ఇది యువ ప్రతిభకు మనం చేస్తున్న అతి పెద్ద అన్యాయమని, అందుకే నూతన విద్యా విధానం తీసుకొచ్చామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇక మాతృభాషలో బోధన ద్వారా భారత్‌లో యువ ప్రతిభకు అసలైన న్యాయం జరగనుందని మోదీ అన్నారు. సామాజిక న్యాయపరంగానూ ఇది కీలక అడుగుగా ప్రధాని అభివర్ణించారు.
అభివృద్ధి చెందిన చాలా దేశాలు తమ భాష ద్వారే ప్రగతి సాధించాయని, ఐరోపానే తీసుకుంటే అక్కడ చాలా దేశాలు.. తమ స్థానిక భాషలనే వినియోగిస్తాయి. మనం మాత్రం ఎన్నో భాషలు అందుబాటులో ఉన్నా.. వాటిని వెనకబాటుతనానికి సంకేతంగానే చూపించామని, ఇంత కన్నా దౌర్భాగ్యం ఏముంటుందని మోదీ అభిప్రాయపడ్డారు.
ఎంత తెలివైన వ్యక్తి అయినా.. అతనికి ఇంగ్లిషు రాకపోతే ఆ ప్రతిభను తొందరగా స్వీకరించలేని పరిస్థితిలో ఉన్నామని, దీనివల్ల గ్రామీణ భారతంలోని తెలివైన విద్యార్థులకు అతి పెద్ద నష్టం వాటిల్లుతుందని.. నూతన విద్యావిధానంతో ఈ హీన భావనను తొలగించడానికి ప్రయత్నం ప్రారంభించినట్లు మోదీ అభిప్రాయపడ్డారు.
ఐక్యరాజ్యసమితిలోనూ నేను భారత భాషలోనే మాట్లాడతానని.. దీనివల్ల వినేవాళ్లకు చప్పట్లు కొట్టడానికి సమయం పడుతుందేమో.. పట్టనీయండి. సాంఘిక శాస్త్రాల నుంచి ఇంజినీరింగ్ వరకు బోధన ఇక భారతీయ భాషల్లోనే జరగనుంది. మాతృభాషతో ఇంకో పెద్ద లాభం కూడా ఉంది. అదేంటంటే ఇప్పటివరకు భాషా రాజకీయాలతో విద్వేషాలకు తెరలేపిన వారు తమ దుకాణాలను మూసుకోవాల్సి ఉంటుంది. నూతన విద్యా విధానంతో దేశంలో ప్రతి భాషకూ గౌరవం లభించనుంది మోదీ పేర్కొన్నారు.
ALSO READ:
నల్సార్ యూనివర్సిటీలో ఎంఏ&అడ్వాన్స్‌డ్ డిప్లొమా ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దూరవిద్య విధానంలో 2023-2024 విద్యా సంవత్సరానికి ఎంఏ, అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా ఆగస్టు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఓయూ దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ ప్రకటన విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని ప్రొఫెసర్ రామిరెడ్డి దూరవిద్య కేంద్రం (ఓయూసీడీఈ) ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ వెలువడింది. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.900 చెల్లించి జులై 28 నుంచి ఆగస్టు 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే రూ.500 ఆలస్య రుసుముతో ఆగస్టు 18 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రవేశ పరీక్ష ఆధారంగా కోర్సు్ల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రవేశాల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..