అన్వేషించండి

DOST: 'దోస్త్‌' ప్రవేశాల షెడ్యూల్‌లో మార్పు! సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పొడిగింపు

తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి 'దోస్త్‌' ద్వారా సీట్లు పొందిన విద్యార్థులు సంబంధిత కళాశాలల్లో సెల్ప్ రిపోర్టింగ్ చేసే గడువును పొడిగిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది.

తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి 'దోస్త్‌' ద్వారా ప్రవేశాలు పొందినవారికి ఉన్నత విద్యామండలి కీలక సూచన చేసింది. సీట్లు పొందిన విద్యార్థులు సంబంధిత కళాశాలల్లో సెల్ప్ రిపోర్టింగ్ చేసే గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో కురుస్తున్న ఏకధాటి వర్షాల వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు గడువును పెంచారు. మూడో విడతలో సీట్లు పొందిన విద్యార్థులతోపాటు..  అన్ని విడతల్లో సీట్లు సాధించిన విద్యార్థులు జులై 26లోపు సంబంధిత కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలని అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా జులై 26 నుంచే తరగతులు కూడా ప్రారంభంకానున్నాయి. కళాశాలలో చేరిన వారు మరో బ్రాంచిలోకి మారేందుకు జులై 28 నుంచి 31 వరకు ఇంట్రా కాలేజ్‌ ప్రక్రియ జరుగుతుందని, వారికి ఆగస్టు 1న సీట్లు కేటాయిస్తామని 'దోస్త్‌' అధికారులు ఈ మేరకు ప్రకటించారు.

మొదటి విడత ఇలా..
దోస్త్ మొద‌టి విడత‌లో 73,220 మంది విద్యార్థులకు జూన్ 16న సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థుల్లో 44,113 మంది అమ్మాయిలు, 29,107 మంది అబ్బాయిలు ఉన్నారు. దోస్త్‌ ద్వారా ప్రవేశాలకు అందుబాటులో 889 కళాశాలలు ఉండగా.. వాటిల్లో  మొత్తం సీట్లు 3,56,258 సీట్లు ఉన్నాయి. ఇక 63 కళాశాలల్లో ఎలాంటి ప్రవేశాలు జరుగలేదు. డిగ్రీ కామ‌ర్స్ కోర్సుల్లో చేరేందుకే విద్యార్థులు సుముఖ‌త చూపించడం విశేషం. మొత్తం 33,251 మంది విద్యార్థులు కామ‌ర్స్ కోర్సుల‌ను ఎంపిక చేసుకున్నారు.

రెండో విడత ఇలా..
డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌- తెలంగాణ(దోస్త్‌) రెండో విడత సీట్ల కేటాయింపులో భాగంగా 49,267 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు.  రెండో విడతలో సీట్లు పొందిన వారిలో కామర్స్‌(బీబీఏ సహా)- 21,255, లైఫ్‌ సైన్సెస్‌- 11,944, ఫిజికల్‌ సైన్సెస్‌- 9,076, ఆర్ట్స్‌- 6,307, డేటా సైన్స్‌- 431, ఇతర కోర్సులో 81 మంది ఉన్నారు. తొలి విడతలో 73,220 మంది సీట్లు దక్కించుకున్నా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ 49 వేల మందే చేశారు. 

మూడో విడత ఇలా..
డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన 'దోస్త్‌' మూడో విడత సీట్లను జులై 20న అధికారులు కేటాయించారు. రెండో విడతలో మొత్తం 49,267 మందికి సీట్లను కేటాయించగా.. మూడో విడతలో 72,949 మందికి సీట్లు కేటాయించారు. మూడో విడతలో సీట్లు పొందినవారిలో 10,939 మంది ఆర్ట్స్‌ కోర్సును ఎంచుకోగా.. 32,209 మంది కామర్స్‌ కోర్సును ఎంచుకున్నారు. ఇక లైఫ్‌ సైన్స్‌ కోర్సును 16,859 మంది, ఫిజికల్‌ సైన్సెస్‌ కోర్సును 12,620 మంది ఎంచుకున్నారు. డిఫార్మసీ సీట్లు పొందిన వారు కేవలం 235 మంది మాత్రమే ఉన్నారు. ఇతర కోర్సులను ఎంచుకున్న వారు 87 మంది ఉన్నారు. 

'దోస్త్' మూడు రౌండ్ల సీట్లకేటాయింపు వివరాలు పరిశీలిస్తే.. మొత్తంగా 1,95,436 మంది విద్యార్థులకు అధికారులు సీట్లను కేటాయించారు. మొదటి విడతలో 73,220, రెండో విడతలో 49,267, మూడో విడతలో 72949 మందికి సీట్లు పొందారు. అయితే వీరిలో మొదటి విడతలో సీటు పొందినవారు.. రెండో విడతకు, రెండో విడతలో సీటు పొందిన వారు మూడో విడత కౌన్సెలింగ్‌లో ఉత్తమ కాలేజీ, కోర్సు కోసం కౌన్సెలింగ్‌లో పాల్గొంటూ ఉంటారు. ఈ క్రమంలో మొత్తం ఎన్ని సీట్లు భర్తీ అయినాయి తెలియాలంటే తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తి కావాల్సి ఉంది.

ఆగస్టు 1 నుంచి స్పెషల్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌..
'దోస్త్' స్పెషల్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులకు ఆగస్టు 16న సీట్లను కేటాయించనున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

AP Recruitment Age Limit: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
AP Congress new incharge: ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు - పీసీ మోహన్ రాకతో జాతకం మారుతుందా? ఓటు బ్యాంకు తిరిగొస్తుందా?
ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు - పీసీ మోహన్ రాకతో జాతకం మారుతుందా? ఓటు బ్యాంకు తిరిగొస్తుందా?
Saifabad పీఎస్‌లో పీఏ, పీఆర్వోలపై దాడిపై కేటీఆర్ మండిపాటు.. నిజం కాదన్న ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి
పీఎస్‌లో పీఏ, పీఆర్వోలపై దాడిపై కేటీఆర్ మండిపాటు.. నిజం కాదన్న ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి
Dhiraj Bommadevara Wins Gold: స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Recruitment Age Limit: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
AP Congress new incharge: ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు - పీసీ మోహన్ రాకతో జాతకం మారుతుందా? ఓటు బ్యాంకు తిరిగొస్తుందా?
ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు - పీసీ మోహన్ రాకతో జాతకం మారుతుందా? ఓటు బ్యాంకు తిరిగొస్తుందా?
Saifabad పీఎస్‌లో పీఏ, పీఆర్వోలపై దాడిపై కేటీఆర్ మండిపాటు.. నిజం కాదన్న ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి
పీఎస్‌లో పీఏ, పీఆర్వోలపై దాడిపై కేటీఆర్ మండిపాటు.. నిజం కాదన్న ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి
Dhiraj Bommadevara Wins Gold: స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
Gannavaram News: గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
Telangana Assembly Protest Case: పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
Vinayaka Chavithi At Chandrababu Home: ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు Photos చూశారా
Hyderabad Crime News: అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
Embed widget