అన్వేషించండి

Dasara Holidays 2022: తెలంగాణలో 16 రోజుల 'దసరా' సెలవులు, ఏపీలో సెలవులు ఇలా?

తెలంగాణ‌లో పాఠశాలలు, కళాశాలలకు ఈ సారి 16 రోజులపాటు, ఏపీలో 11 రోజులపాటు దసరా సెలువులు ఇవ్వనున్నారు.

తెలంగాణ‌లో పాఠశాలలు, కళాశాలలకు ఈ సారి 16 రోజులపాటు దసరా సెలవులు రానున్నాయి. సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 10 వరకు మొత్తం 14 రోజులు దసరా సెలవులు ఇవ్వనున్నారు. అలాగే ఈసారి బతుకమ్మ, దసరా పండుగలకు సెల‌వులు క‌లిపి మొత్తం 16 రోజులు సెలవులు రానున్నాయి. ఈ మేర‌కు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలల అకడమిక్‌ క్యాలెండర్‌ 2022-23లో దసరా సెలవులకు సంబంధించిన వివ‌రాల‌ను ప్రక‌టించిన విష‌యం తెలిసిందే. 

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెలవులు ఇవే..
♦ సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 10 వరకు దసరా సెలవులు (14రోజులు). బతుకమ్మ, దసరా పండుగలకు సెల‌వులు క‌లిపి మొత్తం 16 రోజులు సెలవులు.
♦ క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 వరకు కొనసాగనున్నాయి.
♦ జనవరి 13 నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు
♦ వేసవి సెలవులు ఏప్రిల్ 25‌, 2023 నుంచి జూన్‌ 11, 2023 వరకు


ఏపీలో దసరా సెలవులు ఇలా..
ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నట్లు సమాచారం. క్రిస్టియన్‌ మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబరు 1 నుంచి 6 వరకు ఇవ్వనున్నారు. ఏపీ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అకడమిక్ క్యాలెండర్(2022-23)లో దసరా హాలీడేస్ గురించి ముందుగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం మొత్తంలో 220 రోజులు పాఠశాలలు పనిచేస్తాయని, 80 రోజులు సెలవులు ఉంటాయని తెలిపింది.

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెలవులు ఇవే..
♦ ఈ ఏడాది విద్యార్థులకు సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబరు 6 వరకు దసరా సెలవులు. 
♦ క్రిస్టియన్‌ మైనారిటీ పాఠశాలలకు దసరా సెలవులు అక్టోబరు 1 నుంచి 6వ తేదీ వరకు ఇస్తారు. 
♦ క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకూ ఇస్తారు.
♦ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16 వరకు ప్రకటించింది.


Also Read:

NMMS: నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ దరఖాస్తు చేశారా? సెప్టెంబరు 30 వరకు అవకాశం!
నేషనల్‌ మీన్స్​‍ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ కోసం సెప్టెంబరు 30 లోపు విద్యార్థులు దరఖాస్తులు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు సూచించారు. 9వ తరగతి విద్యార్థులు కొత్తగా స్కాలర్‌షిప్‌ కోసం, 10వ తరగతితోపాటు ఇంటర్‌ (11వ, 12వ తరగతుల) విద్యార్థులు రెన్యువల్స్​‍కు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు వెబ్‌సైట్ చూడవచ్చు.

Website: www.bse.telangana.gov.in 

ఆర్థికంగా వెనుకబడిన, ప్రతి భావంతులైన విద్యార్థులను ఆర్థికంగా ఆదుకొని.. డ్రాపవుట్ల సంఖ్యను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌(ఎన్‌ఎంఎంఎస్‌) పథకాన్ని అమలు చేస్తోంది.ముఖ్యంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకూ చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా లక్ష మందికి కేంద్ర ప్రభుత్వం ఈ ఉపకార వేతనాలను ప్రకటిస్తోంది.

రూ.12వేల స్కాలర్‌షిప్‌

⦁    ఈ స్కీమ్‌కు ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ /10+2 తత్సమాన తరగతి పూర్తిచేసే వరకు ఈ స్కాలర్‌షిప్‌ లభిస్తుంది.
 
⦁    తొమ్మిదో తరగతి నుంచి పదోతరగతికి స్కాలర్‌షిప్‌ కొనసాగాలంటే.. అభ్యర్థి 55శాతం మార్కులతో ప్రమోట్‌ కావాలి. అలాగే పదోతరగతిలో 60శాతం మార్కులు సాధిస్తే.. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో ఉపకార వేతనం అందుతుంది. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 55శాతం మార్కులతో ప్రమోట్‌ అయితే రెండో సంవత్సరంలో స్కాలర్‌షిప్‌ అందిస్తారు. ఇందుకోసం విద్యార్థులు ప్రతి ఏటా స్కాలర్‌షిప్‌ రెన్యూవల్‌ చేసుకోవాలి.

స్కాలర్‌షిప్ దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణTDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Embed widget